Jasmine Cultivation: మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా , రాష్ట్రాల్లో విస్తారంగా సాగు చేస్తు న్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో గుండుమ లైను ఎక్కువ విస్తీర్ణంలోను, జాజిమల్లె, సనను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. గుండుమల్లె, జాజిమల్లి సువాసనలను వెదజ ల్లుతాయి. ఈ పూలలో బెంజైల్ ఎసిఫేట్, బెంజైల్ బెంజోయేట్, యూజినాల్, టెర్పనాల్, బెంజాల్డిహైడ్, ఇండోల్ కాంపౌండ్స్, జాస్మిన్, మిథైల్ జాస్మొనేట్ ఉన్నందున పూలకు సువాసనను సంతరించుకున్నాయి.గుండుమల్లె మార్చి నుంచి సెప్టెంబరు వరకు, జాజిమల్లె మార్చి నుంచి నవంబరు వరకు పూల దిగుబడినిస్తాయి. అయితే ఈ మధ్యకా లంలో కొన్ని ప్రాంతాల్లో తమిళనాడురాష్ట్రంలోని మధురై, రామేశ్వరం ప్రాంతాల నుంచి రామనాథపురం అనే గుండుమలై పిలకలను సేకరించి సాగు చేస్తూ పూల దిగుబడి పొడిగించగలుగుతున్నారు.మల్లెలో పూల దిగుబడులు చాలా తక్కువగా ఉన్నాయి.
చెట్లను నీటి ఎద్దడికి గురి చేసి ఆకులు రాల్చడం: మల్లెతోటలకు నవంబరు నుంచి నీరు పెట్టకుండా చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి/ వాడబెట్టి ఆకులు రాలేటట్లు చేయాలి.కొమ్మలన్నింటిని దగ్గరకు చేర్చి తాడులో కడితే ఆకులు తొందరగా రాలుతాయి.ఆకులు రాలకుంటే కూలీలతో దూయించాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని.తోటలో గొర్రెల మందను లేదా మేకలమందును వదిలితే ఆకులన్నిటిని తినేస్తాయి.ఆకుల్ని రసాయనాలు పిచికారి చేసి కూడ రాలేటట్లు చేయవచ్చు. లీటరు నీటికి 3 గ్రా. పెంటాక్లోరోఫి నాల్ లేదా పొటాషియం అయొడైడ్ను కలిపి మొక్కలపై పిచికారి చేస్తే ఆకులన్ని రాలి ఎక్కువ పూల దిగుబడి పొందే అవకాశముంటుంది.
కత్తిరింపులు: మల్లెలో కొత్త రెమ్మల చివరి భాగంలోను, పక్కల నుంచి పూత పుడుతుంది. కాబట్టి పూలు పూసే కొమ్మలు, రెమ్మలను ఎక్కువ సంఖ్యలో పొందటానికి తద్వారా అధిక పూల దిగుబడి పొందేందుకు కత్తిరింపులు చేయాలి. కత్తిరింపులు మొక్క పెరుగుదల, మొగ్గలు ఏర్పడడం, పూల దిగుబడి, నాణ్యతలపై ప్రభావం చూపుతాయి.జనవరి మొదటి పక్షంలో 5 సంవత్సరాల్లోపు వయస్సున్న తోటల్లో తీగలను భూమి నుంచి రెండు అడుగులు, 5 సంవత్సరాలపైన వయస్సున్న తోటల్లో మూడు అడుగులు ఉంచి మిగిలిన పైభాగాన్ని కత్తిరించాలి.వీటితోపాటు ఎండిన, బలహీ నంగా ఉన్న కొమ్మల్ని, నీరు పారించిన తరువాత పుట్టుకొచ్చే నీటి కొమ్మల్ని పూర్తిగా కత్తిరించి తొలగించాలి.తీగ జాతికి చెందిన రకాల్లో కూడా ఈ కాలంలోనే కత్తిరింపులు చేయాలి. 90 సెం.మీ. ఎత్తులో కొమ్మలు కత్తిరించి మొక్కకు 10-13 కొమ్మలు ఉండేలా చేయాలి.
Also Read: Vippa Flower Benefits: విప్ప పువ్వుతో విశిష్టమైన ఆరోగ్య లాభాలు.!
తవ్వకాలు: చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి కొమ్మల కత్తిరింపులు చేసిన తరువాత తేలికపాటి తడిచ్చి నేలను మెత్తబడే టట్లు చేయాలి.నేల ఆరిన తరువాత మొక్క మొదలు చుట్టూ 30 సెం.మీ. వదిలి 15 cm లోతుకు తవ్వాలి. వారం రోజుల పాటు ఎండనివ్వాలి. ఈ విధంగా తవ్వడం ఖర్చుతో కూడు కొన్న పని. వరుసల మధ్యలో దుక్కి చేసి కలుపుపోయేటట్లు చేసి వారం రోజులు ఎండనివ్వాలి.
నీటి యాజమాన్యం: మల్లె చెట్లను నీటి ఎద్దడికి గురి చేసి ఆకులు రాలేటట్లు చేయాలి.కొమ్మలకు కత్తిరింపులు పూర్తిచేసి ఎరువులు వేసి నీరు పారిస్తే కొత్త చిగుర్లు ఎక్కువగా పుడుతాయి.తద్వారా అధిక పూల దిగుబడి వస్తుంది.ఒకసారి పూలు కోయడం అయిన తరువాత 7-10 రోజులు నీరు పెట్టకుండా మొక్కలు కొంచెం వాడే టట్లు చేసి ఆ తరువాత నీరు పెడితే పూలదిగుబడి అధికంగా ఉంటుంది.పూత పూసే సమయంలో మొక్కలు నీటి ఎద్దడికి గురికాకూడదు. నేల స్వభావాన్ని బట్టి పూలు పూసే సమయంలో అయిదారు రోజు లకొకతడివ్వాలి.
ఎరువుల యాజమాన్యం: సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేస్తే పూల ఉత్పత్తి, నాణ్యత ఆశాజనకంగా ఉంటుంది. అవసరాన్ని మించి ఎరువులు వేస్తే శాఖీయ పెరుగుదల ఎక్కువై పూల దిగుబడి, నాణ్యత తగ్గుతాయి.నత్రజనిని ఎక్కువగా వేస్తే శాఖీయ పెరుగుదల ఎక్కువ కావడం, పూలకాడ సన్నగా, పొడవుగా పెరగడం, పూలు త్వరగా చెడిపోవడం, దిగుబడి తగ్గడం లాంటి ఇబ్బందులు గుల ఎదురవుతాయి.చెట్టు చుట్టూ గాడిచేసి, గాడిలో ఎరువులు వేసి గాడిని మట్టితో మూయాలి. ఇలా చేస్తే వేసే పోష కాలు చెట్లకు పూర్తిగా లభ్యమవుతాయి.
Also Read: Marigold Cultivation: బంతి సాగులో -విజయా గాధ.!
Must Watch: