రైతులు

Farmer Success Story:సేంద్రియ బాటలో చక్రపాణి.!

0
AP Government
AP Government

Farmer Success Story: వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకి చెందిన చక్రపాణి ఉన్నత చదువులు చదివి తన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ తన బంధువులకు సంబంధించిన పాఠశాలలో హిందీ పండితునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ వ్యవసాయం మరియు ఉద్యోగాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. రసాయనిక వ్యవసాయం చేస్తున్న 22 సంవత్సరాల వయస్సు గల బత్తాయి తోటలోని చెట్లన్నీ చనిపోవటం గమనించి రసాయనాలను వదలి సేంద్రియ బాట పట్టడం జరిగింది. ఇదే సమయంలో పాలేకర్ సదస్సుకు హాజరై ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన చేసుకొని దాన్ని కొనసాగిస్తున్నాడు.

Farmer Success Story

Farmer Success Story

ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన నాటు అవులను రెండింటిని సంవత్సరం క్రితం రూ.40,000/-లకు కొనుగోలు చేసుకుని వాటి వ్యర్థాలతో వివిధ రకాల ద్రావణాలను, కషాయాలను తయారు చేసుకుని వ్యవసాయంలో ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం తన పొలంలో 6 సంవత్సరాల వయస్సు గల బత్తాయి మొక్కలు 200 ఉన్నవి. అవి ఇప్పుడే దిగుబడినివ్వడం మొదలయ్యింది. బత్తాయితోపాటు, మామిడి 12 చెట్లు, సపోట 5, నిమ్మ 5 ఉన్నవి. వీటన్నింటికి ప్రకృతి వ్యవసాయ పద్దతులే పాటిస్తున్నాడు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక్కొక్క చెట్టుకి 500 మి.లీ. చొప్పున జీవామృతాన్ని పాదులలో అందిస్తున్నాడు.

Also Read: Farmers Success Story: పొట్టేళ్లు మరియు నాటు కోళ్ల పెంపకం`విజయగాధ.!

ప్రతి సంవత్సరం ఒక్కొక్క చెట్టుకి ఒక కిలో చొప్పున ఘనజీవామృతాన్ని కూడా అందిస్తున్నాడు. బత్తాయికి ఇగురు వచ్చిన సమయంలో నీమాస్త్రం మరియు 2 రోజుల తరువాత జీవామృతం పిచికారి చేస్తూ వస్తున్నాడు. మరలా 15 రోజులకు నీమాస్త్రం మరలా 2 రోజుల తరువాత జీవామృతం పిచికారి చేస్తుంటాడు. వచ్చిన దిగుబడిని తానే సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నాడు.

గత సంవత్సరం అర ఎకరంలో వంగ, గోరుచిక్కుడు, చిక్కుడు, చిలకడ దుంప,

Sweet Potato

Sweet Potato

క్యారెట్, మిరప, టమాట, తోటకూర, గోంగూర, చుక్కకూర, మెంతికూర మొదలగు వాటిని పండించినాడు. వీటికి సెంటుకి 10 కిలోల చొప్పున ఘనజీవామృతాన్ని దుక్కిలో అందించడంతో పాటు ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పిచికారి చేసినాడు. నీమాస్త్రం ఉపయోగించి చీడపీడలను నివారించుకొని ఆరోగ్యకరమైన కూరగాయలు మరియు ఆకుకూరలు పండించి సొంతంగా మార్కెట్ చేసుకుని అశాజనకమైన ఆదాయాన్ని పొందటం జరుగుతుంది.

Also Read: Yogaasana For Farmers: ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన యోగాసనాలు.!

Must Watch:

Leave Your Comments

Health Benefits of Hibiscus Tea: మందార టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.!

Previous article

Tissue Culture: టిష్యూ కల్చర్ సాగుతో తెగుళ్ల నివారణ.!

Next article

You may also like