పశుపోషణ

Livestock Farming: దూడల పోషణలో మెళుకువలు.!

0
calves
calves

Livestock Farming: మేలైన యాజమాన్యంవల్ల దూడలు త్వరగా ఎదిగి, 2 1/2 సంవత్సరాలకు ఎదకు రావాలి. 3 1/2 సంవత్సరాల వయస్సులోనే మొదటి ఈత ఈని, పాలివ్వాలి. అప్పుడే రైతు ఒక పశువు జీవితకాలంలో ఎక్కువ పాలను పొంది అధిక లాభాలు ఆర్జించే అవకాశo ఉంటుంది. నేటి దూడలే రేపటి పాడిపశువులు కనుక దూడల పోషణ, ఆరోగ్య పరిరక్షణ, ప్రత్యుత్పత్తి వంటి విషయాల్లో తగు జాగ్ర త్తలు పాటిస్తే పాడిపరిశ్రమ ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చు.

Livestock Farming

Livestock Farming

పుట్టిన దూడల గురించి జాగ్రత్తలు: ఆవుదూడల కంటే 3 నెలల వయ స్సున్న గేదె దూడల్లో ఎక్కువ మర ణాలు సంభవిస్తాయి. కావున 3 నెలల వరకు ఆరోగ్య పరిరక్షణముఖ్యం. పుట్టిన వెంటనే దూడపై ఉన్న శ్లేష్మ (జిగట)ను పరిశుభ్రమైన 4-5 నెలలు గోనె సంచితో తుడవాలి. ముక్కు లోని జిగట పిండివేయాలి.పుట్టిన అరగంట నుంచి గంట లోగా దూడ నిలబడుతుంది.

దూడ బొడ్డును 11000 పొటా షియం పర్మాంగనేటు ద్రావణంతో బాగా కడిగి శుభ్రం చేయాలి. బొడ్డును రెండున్నర అంగుళాల దారంతో కట్టి, మిగతా భాగం కత్తిరించి, టింక్చర్ ఆయోడిన్ పూయాలి. అలా చేయడంవల్ల బొడ్డు రంధ్రం మూసుకుపోయి, బొడ్డు వాచి, చీముపట్టడం, శ్వాసకోశ జబ్బులు, కీళ్ళవాపులు మొదలైన రోగాల నుంచి దూడలను కాపాడవచ్చు.

దూడ కట్టే ప్రదేశం పొడిగా, మురికి లేకుండా బాగా గాలివెలుతురు ప్రసరించేలా ఉండాలి. మండు వేసవిలో దూడలపై గోనెసంచులు కప్పి నీటితో తడపాలి. గేద దూడలు పుట్టినప్పుడు 30-40 కిలోల బరువుంటాయి. పుట్టిన గంటలోపే దూడ బరువులో పదో వంతు అనగా సుమారు రోజుకు మూడు లీటర్ల జున్ను పాలు తాగించాలి.

Also Read: Artificial Insemination in Cows: ఆవులలో కృత్రిమ గర్భధారణకు సరియైన సమయం తెలుసుకోండి.!

జున్ను పాలలో వ్యాధినిరోధక శక్తి నిచ్చే విటమిన్ ‘ఎ’ మాంసకృ తులు ఉండటంవల్ల దూడకు 24 గంటల్లో తాగినన్ని జున్ను పాలివ్వాలి. మూడు రోజులు జున్ను పాలు తాగించి, ఆ తర్వాత తల్లి నుంచి వేరుచేసి మామూలు పాలు తీసి పాత్రల్లో పోసి తాగించవచ్చు.

జున్ను పాలు లభించని ఎడల పావులీటరు వేడినీళ్లలో ఒక గుడ్డు కలిపి, అర స్పూన్ ఆముదం నూనె, 10,000 యూనిట్ల విట మిన్ ఏ, అరలీటరు వేడిపాలు, 50-60 మి.గ్రా. అరోమైసిన్రోజుకు మూడుసార్లు తాగించాలి.మోతాదుని మించి పాలు తాగిస్తే అజీర్తివల్ల దూడ పారుకుంటుంది.పాలలో కాల్షియం తప్ప దూడ పెరుగుదలకు దోహదపడే ఇనుము, మైలతుత్తం (కాపర్), జింక్, మాంగనీసు లాంటి ఖనిజ లవణాలుండవు. కనుక ఖనిజలవ ణాలు గల ఇటుకలను దూడలు న్నచోట వేలాడకట్టాలి.నెలలోపు దూడలను బయటకు వదిలినపుడు నోటికి బుట్టలు కట్ట డంవల్ల మట్టి తినటం అరికట్టవచ్చు.

పోషణ: సాధారణంగా పోషణ సరిగా ఉంటే గేదె దూడలు రోజుకు 400-500 గ్రా. చొప్పున పెరిగి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ త్వరగా వృద్ధిచెంది, 25-35 నెలల వయస్సులో 450-500 కిలోల బరువు పెరిగి ఎద కడతాయి. పోషక పదార్థాల లోపాలున్నప్పుడు, గిడసబారి కుర మేతలు చగా ఉండటం, పొట్టకింద నీరు చేరటం, వెంట్రుకలు అస్తవ్యస్తంగా మారటం, వెంట్రుకలు రాలటం, మేత బారిన ప తొట్లు, నీటి తొట్లు, నేలను నాకటం, ఒకదాన్నొకటి నాకటం లాంటి లక్షణాలకు లోనై వ్యాధులకు లోనవు తాయి.

ఆరోగ్య పరిరక్షణ: దూడలు వ్యాధి మేత బారిన పడకుండా ఉండాలంటే పరిసరాలు పొడిగా, శుభ్రంగా, గాలి, వెలు వల తురు బాగా ఉండాలి.

weak calf

weak calf

మేత తొట్లు, నీటితొట్లు, సున్నంతో బాగా వారాని కోసారి కడిగి శుభ్రమైన నీరు ఇవ్వాలి. పేడ ఎప్పటికప్పుడు తీసివేయడం వల్ల ఈగలు, ఇతర క్రిములు దూ పాలు వృద్ధి చెందవు. వ్యాధిని వ్యాపింపచేసే ఈగలు, పిడుదులు, చీమలు, నల్లులు క్రిమిసంహారక మందులు వాడి నివారించాలి.

దూడ పుట్టిన 5-6 రోజుల్లో అపరిశుభ్రత పరిసరాల వల్ల, పాలు పరిశుభ్రంగా లేనిచో దూడలలో తెల్లపారుడు వ్యాధి వల్ల మరణిస్తాయి. వెంటనే గుర్తించి మాత్రలు/ బిళ్లలు వెయ్యాలి.దూడ పుట్టిన తరువాత ప్రతినెలకొకసారి నట్టల మందులు వాడి ఏలికపాములు, బద్దెపురుగుల, పొట్ట జలగల బారి నుండి దూడలను రక్షించాలి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Lung Plague Disease in Cows: ఆవులలో కంటేజియస్ బొవైన్ ఫ్లూరో న్యూమోనియా ఎలా వ్యాపిస్తుంది.!

Must Watch:

Leave Your Comments

Tobacco Caterpillar Management: వివిధ పంటల నాశించే పొగాకు లద్దెపురుగు సమగ్ర యజమాన్యం..!

Previous article

Alovera Plant: కలబంద తో ఎన్నో ఉపయోగాలు.!

Next article

You may also like