Pests of Mustard Crops: ఆవాలు , బాసికా జసియా (ఎల్) అనేది క్రూసిఫెరే. కుటుంబానికి చెందిన ముఖ్యమైన నూనె గింజల పంట. రేప్ సీడ్ వాల సముహ పంటలు భారతదేశంలో సాగు చేసే ప్రధాన నూనెగింజల పంటలు . దీని షూలం చైనా మరియు ఈశాన్య భారతదేశం. భారతదేశంలో ఈ పంటలు విస్తీర్ణం 6. 85 మిలియన్ హెక్టార్లు, ఈ పంట యొక్క ఉత్పత్తి తెర 9.12 మిలియన్ టన్నులు కాగా, ఉత్పాదకత 1.3 టన్నులు. తెలంగాణలో ఆవ పంట విస్తీర్ణం 1000 హెక్టార్లు, ఉత్పత్తి 1710 టన్నులు మరియు ఉత్పాదకత హెక్టారుకు 1.7 టన్నులు, భారతదేశంలో రేవ్సీడ్ఆవాలు పండిరచే ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్ (47.26 శాతం), హర్యానా (11. 73 శాతం), మధ్యప్రదేశ్ (10.82 శాతం), ఉత్తర ప్రదేశ్్ (9.73 శాతం) మరియు పశ్చిమ బెంగాల్ (6.69 శాతం). నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని పెంపొందించే దిశగా తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలుగాణ జోన్లో ఆవ పంటను ప్రోత్సహించడం మరియు ప్రాచుర్య పరచడం జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఆవ పంటను ఆసించే పురుగులు, తెగుళ్ళు మరియు వాటి సంభావనీయ స్థాయిల గురించి సమాచారన్ని పొందు పరచడం అత్యవసరం.
ఆవాల ఉత్పత్తికి ఆటంకం కలిగించే జీవనంబుధ పరిమితులతో పురుగులు మరియు తెగుళ్ళు ప్రధానమైనవి. దాదాపు 43 పైచిలుకు రకాల పురుగులు – తెగళ్ళు ఆవాలను ఆశిస్తాయి. ఆవాలను కించే కీటకాలలో పేనుబంక గుణాత్మక మరియు పరిమాణాత్మక నష్టాలను కలుగజేస్తుంది. సాప్లై పెయింటెడ్ బగ్, లీఫ్మైనర్ వంటి పురుగులు కూడా ఓ మొస్తారు నష్టాన్ని కలుగజేస్తాయి. వ్యాధుల్లో ప్రధానంగా మాగడు తెగులు, ఆల్టర్నేరియా బైట్, తెల్ల తుప్పు తెగులు, బూడిద తెగులు మరియు ఎండు తెగలు అధిక నష్టాన్ని కలిగిస్తాయి.
పేనుబంక (లింఫాసిస్ ఎరిసిమి) – గుర్తింపు లక్షణాలు :
- పిల్ల, తల్లి పురుగులు యొక్క లేత కొమ్మల నుండి మరియు ఆకుల అడుగు భాగాల నుండి రసాన్ని పీలుస్తాయి.
- రసాన్ని పీల్చడం వలన మొక్క పెరుగడల కుంటుపడుతుంది.
ఇవి తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన మొక్కల ఆకులు మరియు కాండంపైన నల్లని బూజు ఏర్పడుతుంది. దీని వలన కిరణజన్య సంయోగ క్రియ తగ్గి దిగుబడులు తగ్గుతాయి.
అనుకూల వాతావరణ పరిస్థితులు : బెట్ట వాతావరణంలో మరియు చలి కాలంలో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
నివారణ చర్యలు :
- పసుపు రంగులో ఉండే అంటుకునే ఉచ్చులను ఉపయోగించాలి.
- ప్రారంభ దశలో అఫిడ్ జనాభాతో పాటు ప్రభావిత భాగాన్ని నాశనం చేయాలి.
పురుగులు పంట మొక్కలను ఆశించడం గమనించిన తర్వాత డైమిధోయేట్ 30 ఇసి 2 మి.లీ. లీటరు నీటికి పిచికారి చేయడం వలన పురుగు బెడద తగ్గించవచ్చు.
మస్టర్డ్ సాఫ్లై –
గుర్తిపు లక్షణాలు :
- ఈ పురుగు ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు చేసి తింటూ కేవలం ఈనెలను మాత్రమే మిగిలుస్తుంది.
- పురుగుచే ఆశింపబడిన మొక్కలలో కాయలు ఏర్పడవు
అనుకూల వాతావరణ పరిస్థితులు :ఈ పురుగు అకబర్ నెలలో ఆశించడం మొదలై నవంబర్ మరియు డిసంబర్ నెలల్లో తీవ్ర నష్ట్రాన్ని కలుగచేస్తుంది.
నివారణ చర్యలు :వేసవిలో లోతుగా దున్నడం వలన వివిధ దశలలో ఉన్న కీటకాలు సూర్యరశ్మి గురికావడంతో మృతి చెందుతాయి.
నివారణకు : ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పెయింటెడ్ బగ్ (బగాడా హిలారిస్ ) –
గుర్తింపు లక్షణాలు :
- పిల్ల, పెద్ద పురుగులు అన్ని భాగాల నుండి రసాన్ని పీిలుస్తాయి.
- మొక్కలు వాడిపోయి ఎండిపోతాయి.
- పెద్ద పురుగులు ఒక రెసిన్ లాంటి ద్రవమును వెదజల్లుతాయి. ఇది కాయలను పాడుచేస్తుంది.
- మొక్క పెరిగినప్పుడు దిగుబడి యొక్క నాణ్యత మరియు పరిమాణం (31 – నష్టాలు) ప్రభావితమవుతుంది.
నివారణ చర్యలు :
- ఈ పురుగుల యొక్క గుడ్లను నాశనం చేయడానికి వేసవిలో మట్టిని లోతుగా దున్నాలి.
- డైక్లోరోవాస్ 76% ఇసి 250.8 మి.లీ. 200-400 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీచేయాలి.
- ఫోలేట్ 10 శాతం 600 గ్రా. ఎకరాకు.
తెగుళ్లు :-
మాగుడు తెగులు –
గుర్తింపు లక్షణాలు :
- నారు కుళ్ళు ప్రధానంగా విత్తనం విత్తిన రెండు వారాల్లో కనిపించి తీవ్రస్థాయిలో నష్టాన్ని కలుగ చేస్తుంది.
- తెగులు సోకిన మొక్కలు, మొదళ్ళు మెత్తబడి కుళ్ళిపోయి గుంపులు గుంపులుగా చనిపోతాయి.
అనుకూల వాతావరణ పరిస్థితులు :
- మొక్కలు వత్తుగా ఉన్నప్పుడు మరియు తేమ అధికంగా ఉన్నప్పుడు తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది.
- మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఉధృతి అధికంగా ఉంటుంది.
Also Read: Pest Control in Chillies: మిరపలో తెగులు నియంత్రణ.!
నివారణ చర్యలు :
- ఎక్కువగా నీరు పెట్టడం వల్ల మొక్క ఈ తెగుళ్ళకు గురవుతుంది.
- కిలో విత్తనానికి 3గ్రా. కాప్టాన్ లేదా మాంకోజెబ్తో విత్తనశుద్ధి చేయాలి.
- విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, మరలా వారం రోజులకు ఒకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా, లేదా 2.5 గ్రా. రిజోమిల్ యం.జెడ్ లీటరు నీటికి కలిపి భూమి అంతా తడిచేలా పిచికారీ చేయాలి.
ఆల్టర్నేరియా బైట్ –
గుర్తింపు లక్షణాలు :
- ఈ వ్యాధి కింద ఆకులపై చిన్న వృత్తాకార గోధుమ రంగు నెక్రొటక్ మచ్చలుగా దాడి చేస్తుంది.
- వృత్తాకార నుండి సరళ, ముదురు గోధుమ రంగు గాయాలు కాండం మరియు కాయలపై కూడా అభివృద్ధి చెందుతాయి. తరువాత దశలో పొడిగించబడతాయి.
- వ్యాధి సోకిన కాయలు చిన్న, రంగు మారిన మరియు ముడుచుకున్న విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి.
నివారణ చర్యలు :
- వేసవిలో లోతుగా దున్నడం వలన శిలీంధ్ర సిద్ధబీజాలు సూర్యరశ్మికి చనిపోవడం జరుగుతుంది.
- మెటలాక్సిల్ 8 శాతం G మాంకోజెబ్ 64 శాతం డబ్య్లుపి 1000 గ్రా. 500 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
తెల్ల తుప్పు తెగులు : తెల్ల తుప్పు తెగులు ఆవ పంటను ఏవుగా పెరిగే దశలో ఆశిస్తుంది.
గుర్తింపు లక్షణాలు :
- తెగులు ఆశించిన ఆకులపై తెల్లటి బుడిపెలాంటి పదార్దం ఏర్పడుతుంది.
- తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు మొక్క పెరుగుదల మందగిస్తుంది.
నివారణ చర్యలు :
- తెగులు నివారణకు మెటలాక్సిల్ శిలీంధ్రం నాశినిని 1 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి.
- మెటలాక్సిల్ 2 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
బూడిద తెగులు :బూడిద తెగులు పూతదశలో ఆశించడం జరుగుతుంది.
గుర్తింపు లక్షణాలు :
- ఈ తెగులు ఆకులు, కాండము మరియు కాయలను ఆశిస్తుంది.
- ఆకులు, కాండము మరియు కాయలపై తెల్లని పొడి కప్పబడి ఉంటుంది.
- తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి.
నివారణ చర్యలు :
- లీటరు నీటికి 1మి.లీ. కారాధేన్ లేదా హెక్సాకొనజోల్ 0.6 మి.లీ లేదా డైఫన్కొనజోల్ 2 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
- కావున రైతు సోదరులు అందరు సరైనటువంటి సమయంలో చీడపీడలను గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే అధిక దిగుబడులు పొందడమే కాకుండా అధిక ఆదాయాన్ని పొందవచ్చు.
-కె.అన్వేష్, డా.ఎన్. బలరాం, డా. ఎస్. ఓం. ప్రకాష్,
డా. అక్.సునీత దేవి, డా. ఎస్. జె. రెహమాన్,
డా. డి. పద్మజ, డా. జి. శ్రీనివాస్
వ్యవసాయ కళాశాల , రాజేంద్రనగర్, హైదరాబాద్,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస, జగిత్యాల.
Also Read: Biological Pest Control: పంటలనాశించు చీడపురుగుల నివారణలో జీవ నియంత్రణా పద్ధతులు.!
Must Watch: