Rajendranagar Agricultural University: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరి పరిశోధనా సంస్థలో శుక్రవారం బ్రీడింగ్ విధానాన్ని ఆధునీకరించేందుకు, చేపట్టవలసిన కార్యక్రమాలపై అవగాహన సమావేశం నిర్వహించడమయినది.
సాంప్రదాయ మొక్కల బ్రీడింగ్ విధానానికి బదులుగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతులను అవలంబించి, తక్కువ సమయంలో అధిక దిగుబడి మరియు చీడపీడలను తట్టుకునే రకాలను రూపొందించవచ్చని డాక్టర్ సంజయ్ కటియార్, ప్రధాన శాస్త్రవేత్త అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ, ఫిలిపెన్స్ వారు వివరించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వరి పరిశోధన విభాగాల బ్రీడింగ్ శాస్త్రవేత్తలు పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ వరి పరిశోధన సంస్థలో జరుగుతున్న పరిశోధనలను వివిధ వంగడాలను పరిశీలించడం జరిగింది.
ఈ సమావేశానికి PJTSAU పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ పాల్గొని పరిశోధనలు అధునాతన పద్ధతి వైపు మళ్ళించి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాలను రూపొందించి రైతు మన్ననలను పొందాలని సూచించారు.
ఈ సమావేశానికి వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. రఘురామిరెడ్డి, యూనివర్సిటీ బ్రీడింగ్ హెడ్ డాక్టర్ CH. దుర్గా రాణి మరియు వరి శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలలో వరిలో అధిక దిగుబడితో బాటు, ఎక్కువగా యాసంగి సీజన్లో 60 శాతం పైగా హెడ్ రైస్ రికవరి (HRR) రకాలు, కన్స్యూమర్, మార్కెట్ కు అనువైన వరి రకాల రూపకల్పన కోసం వివిధ సాధనాలకు ఉపయోగించుటకు, డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్ మరియు డేటా మేనేజ్ మెంట్ కోసం స్మార్ట్ బ్రీడింగ్ సాధనాలను స్వీకరించడం కొరకు IRRI, Philippines Global Leader in Breeding Program Modernization Platform తో PJTSAU ఒక ఒడంబడిక (MOA) ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. దీనికి డాక్టర్ సంజయ్ కతియార్ సానుకూలంగా స్పందించి తగినటువంటి సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేయడమైనది.
Must Watch: