Agriculture Research and Extension Systems Breeding Program 2022: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వావిద్యాలయం, ఇంటర్ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఐ ఆర్ ఆర్ ఐ ), కన్ సెల్టేటివ్ గ్రూప్ ఫర్ ఇంటర్ నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎక్స్ టెన్షన్ సిస్టమ్స్ బ్రీడింగ్ ప్రోగ్రాం పై రాజేంద్ర నగర్ లోని వాటర్ టెక్నాలజీ సెంటర్ లో వర్క్ షాప్ ప్రారంభం అయింది. మూడు రోజుల పాటు ఇది జరగనుంది.
యూనివర్శిటీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్, డాక్టర్ సీమ ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగించారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహార ధాన్యాల లభ్యత చాలా తక్కువ వుండేదని క్రమేణా నేటికి ఆ సమస్య లేకుండా స్వయం సమృద్ధి సాధించగలిగామని అన్నారు. అయితే వాతావరణ మార్పుల వల్ల కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని వాటిని ఎదుర్కోవటానికి సిద్ధం కావాలని సీమ అన్నారు.
ఈ వర్క్ షాప్ ను ఉద్దేశించి ఐ ఆర్ ఆర్ ఐ శాస్త్రవేత్త డాక్టర్ సంజయ్ కటియార్ ప్రసంగించారు.
రోజు రోజు కి ప్రపంచవ్యాప్తం గా అధికం అవుతున్న జనాభా, వాతావరణం లో సంభవిస్తున్న మార్పులు అందరి పైన ప్రభావం చూపిస్తూ, సవాళ్లు విసురుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అధికం అవుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి, వాతావరణ మార్పులు తట్టుకోవడానికి అవసరం అయిన కొత్త విత్తనాలని రూపొందించవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. అదే విధంగా స్వల్ప కాలం లో విత్తనాల రూపకల్పనకి అంతర్జాతియ స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు సంస్థలు, శాస్త్రవేత్తలు పరస్పర సహకారం తో పని చేయాలని కటియార్ సూచించారు.
ఈ కార్యక్రమం లో వర్సిటీ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్,విత్తన సంచాలకులు డాక్టర్ పి. జగన్ మోహన్ రావు,డిపార్ట్మెంట్ ఆఫ్ జెని టెక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ హెడ్ డాక్టర్ దుర్గా రాణి,రైస్ ప్రిన్సిపల్ సైన్టిస్ట్ డాక్టర్ రఘు రామిరెడ్డి, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
డాక్టర్ అంబేద్కర్ కి ఘన నివాళి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి(మహా పరినిర్వాన్ దివస్) సందర్బంగా ఆయన కి ఘనంగా నివాళులు అర్పించారు. వర్సిటీ పరిపాలన భవనం లో జరిగిన కార్యక్రమం లో పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే వర్సిటీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది కూడా బీ ఆర్ అంబేద్కర్ కి నివాళులు అర్పించారు.
Also Read: Milk Health Benefits: పాల నాణ్యత బాగుంటే లాభాలు మీ వెంటే వస్తాయి.!