Minister Niranjan Reddy: చెక్ డ్యాముల ఏర్పాటు ద్వారా జల వనరులు పుష్కలంగా ఉన్నాయని, జిల్లాలో పూర్తిస్థాయిలో వ్యవసాయ సాగు అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.

Minister Niranjan Reddy Checking Dam
గురువారం వనపర్తి జిల్లాలోని పడమటి తండా, చీమనగుంటపల్లి, కర్నే తండా, సల్కలాపురం, అప్ప రెడ్డిపల్లి, వెంకటం పల్లి, చిలుకతోని పల్లి, వెల్టూరు చెక్ డ్యాములను, బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ ను, వీరాంజనేయ లిఫ్ట్ ఇరిగేషన్ను, గణప సముద్రం పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి 11 చెక్ డ్యాములు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో 9 చెక్ డ్యాములు పూర్తి చేయడం జరిగిందని, రెండు పూర్తి కావలసి ఉన్నదని ఆయన అన్నారు. భూగర్భ జలమట్టం రికార్డు స్థాయిలో పెరిగిందని, రాష్ట్రంలోనే భూగర్భ జలాల లభ్యతలో వనపర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.
Also Read: Agros New Chairman: అగ్రోస్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తిప్పన విజయసింహారెడ్డి..!
కర్ని తాండ లెఫ్ట్ ఇరిగేషన్ రూ.76 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో 216 గ్రామాలు, జనావాస ప్రాంతాలు ఉన్నాయని, 100 శాతం అన్ని గ్రామాలకు కృష్ణా నీరు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. చెక్ డ్యాములు, వాగులు కుంటలు, కాలువలు, రిజర్వాయర్లు పునరుద్ధరించి, పశు సంపద, వృక్ష సంపదను అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన సూచించారు. కాశీం నగర్, అనుబంధ తాండాలకు కృష్ణా జలాలను పైపులైన్ ద్వారా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాశీంనగర్, రేమద్దుల, కిష్టాపూర్ గ్రామాలలో రిజర్వాయర్ కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఆయన తెలిపారు.
Also Read: Cotton Marketing: పత్తికి మంచి ధర దక్కాలంటే రైతులు వీటిని పాటించాలి.!
చెక్ డ్యాముల ద్వారా జిల్లాలోని కరువును శాశ్వతంగా దూరం చేయడం జరిగిందని, పుష్కలంగా పంటలు సాగు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 98 వేల ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగిందని, రాష్ట్రంలోనే వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నదని ఆయన అన్నారు. త్వరలో జిల్లాకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఏర్పాటుకు శ్రీరంగాపూర్, కనాయపల్లి, నగరాల, కంబల్లాపూర్ ప్రాంతాలలో స్థలాలను పరిశీలించడం జరిగిందని ఆయన వివరించారు. ఏర్పాటు చేసేందుకు 100 కు పైగా పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

Minister Niranjan Reddy
బుద్ధారం, ఘనపూర్ చెక్ డ్యాముల పునరుద్ధరణకు రూ.47, రూ. 45 కోట్లతో టెండర్లకు ప్రతిపాదనలు పంపటం జరిగిందని, అతి త్వరలో వాటిని పూర్తి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. గణప సముద్రం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన తెలిపారు. వలసలు జిల్లా నుండి రాష్ట్రంలోని వ్యవసాయ ఆధారిత సాగులో అగ్రగామిగా నిలుస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన నీటి పారుదల శాఖ అధికారులకు సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ అడ్వైజర్ విజయ్ ప్రకాష్, చీఫ్ ఇంజనీర్ హమిద్ ఖాన్, రఘునాథ్ రావు, ఈ ఈ. మధుసూదన్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.
Also Read: Thutikada Kashayam: తూటికాడతో దోమపోటు నివారణ.!
Also Watch: