నిమ్మలో బోరాన్ లోపం:
ఆకుల చర్మం లావుగా దళసరిగా మారి, పచ్చదనం కోల్పోయి, క్రమంగా గోధుమ వర్ణంలోకి మారి జీవం లేకుండా పోతాయి. భూమిలో తేమ వున్నప్పటికీ ఆకులు ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకులు అడుగు భాగంలో ఈనెలు ఉబికి కొన్ని పగిలి బెండులా తయారవుతాయి. ఆకులు వంపు తిరిగి ఉండటాన్ని కూడా గమనించవచ్చు. కాయలు గట్టిపడి తోలు మందంగా తయారవుతాయి. కాయల్లో రసం తగ్గిపోయి పిప్పిలాగా మారిపోతాయి. కాయలోపలి విత్తనాలు సరిగా ఎదగక, రంగు మారిపోతాయి. తెల్లటి తొక్కలో గోధుమ రంగు లేదా తెల్లటి మచ్చలేర్పడి, ఆ ప్రాంతంలో కొద్దిగా బంక ఏర్పడుతుంది.
నివారణ:
లీటరు నీటికి 2 గ్రా. సాల్యుబార్ లేదా గ్రాన్యుబార్, 10 గ్రా. యూరియా + అర మి.లీ. సబ్బు బంక కలిపిన ద్రావణాన్ని చెట్లు కొత్త చిగురు వేసే దశలో ఒక సారి, 15 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి.