తెలంగాణవార్తలు

Khammam: ఖమ్మంలో 20,000 MT సామర్థ్యంతో మూడు వేర్ హౌసింగ్ గోదాముల ఏర్పాటు.!

0
Wheat Crop
Wheat Crop

Khammam: ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం జింకల తండా వద్ద రూ.14.90 కోట్లతో నూతనంగా నిర్మించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మూడు వేర్ హౌసింగ్ గోదాములను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రారంభించారు.

Khammam

Khammam

భారత దేశంలో కొత్త గోదాములు ఎక్కడా కట్టడం లేదు . ఒక తెలంగాణలోనే కొత్త గోదాములు నిర్మిస్తున్నాం. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి . అందుకే గోదాములు కడుతున్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పడిపోతుంటే , తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి .. తెలంగాణ వచ్చినప్పుడు అన్ని వ్యవసాయ ఉత్పత్తులు కలిసి 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల ఉద్యానవన పంటలు ఉన్నాయని రాష్ట్రమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.ఒక కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయోగ్యమైన భూమి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది .. ఒక లక్ష 46వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్న ఘనత తెలంగాణది. 65 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బంధు అందుతోంది.

Also Read: Skoch Summit 2022: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కు స్కాచ్ సిల్వర్ అవార్డు.!

ఒక కోటి 48 లక్షల ఎకరాలకు రైతుబంధు అందజేశాం. దేశంలో సాగుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. అమెరికాలో 90 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే , భారత దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ అనుకూలంగా ఉంది.

చైనా, అమెరికాలు ప్రపంచ దేశాలు దేశాలకు అన్నం పెట్టలేవు , కానీ ప్రపంచానికి అన్నం పెట్టగల ఏకైకస్థితి భారతదేశంలో ఉన్నది.
బ్రతుకుతెరువు మనదేశంలోనే ఉంది యువత పక్క చూపు చూడాల్సిన అవసరం లేదు .. రాబోయే రోజుల్లో ఆహార రంగం లో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Paddy Crop

Paddy Crop

ఆపిల్ కాశ్మీర్లోనే కాదు ఆదిలాబాద్ లో కూడా పండిస్తున్నం. యాసంగిలో పత్తిని పండిచవచ్చని నిరూపించిన రైతులు కూడా ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. కష్టపడి , సుఖపడే రైతులు ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులే రాబోయే రోజుల్లో భారతదేశంలో కీలకంగా కాబోతున్నాయి. శీతల గిడ్డంగుల నిర్మాణం కూడా రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నాం.

ఒక లక్ష 50 వేల కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులను చేపట్టాం. 10,500 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు కోసం రైతుల పక్షాన రాష్ట్రం చెల్లిస్తోంది. ఇప్పటివరకు 58 వేల కోట్ల రూపాయలను రైతుబంధు ద్వారా రైతు ఖాతాలో జమ చేశాం. ఒక రైతు వాడే ఒక మోటార్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 వేల రూపాయలు చెల్లిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని , తెలంగాణ రైతులను కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూస్తే కేసీఆర్ గారు నిలబడి ఉచిత కరెంటు ఇస్తున్నారు .

వ్యవసాయ రంగం బలంగా ఉంటే మిగతా రంగాలు, ప్రజలు బలంగా ఉంటారు. భారతదేశ పరిపాలనను పక్కనపెట్టి మోడీ గారు గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల ఉచిత కరెంటు లేదు. బిజెపి పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనూ రైతులకు ఉచిత కరెంటు లేదు. కేసీఆర్ విమర్శిస్తున్న కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అభివృద్ధి జరగలేదు..? ఎందుకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదు ..? తెలంగాణలో కోటి ఎగరాల భూములకు చేరేలా ఎనిమిదేళ్లలో ప్రాజెక్టులను నిర్మించాం అని మంత్రి అన్నారు.

Also Watch:

8 ఏళ్లుగా ప్రధానమంత్రి పదవి లో కొనసాగుతున్న మోడీ గారు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక పదివేల ఎకరాల సాగు చేసే ప్రాజెక్టు కట్టారా …?? కట్టడానికి మీకు చేతకాదు..!! కట్టిన వాటిమీద లేనిపోని ఆరోపణ చేస్తారు. ప్రజలకు అన్నం పెట్టే అన్నదాతలను నిలబెట్టింది కేసీఆర్ గారిని ఎవ్వరు మర్చిపోవద్దు. గతంలో రైతులను చంపారు , అవమానించారు కానీ నేడు తెలంగాణ రైతు లు సగర్వంగా జీవిస్తున్నారు.

నేడు తెలంగాణ రైతు , తెలంగాణ వ్యవసాయం భారతదేశానికే ఆదర్శం . డిసెంబర్ నెలలో యాసంగి పంటకు రైతుబంధు సాయం అందిస్తాo. కరోనా పీడ వల్ల రుణమాఫీ పూర్తిగా చేసుకోలేకపోయాం. ఇన్ని చేసిన ముఖ్యమంత్రి ఒక్క రుణమాఫీ మాత్రం ఎందుకు చేయకుండా ఉంటారు ? ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతాం .. రైతులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసారు.

మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు: నాటి ఉమ్మడి రాష్ట్రంలో పండించిన పంటను రైతులు దాచుకునే వెసులుబాటు లో లేకుండా పోయిందని, దానికి శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఖమ్మం జిల్లా వైవిద్యమైన వ్యవసాయం చేయడంలో ఖమ్మం జిల్లా ముందుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సరఫరాతో ఖమ్మం జిల్లాలో ప్రతి పంటను రైతులు స్వేచ్చగా పండిస్తున్నారని, ప్రతి ఏడాది ఆయా పంటల దిగిమతి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందన్నారు. వ్యవసాయం చేస్తూనే రైతులు రైతులు ఆనందం పొందుతారని అన్నారు.

జిల్లా వ్యాప్తంగా రైతులు పత్తిని అద్భుతం పండిస్తున్నారు, ఖమ్మం జిల్లా నుండి అత్యధికంగా పండిస్తున్న వారిలో జిల్లా ముందంజలో ఉందన్నారు. వ్యవసాయం చెయ్యాలంటే విద్యుత్ ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు ఉంటదో ఆయా అధికారులకే తెలియదన్నారు. కానీ నేడు నిరంతర ఉచిత విద్యుత్ ను అందిస్తూ వ్యవసాయ రంగాన్ని నడిపిస్తున్నారని అన్నారు మంత్రి అజయ్ అన్నారు.

నాడు పొలాల్లో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కలిపితే మళ్ళీ అక్కడ మరొక ట్రాన్స్ఫార్మర్ రావాలంటే ఆ గోస రైతులకే తెలుసన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బీడు భూములన్ని పచ్చరంగు పులుముకున్నాయన్నారు.

రైతును రాజు చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, చెక్ డ్యాముల నిర్మాణం, మినీ లిఫ్టులతో మిర్రు ప్రాంతాలకు సాగునీరును అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

రైతులు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండించడం ద్వారా లాభసాటి వ్యవసాయం చేయాలని అన్నారు. సాగునీరు అందించడంతో రైతులు, గ్రామస్తులు వ్యవసాయ పనులలో నిమగ్నమై గ్రామంలో సమావేశాలకు, సభలకు వచ్చే పరిస్థితి లేదన్నారు.
మానవ జీవన మనుగడకు నీరే మూలాధారమని.. నీటిని ఓడిసిపట్టే పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.

Also Read: Counseling for Agriculture and Veterinary courses: వ్యవసాయ, వెటర్నరీ కోర్సులకు కౌన్సెలింగ్‌.!

Also Watch:

 

Must Watch:

 

Leave Your Comments

73rd Constitution Day 2022: లాం ఫారంలో ఘనంగా జరిగిన 73వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు.!

Previous article

National Seed Conference 2022: హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన జాతీయ విత్తన సదస్సు.!

Next article

You may also like