రైతులు

Farmer Success Story: సేంద్రియ సాగు వైపు కు అడుగులు వేస్తున్న రైతు.!

0
Organic Farming
Organic Farming

Farmer Success Story: సేంద్రియ సాగు వైపు కు అడుగులు వేస్తున్న రైతు.!
రసాయన వ్యవసాయం వలన ఖర్చులు పెరగటంతోపాటు నేలలు పాడవడం మరియు రసాయన అవశేషాలున్న ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దానితోపాటు పర్యావరణం కూడా కలుషితమైపోతుంది. దీనిని గమనించిన నిపుణులు రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా అనేక పద్దతులు సిఫారసు చేయడం జరిగింది.

Farmer Success Story

Farmer Success Story

ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల కొరకు ఎదురు చూస్తున్న రైతులు రసాయనాలను వదలి వడివడిగా సేంద్రియ బాట పట్టడం జరుగుతుంది. కొంతమంది రైతులు పూర్తిగా రసాయనాలను వదలి వేసి కేవలం సేంద్రియ పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తూ వారి వారి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకొంత మంది రైతులు పూర్తిగా రసాయనాలను వదలకుండా కొద్ది కొద్దిగా రసాయనాలను దూరంగా పెడుతూ సేంద్రియ పదార్థాలను ఏఏటికాయేడు పెంచుకుంటూ పంటలు పండిస్తున్నారు.

Also Read: Farmer Success Story: ప్రకృతి వ్యవసాయంతో కరివేపాకు సాగు చేస్తున్న యువరైతు.!

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మోహన్రెడ్డి అందరి మాదిరిగానే రసాయన వ్యవసాయం చేస్తూ వస్తున్నాడు. సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్న తరువాత మెల్ల మెల్లగా రసాయనాలను వదిలి వేస్తూ సేంద్రియ పదార్థాలను ఉపయోగించటం ప్రతి సంవత్సరం పెంచుకుంటూ నేటికి 90 శాతానికి పైగా సేంద్రియ పద్ధతులు పాటించే స్థాయికి రావటం జరిగింది. తప్పనిసరి పరిస్థితులలో అంటే పంట నష్టపోయే సందర్భంలో మాత్రమే తన వ్యవసాయంలో కొద్ది మొత్తంలో రసాయనాలను ఉపయోగిస్తూ పంటలు పండిస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయానికి మూల స్థంభాలైన దేశీయ ఆవులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలతో వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకొని పంటలపై ఉపయోగిస్తూ వస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో భాగమైన పచ్చిరొట్ట పైర్లు పెంచడం, సేంద్రియ ఎరువులు, వేస్ట్ డికంపోజర్ మొదలగు వాటిని కూడా ఉపయోగిస్తూ ఆరోగ్యకరమైనదిగుబడులు సాధిస్తున్నాడు. మొత్తం 21 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు.

13 ఎకరాలలో పచ్చిరొట్టగా ఎకరానికి 40 కిలోల జనుము విత్తనాలను ప్రభుత్వం వద్ద నుంచి కిలో రూ.50/-లకు రాయితీపై కొనుగోలు చేసి చల్లుకున్నాడు. పూత వచ్చే సమయములో పచ్చిరొట్టను రొటోవేటర్ సహాయంతో భూమిలో కలియ దున్ని దానిపై వేస్ట్ డికంపోజర్ ద్రావణాన్ని చల్లి అది కుళ్ళిన తరువాత ఆ భూమిలో కాలిఫ్లవర్, క్యాబేజి, క్యారెట్, టమాటా మొదలగు వివిధ రకాల కూరగాయ పంటలను సాగు చేయాలని ప్రాణాళిక సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం 3 ఎకరాలలో బొప్పాయి, 2 ఎకరాలలో టమాట, ఒక ఎకరంలో కాకర, 2 ఎకరాలలో పచ్చి మిరప సాగులో ఉంది.

టమాటా: 30 ట్రక్కుల చెరకు ఫ్యాక్టరీలలో లభించే ప్రెస్ మద్ని తోలుకుని అందులో అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లమ్, పి.ఎస్.బి., సూడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడి, వేస్ట్ డికంపోజర్ లాంటివి కలిపి 60 రోజులు మాగిన తరువాత అందులో ఘనజీవామృతం కలుపుకొని 2 ఎకరాల టమాటకి దుక్కిలో వెయ్యడం జరిగింది. వి.ఎస్. 440 రకం విత్తనాన్ని సొంతంగా నారుపోసుకుని 20-25 రోజులు పెరిగిన నారుని మే 3వ వారంలో నాటుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే టమాటా పిందెలు రావడం మొదలయ్యింది.

Tomato Farm

Tomato Farm

ఇప్పటి వరకు వేస్ట్ డి కంపోజర్ ద్రావణాన్ని పిచికారి చేసుకుంటూ వస్తున్నారు. మొదటి పిచికారిలో 100 లీటర్ల నీటికి 30 లీటర్ల వేస్ట్ డి కంపోజరు ద్రావణం, రెండవ పిచికారి 100 లీటర్ల నీటికి 40 లీటర్ల వేస్ట్ డికంపోజర్ ద్రావణం ఈ విధంగా పెంచుకుంటూ 100 లీటర్ల నీటికి 100 లీటర్ల వేస్ట్ డి కంపోజర్ కలిపి పిచికారి చేస్తూ ఉంటారు. ప్రతి 10 నుండి 15 రోజులకు ఒకసారి నూనెలు, వేస్ట్ డికంపోజర్ ద్రావణం, నీమాస్త్రం మార్చిమార్చి టమాట పంటకు పిచికారి చేస్తుంటారు. ప్రతి 12 రోజులకు ఎకరానికి 300 నుంచి 400 లీటర్ల చొప్పున జీవామృతం భూమికి అందిస్తూ వస్తున్నారు.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Farmers Story: బంజరు భూమిని సారవంతం చేసి జనపనార సాగు

Must Watch:

Leave Your Comments

Cabbage and Cauliflower Cultivation: క్యాబేజి, కాలీఫ్లవర్ సాగులో మెళుకువలు.!

Previous article

 Reu Plant Benefits: సదాపాకు తో ఎన్నో ప్రయోజనాలు.!

Next article

You may also like