ఆంధ్రప్రదేశ్వార్తలు

73rd Constitution Day 2022: లాం ఫారంలో ఘనంగా జరిగిన 73వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు.!

0
73rd Constitution Day 2022
73rd Constitution Day 2022

73rd Constitution Day 2022: ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిపాలనా భవనం, లాం ఫారం. గుంటూరు నందు ఈ రోజున విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా॥ జి. రామారావు గారి నిర్వహించబడిన 73వ రాజ్యాంగ దినోత్సవంను పురస్కరించుకొని, మన రాజ్యాంగం యొక్క పీఠికను మరియు పౌరుల బాధ్యతలను చదివి వివరించారు. తదుపరి ఉద్యోగులందరిచే మన రాజ్యాంగ పీఠిక లోని అంశాలపై ప్రతిజ్ఞ చేయించారు.

Meeting at Acharya N. G. Ranga Agricultural University

Meeting at Acharya N. G. Ranga Agricultural University

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా॥ జి. రామారావు గారు ప్రసంగిస్తూ దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినా, మనల్ని మనం పరిపాలించుకునేలా, దేశ చట్టాలను రూపొందించడానికి రాజ్యాంగం అవసరమని అప్పటి నేతలు గుర్తించి అన్ని దేశాల్లోని రాజ్యాంగాలను పరిశీలించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. మన రాజ్యాంగాన్ని సుమారు 60 వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి రూపొందించారన్నారు.

Also Read: Best Ways To stay Healthy In Winter: శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఉత్తమ మార్గాలు!

ఈ రాజ్యాంగం 26 నవంబర్, 1947 న అప్పటి పార్లమెంట్ చే ఆమోదించబడిందని ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దది అని తెలియజేసారు. ఈ కార్యక్రమములో వ్యవసాయ పీఠాధిపతి డా. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ పరిశోధన సంచాలకులు డా.ల్. ప్రశాంతి గారు, వ్యవసాయ విస్తరణ సంచాలకులు డా. పీ. రాంబాబు గారు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి. సుధాకర్ గారు, విశ్వవిద్యాలయ కంట్రోలర్ డాక్టర్ ఏ. వి. రమణ గారు, ఇతర ఉన్నతాధికారులు బోధన, బోధనేతర మరియు సహాయ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Maulana Abul Kalam Birth Anniversary: ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగిన అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు..!

Also Watch: 

Leave Your Comments

Skoch Summit 2022: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కు స్కాచ్ సిల్వర్ అవార్డు.!

Previous article

Khammam: ఖమ్మంలో 20,000 MT సామర్థ్యంతో మూడు వేర్ హౌసింగ్ గోదాముల ఏర్పాటు.!

Next article

You may also like