రైతులు

Farmers Success Story: పొట్టేళ్లు మరియు నాటు కోళ్ల పెంపకం`విజయగాధ.!

1
Farmers Success Story
Farmers Success Story

Farmers Success Story: గ్రామీణాభివృద్ధిలో వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది. నేలతల్లిని నమ్ముకొని వ్యవసాయం చేపట్టే రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయం ఒడిదుడుకులకు లోనైనప్పుడు పశుపోషణ అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . అంతే కాక పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల, చిన్న చిన్న వ్యవసాయ కమతాల వల్ల వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వలన ఎక్కువ మంది రైతులు పశుపోషణ వైపు మరియు గొర్రెల, మేకల పెంపకం వైపు మొగ్గుచూపుతున్నారు. అదే బాటలో మన నీలం రామచంద్రయ్య గారి విజయగాధ…..
కడప జిల్లా, కమలాపురం మండలం, దేవరాజుపల్లి గ్రామానికి చెందిన నీలం రామచంద్రయ్య ముఖ్యముగా పొట్టేళ్లు పెంపకం చేపట్టి అదనపు ఖర్చులను అధిగమించేందుకు నాటు కోళ్ళు పెంచుతూ జీవనోపాధి పొందుతూ ఎంతో మంది రైతులకు ఆదర్శముగా నిలిచారు.

Farmers Success Story

Farmers Success Story

పొట్టేళ్ల పెంపకం: దాదాపు ఒక ఎకరం విస్తీర్ణంలో, 100 పొట్టేళ్లు పెంచేవిధంగా షెడ్డు రూ. 3 లక్షలతో నిర్మించాడు. షెడ్డులో చికిత్స గది, క్వరంటైన్‌ గది, లేబర్‌ గది విడిగా నిర్మించారు. షెడ్ల మధ్య నీడ కొరకు మరియు గాలి కొరకు చెట్లను నాటారు. త్రాగు నీటి తొట్లను నిర్మించారు, ఫారంను శుభ్రపరచడానికి జీవాలకు మేపు వేయడానికి మరియు వాటిని నిరంతరం పర్యవేక్షించడం కొరకు ఇద్దరు లేబర్లను 18000/- (ఇద్దరికి కలిపి) ఇస్తున్నాడు.
నెల్లూరు బ్రౌన్‌ జాతి పొట్టేళ్లను సంతలలో కాకుండా మందలలో కొనుగోలు చేస్తున్నాడు. సుమారు 4 నెలల వయస్సు 15-20 కేజీ బరువు గల పొట్టేళ్లను కొనుగోలు 7000/- (ఒక పొట్టేలు) చొప్పున కొనుగోలు చేసి వాటిని 34-35 కేజీ బరువు 10 నెలల వయస్సులో వచ్చిన తర్వాత ఒక్కొక్కటి %Rం%.12000/`13000/- కు అమ్ముతున్నాడు .

క్రమం తప్పకుండా డివార్మింగ్‌ , టీకాలు పశు సంవర్థక శాఖ సిబ్బంది సహకారంతో చేయిస్తాడు గత సంవత్సరంగా పొట్టేళ్ల మరణాల శాతం ఒకటి కంటే తక్కువగా ఉంది. పశు వైద్యుల సలహాతో యాజమాన్య పద్దతుల్ని ఆచరిస్తూ, శుభ్రమైన త్రాగు నీరు, శుభ్రమైన పాకలు, షెడ్డును శుభ్రంగా ఉంచడం, సరైన సమయంలో నట్టల మందులు మరియు టీకాలు వేయించడం వంటి మెళుకువలు పాటించుట వలనే లాభాలు అర్జిస్తున్నాడు.
పశుగ్రాసాలు ….

Also Read: Sheep Pox Disease: గొర్రెలలో అమ్మోరు వ్యాధి.!

  •  దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో 1.5 ఎకరా హెడ్జ్‌ లూసెర్న్‌, 1 ఎకరా అవిశ, 1.5 ఎకరా సూపర్‌ నేపియర్‌ వంటి గ్రాసాలను సాగు చేస్తున్నారు.
  • .జొన్నలు (48 %), బియ్యం (30 %), చెన్నకాయ పిండి (10 %) , తౌడు (10 %), మినరల్‌ మిక్చర్‌ (1 %), ఉప్పు (1 %) వీటితో అతనే స్వయంగా సమీకృత దాణా తయారు చేసుకుంటాడు.
  • 20 కేజీ బరువు గల పొట్టేళ్లకు 100 గ్రా., 25 కేజీ బరువుకు 150 గ్రా., 30 కేజీ బరువుకు 200 గ్రా. చొప్పున రోజు దాణాను ఇస్తున్నాడు.
  •  వీటితో పాటు లివర్‌ టానిక్‌లు మరియు కాల్షియమ్‌ టానిక్‌లు ప్రతి రోజు వాడుతారు.

ఆర్థిక వివరాలు :
(ఎ) కాపిటల్‌ ఖర్చు (రూ. లక్షలలో )
గృహ వసతి ఖర్చు 2,00,000/-
బోరు, మోటారు, ఛాఫ్‌ కట్టర్‌, పరికరములు R 1,00,000/-
మొత్తం R 3,00,000/-

(బి) రిక్కరింగ్‌ ఖర్చు (రూ.లక్షలలో)
పొట్టేలు పిల్లల ఖర్చు 100 I 7000 R 70,000
పశు గ్రాసానికి అయ్యే ఖర్చు R 4 ఎకరాలు I 2000 R 8000
కావలసిన దాణా R 100 I 0.12 కిలో I180 రోజులు R 2.16 టన్నులు
దాణా ఖర్చు 2.16 టన్నులు I 15000 R 32400/-
లేబర్‌ ఖర్చు R 6 I 9000 R 54000/-
పశువైద్యం, ఇతరములు R 15000/-
మొత్తం R 8,09,400/-

(సి) మొత్తం పెట్టుబడి R ఎ Gబి R 300000 G 809400 R 11.09,400
ఆదాయం R 95I37I380 R 13,35,700
లాభంRఆదాయం – పెట్టుబడి R 13,35,700-11.09,400 R 2,26,300/- (ఒక బ్యాచుకు)
సంవత్సరములో రెండు బ్యాచులు R 4,52,600/-

నాటుకోళ్ళ పెంపకం: నాటు కోడి యొక్క మాంసం మరియు గుడ్లకి నానాటికి గిరాకి పెరుగుతూనే ఉంది. నాటు కోడికి ఉండే రంగు రంగుల ఈకలు, అది పెట్టు గోధుమ రంగు గుడ్లు, దాని మాంసము యొక్క రుచిపై వినియోగదారులు ఎక్కువ మక్కువ చూపుతూ ఎంత ధరైన వెచ్చించడానికి సుముఖంగా ఉంటున్నారు.

Breeding of Country Chicken

Breeding of Country Chicken

అలాగే పెరిగిన ఆరోగ్య అవగాహన మూలాన నాటు కోడి అనగానే ఎటువంటి మందులు లేకుండా పెరటిలో తక్కువ ఖర్చుతో పెరిగి దాని మాంసము మరియు గ్రుడ్లలో హానికర అవశేషాలు ఉండవు అనే అభిప్రాయం వినియోగదరులలో పాతుకుపోయింది. మొదటి నుండి నాటు కోళ్లపై ఉన్న మక్కువ కారణంగా రామచంద్రయ్య గారు నాటు కోళ్ల పెంపకంపై దృష్టి సారించి, లాభాలను ఆర్జిస్తున్నారు.

100 గుడ్లు కెపాసిటీ గల ఇంక్యూబేటర్‌ రూ. 13000 /- కు కొనుకున్నాడు. దీని ద్వారా కేవలం నాటు కోడి గుడ్లను పొదిగిస్తాడు. ప్రస్తుతం ఇతని వద్ద 200 కోళ్లు పెంచుతున్నాడు. వీటిని 5 నెలలు పెంచి 1 1/2 కేజీ లైవ్‌ వెయిట్‌ రూ. 400/- అమ్ముతున్నాడు. చాలా తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందుతున్నాడు. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని పొట్టేళ్ళ పెంపకములో ఉండే అదనపు ఖర్చులకు ఉపయోగిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు.

-డా.జి.రాంబాబు, పశు వైధ్యాధికారి, డా. శివజ్యోతి, పశువైద్యాధికారి,
కడప, ఫోన్‌ : 9618499184, 9494588885

Also Read: Broiler Chickens: మాంసపు కోళ్ళ పెంపకంలో ఈ విషయాలు గమనించండి.!

Must Watch:

Leave Your Comments

Precautions of Pesticides: పురుగు మందుల వాడకం లో తీసుకోవలసిన మెలుకువలు.!

Previous article

Pests of Mustard Crops: ఆవ పంటను ఆశించే చీడపీడలు.!

Next article

You may also like