రైతులు

Farmer Success Story: సేంద్రియ బాట లో లాభాలు పొందుతున్న రైతు.!

0
Farmer success story
Farmer success story

Farmer Success Story: మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా రైతు కూడా తమ సాగు పద్ధతులను మార్చుకోవలసిన అవసరం చాలా ఉంది. వినియోగదారుల జీవన సరళి రోజురోజుకి మారుతూ వస్తుంది. చాలామంది రైతులు వినియోగదారుల అభీష్టం మేరకు తమ పంటలను సాగుచేస్తూ ఆరోగ్యకరమైన పంటలను వినియోగదారులకు అందిస్తున్నారు. ఆరోగ్యం గురించి అవగాహన పెరుగుతున్నందున అందరిచూపు సేంద్రియ ఉత్పత్తుల వైపు మరలుతుంది. దానిని గమనిస్తున్న రైతులు తమ సాగు పద్ధతులను సేంద్రియంవైపుకు మరల్చుతున్నారు. సరిగ్గా ఇదే బాటలో నడుస్తున్నాడు గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన బసివిరెడ్డి.

Farming Field

Farming Field

2017వ సంవత్సరం వరకు రసాయనిక వ్యవసాయం పొందినాడు. వీటి సాగుకు చేసిన బసివి రెడ్డి మొదటిసారిగా 2018వ సంవత్సరం ఖరీఫ్ లీటర్ల చొప్పున క్రమం త సీజనులో సేంద్రియ పద్ధతిని మొదలు పెట్టి మూడున్నర పంటపై కూడా పిచికారి చేసి ఎకరాలలో వరి పంటను సేంద్రియ పద్ధతిలో సాగు చేసినాడు. వ్యవసాయం చేసిన సంద ఇందుకుగాను రెండుంపావు ఎకరాలలో మసూరి రకం వరి చొప్పున వడ్ల దిగుబడి సాగు చేసి మొత్తానికి 70 కిలోల బస్తాలు 23, ఒకటింపావు ఉన్నాయి. ఎకరాలలో నవారా రకం వరిని వేసి 400 కిలోల దిగుబడి పొందినాడు. వీటి సాగుకు జీవామృతాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున క్రమం తప్పకుండా అందించడంతో పాటు మూడున్నర పంటపై కూడా పిచికారి చేసినారు. అంతకు ముందు రసాయన వ్యవసాయం చేసిన సందర్భాలలో ఎకరానికి 40 బస్తాల చొప్పున వడ్ల దిగుబడి సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Also Read: Farmer Success Story: ప్రకృతి వ్యవసాయంతో కరివేపాకు సాగు చేస్తున్న యువరైతు.!

మూడున్నర ఎకరాలలో మిరప పంటను వేసి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ పంట ఆశాజనకంగా లేకపోవడంతో ఆ పంటను తీసేసి కొర్రపంటను వేశాడు. మూడున్నర ఎకరాలకు గాను 7 కిలోల విత్తనం ఉపయోగించాడు బసివి రెడ్డి తానే సొంతంగా అరకతో కొర్ర విత్తనాలను నూకలు, ఇసుక లాంటివి ఏమీ కలపకుండా ఎదబెట్టుకున్నాడు. భూమికి దుక్కిలో ఏ మాత్రం పోషకాలు అందించలేదు. జీవామృతం మరియు పంచగవ్యను కలిపి పంటపై పిచికారి చేసినాడు. అంతకుమించు ఏమీ చేయలేదు. డిసెంబరు మొదటి వారంలో విత్తుకోగా మార్చి మొదటి వారంలో కోతకోసి మూడు రోజులు కుప్పలు అలానే ఉంచి నాలుగవ రోజు తొక్కించి 3000 కిలోల కొర్రల దిగుబడి సాధించినాడు.

రెండు ఎకరాలలో జామ మొక్కలు నాటి అందులో అంతరపంటగా అండుకొర్రలు సాగు చేసినాడు. ఒక్కొక్క జామ మొక్క రూ.65/-ల చొప్పున అర్కా కిరణ్ రకాన్ని తెప్పించి లైనుకి లైనుకి 2 మీటర్లు, మొక్కకు ఒక మీటరు దూరంలో 2018 డిసెంబరు మాసంలో నాటించాడు. దుక్కిలో పచ్చిరొట్టగా అలసంద, జనుము, పెసలు మొదలగు విత్తనాలను చల్లి పూతకు ముందే భూమిలో కలియదున్నినాడు. జామ మొక్కల మధ్యలో అంతర పంటగా అందుకొర్రలను అరకతో ఎదబెట్టినాడు. ఎకరానికి 2 కిలోల అందుకొర్రల విత్తనాలు ఉపయోగించాడు. ప్రతి 6వ రోజు ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని జామ మరియు అందుక్కారల పంటలకి కలిపి అందిస్తూ వచ్చాడు. అదేవిధంగా జామకి నీరు అందించినపుడు అండుకొర్రలకు కూడా నీరు అందిస్తూ వచ్చాడు.

Farmer Success Story

Farmer Success Story

అవసరాన్ని బట్టి జామ మరియు అండుకొర్రలకు కలిపి వేస్ట్ డికంపోజరు ద్రావణం, నూనెలు, మొలకల ద్రావణం మొదలగునవి పిచికారి చేస్తూ, ర వచ్చాడు. ఏప్రియల్ నెలలో అండుకొర్రలను కోత కోయించాడు. 2 ఎకరాలకుగాను 1365 కిలోల దిగుబడి సాధించాడు. అండుకొర్రల గడ్డిని కూడా పశువుల మేత కొరకు రు. 12000/-లకు అమ్మకం చేశాడు. వీటితోపాటు అర ఎకరంలో ఊదలు మరియు సామలు సాగు చేసి 80 కిలోల ఊదలు, 60 కిలోల సామలు దిగుబడి సాధించాడు.

Also Read: Farmer success story: గులాబీ పండించి నెలకు లక్షలు సంపాదన

Must Watch:

Leave Your Comments

 Reu Plant Benefits: సదాపాకు తో ఎన్నో ప్రయోజనాలు.!

Previous article

Health Benefits of Aloevera: చేదుగా ఉండే కలబందతో చెప్పలేనన్ని ప్రయోజనాలు!!

Next article

You may also like