Carrot Cultivation: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శీతాకాలం పంటగా క్యారెట్ ఎక్కు వగా సాగుచేస్తారు. దీనిలో ఆరోగ్యా నికి అవసరమైన అధిక పోషక విలు వలు, ఔషధ గుణాలు ఉండటం వల్ల ఈ పంట బాగా ప్రాచుర్యం పొందింది. త్వరగా పంట వచ్చి పురుగులు, తెగుళ్ళు తక్కువగా ఆశి స్తాయి. క్యారెట్లో అధికంగా విట మిన్ ‘ఎ’, కాల్షియం, ఇనుము, మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, గంధకం, భాస్వరం లభి స్తాయి. క్యారెట్లో అధికంగా బీటా కెరోటిన్ ఉండటం వల్ల రేచీకటి, అంధత్వాన్ని తొలగిస్తుంది. క్యారెట్ విత్తనాల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల బాక్టీరియా సంబంధిత వ్యాధులను నిరోధి స్తుంది.
క్యారెట్ ఉపయోగాలు-
క్యారెట్ ఒక వేరు జాతి కూర: గాయ, దీనిని ఎక్కువగా కూరగాయ గా, సలాడ్స్, స్వీట్స్, హల్వా తయా రీలో ఉపయోగిస్తారు. నిల్వపదా ర్థాలు కూడా తయారు చేయవచ్చు.
సాగువిధానం: క్యారెట్ శీతాకాలపు పంట గనుక అధిక వేడిని తట్టుకోలేదు. 20-28 డిగ్రీల సెం.గ్రే. ఉష్ణోగ్రత వద్ద బాగా పెరిగి మంచి దిగుబడి ఇస్తుంది. సాధారణ వర్షపాతం క్యారెట్ సాగుకు అనుకూలం. తేమ అధికంగా నిలుపుకొనే నేలల్లో మంచి దిగుబడి లభిస్తుంది. మంచి మురు గునీటి వసతి గల లోతైన సారవం తమైన గరపనేలలు సాగుకు అత్యంత అనుకూలం. నేల ఉదజని సూచిక 6 నుంచి 6.5 ఉండాలి. నల్ల మట్టి, బంకనేలలు క్యారెట్ సాగుకు అనుకూలం కాదు.
Also Read: Black Carrot Benefits: బ్లాక్ క్యారెట్ లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
అనువైన రకాలు: కొండ ప్రాంతాల్లో సాగుకు ఊటి- 1, ఎర్లి నాన్టస్, న్యూ కొరడా రకాలు, మైదాన ప్రాంతాల్లో సాగుకు ఇండియా గోల్డ్, పూసా కేసర్ హల్ఫ్ లాంగ్, పూసా యమదగ్ని మొదలైన రకాలు సాగుకు ఎంచుకోవాలి.
నేలతయారీ: నేలను నాలుగైదుసార్లు బాగా దున్ని పశువుల పెంటను నేలలో కలి యబెట్టాలి. ఆఖరి దుక్కిలో సగ భాగం నత్రజని ఎరువు, మొత్తం భాస్వరం ఎరువులను, వేసుకోవాలి. నేలను పంటకు అనువైన విధంగా బోధలు, కాలువలుగా తయారుచే యాలి.
నాటడం: అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు నాటుకోవచ్చు. ప్రతి 10-15 రోజుల వ్యవధిలో విత్తనాలు నాటుకొంటే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా దిగుబడి పొందవచ్చు.విత్తనాలను వరుసల మధ్య 30 సెం.మీ., వరుసల్లో మొక్కల మధ్య 5 నుంచి 10 సెం.మీ. ఎడం పాటిం చాలి. ఎకరానికి 2-3 కిలోల విత్తనం అవసరం.
ఎరువులు: ఎకరానికి 15 టన్నులు పశువు ఎరువు వేయాలి. రసాయన ఎరువులు ఎకరాకు 35 కిలోల నత్ర జని, 20 కిలోల భాస్వరం, 30 కిలోల – పొటాష్ ఎరువులు వాడాలి. నత్రజని, పొటాష్ ఎరువులను 2 దఫాలుగా మొదటి సగభాగం ఆఖరిదుక్కిలో, రెండో సగభాగం విత్తిన 30-40 రోజులు తర్వాత అందించాలి.
నీటి యాజమాన్యం: నేలలో తేమ, వాతావరణం పరిస్థి తులను బట్టి 8-10 రోజులు వ్యవ ధిలో అందించాలి. ఎండ ఎక్కువ ఉన్న రోజుల్లో 4-5 రోజులకోసారి తడివ్వాలి.
Also Read: Carrot and Beetroot Health Benefits: క్యారెట్ మరియు బీట్‌రూట్ యొక్క ప్రయోజనాలు.!
Must Watch:
Also Watch: