ఉద్యానశోభ

Rabi Maize: రబీ మొక్కజొన్న లో ఎరువుల యాజమాన్యం.!

1
Maize Crop
Maize Crop

Rabi Maize: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రబీలో మొక్కజొన్నను సుమారుగా సూ 2.8 లక్షల హెక్టార్లలో సాగుచేస్తు న్నారు. ఖరీఫ్ పోలిస్తే రబీలో పురుగులు, తెగుళ్ళ ఉధృతి తక్కువగా ఉండి, దిగుబడి ఎక్కువగా ఉండడమే కాకుండా ధాన్యానికి ధర కూడా ఎక్కు వగా పలుకుతుంది. పచ్చిచొప్పకు కూడా గిరాకి ఉంటుంది. తక్కువ రైత రోజుల్లో ఎక్కువ దిగుబడినిచ్చే పంటల్లో మొక్కజొన్న ముఖ్యమైంది. ఒక ఎకరం వరి పండించడానికి అవసరమైన నీటితో రెండున్నర ఎకరాల మొక్కజొన్నను పండించవచ్చు.

Rabi Maize

Rabi Maize

భూమి ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండడం వల్ల మొక్కలు సూక్ష్మ, నత్రజన స్థూల ఎరువులను అత్యధికంగా వినియోగించుకొని, దిగుబడులు పెరిగి రైతుకు ప్రతి యూనిట్ ఎరువుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కావున భూసార పరీక్షను అనుసరించి నిర్దేశించిన మోతాదులో సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం వల్ల రైతులు ఎరువులపై పెట్టే ఖర్చుని తగ్గించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు.

Also Read: Rabi Crop Seed Treatment: రబీ పంటలో విత్తనశుద్ధి ఆవశ్యకత.!

నత్రజని: రబీలో ఎకరాకు 80 నుంచి 96 కిలోల నత్రజని ఎరువును వేసుకోవాలి. ఈ నత్రజని ఎరువును 1/4 వంతు విత్తేటప్పుడు, 1/4 వంతు 25-30 రోజులప్పుడు, 1/4 వంతు 45-50 రోజుల మధ్య, మిగిలిన 1/4 60-65 రోజులకు వేయాలి. మొక్కజొన్న తొలి పంటదశలో నత్రజని లోపం ఏర్పడితే మొక్క మొత్తం పాలిపోయి పసుపుపచ్చ రంగులోకి మారుతుంది. ముందుగా ముదురు ఆకుల్లో కొసల నుంచి పసుపు పచ్చగా మారుతుంది.

Nitrogen Deficiency

Nitrogen Deficiency

నత్రజని లోపం ఎక్కువకాలం కొనసాగితే కింద ఉన్న ముదురు ఆకులు మొత్తం పసుపు రంగుకుమారి తదుపరి మొక్కంతా దెబ్బతింటుంది. కండెలు చిన్నగా తయారై, కండె చివరి భాగంలో గింజలు ఏర్పడవు. కండెలోని గింజల వరుసలు తగ్గుతాయి. తర్వాత ఎక్కువ నత్రజని వేసినా ఉపయోగం ఉండదు. బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు 20గ్రా. యూరియాను లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో 2నుంచి 3 సార్లు పిచికారి చేసి పంటను రక్షించుకోవచ్చు.

భాస్వరం: రబీలో ఎకరాకు న్న 25 కిలోల భాస్వరం ఎరువ వేయాలి. భాస్వరం పైరు తొలిదశ లో అత్యవసరం, ఈ దశలో మొక్క తీసుకున్న భాస్వరమే పంట గుణాలన్నీ బరువు నిర్ధారిస్తుంది. ఈ ధాతువు వేర్లు అభివృద్ధికి ఉపయోగంతుంది.

పొటాషియం: ఎకరాకు 32 కిలోల చొప్పున ఆఖరి దుక్కిలో, విత్తే ఆకుక సమయంలోను, మిగతా సగం పొటాష్ విత్తిన 50-55 రోజుల మధ్య పసుపు క్కలు వేసుకోవాలి.

జింక్: మొక్కజొన్న పంట దిగుబడిలో జింకా పాత్ర గణనీయంగా ఉంటుంది. భూమిలో జింక్ లోపం ఉన్నప్పుడు 5 లేదా 6 ఆకుల దశలో మొక్కలో లక్షణాలు కనిపిస్తాయి. ఆకులపై పాలిపోయిన పసుపు, తెలుపురంగు చారలు ఏర్పడ తాయి. కొత్తగా వచ్చిన ఆకులకు జింక్ అందక పోవడంతో దాదాపు తెల్లగా మారుతాయి. దీనినే “తెల్ల మొగ్గ అంటారు. భాస్వర ధాతువు మోతాదు కంటే ఎక్కువైనప్పుడు సాధా రణంగా జింక్ లోపం కనిపిస్తుంది.మొక్కల్లో జింక్ లోప నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ ను ఒక లీటరు నీటికి చొప్పున కలిపి వారంరోజుల్లో రెండు సార్లు పిచికారి చేయాలి. ఎకరాకు 20 కిలోల జింక్సాల్పేట్ని దుక్కిలో వేయాలి.

Also Read: kharif Crops Management Practices: అధిక వర్షాల పరిస్థితుల్లో వివిధ ఖరీఫ్ పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు.!

Must Watch:

Leave Your Comments

Pest Management In Sapota: సపోట పంటలో సస్యరక్షణ చర్యలు.!

Previous article

Farming Techniques in Dryland: మెట్టసాగులో మెళకువలు.!

Next article

You may also like