Acharya NG Ranga Agricultural University: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనములో లో గౌరవ ఉపకులపతి డాక్టర్ ఆదాల – విష్ణువర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన 306 వ పాలక మండలి సమావేశము 24.11.22 న సమావేశ మందిరము నందు నిర్వహించబడినది.
ఇందులో భాగంగా 2 సంవత్సరములు (2020-22) గా విశ్వవిద్యాలయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారాన్ని నివేదిక రూపంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వివరిస్తూ 2020-21 లో 19 నూతన రకాలను, 2021-22 లో 17 నూతన రకాలను వరి, రాగి, కొర్ర, కంది, మినుము, పెసర, సెనగ, వేరుశెనగ, ఉలవలు, పత్తి, గోగు పంటలలో విడుదల చేయడం జరిగినది. 94,302 క్వింటాళ్ల విత్తనోత్పత్తి, 21,00,118 నారు మొక్కలు ఉత్పత్తి జరిగినది. విశ్వవిద్యాలయానికి చెందిన 84 వరి రకాలు.

Acharya NG Ranga Agricultural University
ఇప్పటి వరకు దేశం మొత్తం మీద సంవత్సరానికి 14 మిలియన్ హెక్టార్లలో పండిస్తూ 38 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తూ 71,543 కోట్ల ఆదాయాన్ని ఇస్తున్నాయి. అపరాలు కూడా 4.2 లక్షల హెక్టార్లలో పండిస్తూ. 4.09 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తూ దేశం మొత్తం మీద 33శాతం దిగుబడిని సంవత్సరానికి కి 2610 కోట్ల ఆదాయాన్ని ఇస్తున్నాయి.
6 పేటెంట్లను పొందడం జరిగినది. పుష్పక్ సిరీస్ డ్రోన్లను తయారుచేసి వ్యవసాయ రంగంలో పురుగు/ తెగులు/ కలుపు మందులు, విత్తనాలు పిచాకారి మరియు 5. 15 రోజుల డ్రోన్ శిక్షణకు శ్రీకారం చుట్టింది. 10 ప్రధాన పంటలలో డ్రోన్ వినియోగం కోసం వినియోగించే పద్ధతిని క్రమబద్ధీకరించినది.

Agriculture Drone
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లిలో సేంద్రియ వ్యవసాయం గురించి మరియు వ్యవసాయం- పర్యాటకం సంబంధించి పరిశోధనలు చేపట్టింది. ఈ రెండు సంవత్సరాలలో విద్యార్థులు 124 JRF మరియు 13 SRF సీట్లను జాతీయస్థాయిలో పొందారు.
119 విద్యార్థులను మరియు 30 మంది ఉపాధ్యాయులను IDP ప్రాజెక్టులో విదేశాలకు పంపించడం జరిగింది. గత రెండు సంవత్సరాల్లో 1055 మంది విద్యార్థులు విశ్వవిద్యాలయంలో వివిధ డిగ్రీలలో ప్రవేశం పొందారు. రైతు భరోసా కేంద్రాల్లో అనుబంధంగా 2075 రైతు క్షేత్రాలలో కార్యక్రమాలను చేపట్టి వివిధ వ్యవసాయ సంబంధమైన 12050 సలహాలను ఇవ్వడం జరిగినది అని తెలియజేశారు.
Also Watch:
Also Watch: