Kisan Mela 2022: రైతులకు మరియు విస్తరణ అధికారులకు ఎప్పటికప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేపట్టబడుతున్న నూతన వంగడాలు, వివిధ యాజమాన్య పద్ధతుల పైన సాంకేతిక సమాచారాన్ని అందజేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ వర్సిటీ పరిధిలోని మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో ఈనెల 15 నుంచి 24 వరకు కిసాన్ మేళా లు నిర్వహిస్తున్నట్లు పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ తెలిపారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలైనా వరంగల్ లో (15-11-2022), జగిత్యాలలో (17-11-2022), పాలెం లో (24-11-2022)లో కిసాన్ మేళాలను నిర్వహిస్తుంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో కిసాన్ మేళా నిర్వహణ .ఈ కిసాన్ మేళాలో క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక ప్రదర్శన రైతులు- శాస్త్రవేత్తలతో చర్చ గోష్టి ఏర్పాటు చేయడమైనది. అంతేకాకుండా వివిధ శాస్త్రవేత్తలపై ఈ క్రింది విషయాలపై ప్యానల్ చర్చలు ఏర్పాటు చేయడమైనది.
- ప్రత్తి పూత/ కాయ దశలో ప్రత్తితీతలో చేపట్టవలసిన యాజమాన్యం.
- ప్రత్తి అధిక సాంద్రత పద్ధతిలో వేసిన రైతుల అనుభవాలు.
- యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా వేయవలసిన ఆరుతడి పంటల రకాలు వాటి యాజమాన్య పద్ధతులు.
- వివిధ పంటలలో విలువ ఆధారిత మరియు మార్కెటింగ్ కు అనువైన పద్ధతులు.
- వివిధ పంటల లో సమగ్ర పోషకాలు/ సస్యరక్షణ పద్ధతులు.
ఈ కిసాన్ మేళా లో వివిధ వ్యవసాయ వాతావరణ మండలాల లో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, నీటిపారుదల శాఖ, పశుసంవర్ధక శాఖ మరియు ఇతర అనుబంధ శాఖల విస్తరణ అధికారులు, రైతు సోదర, సోదరీమణులు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొనడం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ కిసాన్ మేళాను జయప్రదం చేయాల్సిందిగా వ్యవసాయ వర్సిటీ ప్రతి ఒక్కరిని కోరుతుంది.
Must Watch: