Bacterial Benefits for Crops: మనందరికీ బ్యాక్టీరియా అనగానే అదోరకమైన హానికారక జీవి అనే భయం ఉంటుంది. కానీ మంచి చేసేవి కూడా ఉన్నాయి. ప్రాణ వాయువు లేదా ఆక్సిజన్ ఉపయోగించుకునే దానిని బట్టి బ్యాక్టీరియాని వాయురహిత, వాయుసహిత బ్యాక్టీరియాలుగా విభజించారు. వాయురహిత బ్యాక్టీరియా వ్యవసాయంలో, పెరటితోటల్లో రైతులకు ఉపయోగపడుతుందో చూద్దాం.. ఎలా కంటికి కనిపించని ఈ లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా సర్వత్రా ఉండి, మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా సంవత్సరాల కింద నుంచే ప్రపంచంలో ఈ లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా వాడుకలో ఉంది. మానవ వినియోగానికి సురక్షితం కనుక ఆహార పదార్థాల నిల్వలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
పిండిపదార్ధాలను వినియోగించుకుని, పులియ బెట్టడం (ఫెర్మెంటేషన్) ప్రక్రియల ద్వారా లాక్టిక్ ఆమ్లాన్ని తయారు చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు ఆక్సిజన్ లేదా ప్రాణవాయువు అవసరం ఉండదు. నేలలో, గాలి ప్రసారాన్ని మెరుగుపరచడం ద్వారా పండ్లు, కూరగాయ మొక్కల పెరుగుదలలో కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది. లాక్టిక్ ఆమ్లం సమక్షంలో అమ్మ వాతావరణంలో ఈ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. మానవ జీర్ణవ్యవస్థలో ఒక ప్రోబయాటిక్ గా ప్రయోజనకరమైన పాత్ర పోషిస్తోంది. పులిసిన మీగడ పెరుగు, పుల్లని మజ్జిగ ఉత్పత్తిలో ఈ బ్యాక్టీరియా ముఖ్యమైనది. ఈ ఆమ్లం ఆహార నిల్వలో ముఖ్యపాత్ర పోషిస్తూ, పోషక విలువలను కాపాడుతూ పెంచుతుంది. తక్కువ ఖర్చుతో సేకరించడమే కాకుండా, ఉపయోగించడం, నిల్వ చేయడం కూడా సులభం.
కావాల్సిన పదార్థాలు: ఎన్నో ప్రయోజనాలున్న లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియాని సులువుగా మన ఇంట్లోనే తయారు చేసుకునేందుకు బియ్యం కడిగిన నీరు, మస్లిన్ వడపోత గుడ్డ, ప్రాసెస్ చేయని పచ్చి పాలు, బెల్లం లేదా బ్రౌన్ షుగర్, మట్టి లేదా గాజు పాత్ర. వడపోతకు పలుచని కాగితం, దారం లేదా రబ్బర్ బ్యాండ్ వంటివి అవసరం.
Also Read: Bacterial Diseases in Pomegranate: దానిమ్మలో వచ్చే బాక్టీరియా తెగులు మరియు దాని యజమాన్యం
అన్నం వండేముందు 2, 3 సార్లు కడిగిన బియ్యం నీరు కీలకం. ఈ నీటిలో ఉండే పిండిపదార్థం ఈ బ్యాక్టీరియాకి ఆహారంగా పనికొస్తుంది. పాలిష్ చేయని బియ్యం అయితే మంచిది. తెల్లబియ్యం అయినా ఫర్వాలేదు.. ఈ నీటిని మట్టికుండ లేదా గాజు పాత్రలో పోసి మూతిని వస్త్రంతో గట్టిగా మూసి దారం లేదా రబ్బర్ బ్యాండ్లో మూయాలి. గది వాతావరణంలో సూర్యకాంతి సోకని ప్రదేశంలో 3, 4 రోజులు కదల్చకుండా ఉంచాలి. లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా 25 డిగ్రీల సెం.గ్రే. వద్ద బాగా పెరుగుతుంది. ఈ దశలో బియ్యం నీరు పులియడం మొదలవుతుంది. రెండురోజుల తర్వాత పొరలు పొరలుగా కనిపించడమే కాకుండా పులిసిన వాసన వస్తుంది. ఈ నీళ్లలో లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియాతో పాటు ఇతర బాక్టీరియా కూడా ఉంటుంది. 3, 4 రోజులు ఈ నీటిని కదల్చకుండా ఉంచితే లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా ప్రధానమైన బ్యాక్టీరియా అవుతుంది. మీగడలాంటి పొర నీటి పైన తేలుతూ కనపడినప్పుడు పులియబెట్టిన నీటిని విడిగా తీయాలి. ఈ నీటిలో లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి కావాల్సిన పోషకాలు ఉండవు.
పోషకాలకు పాలు ప్రధానమైనవి. కాచిన లేదా ప్యాకెట్ పాల కంటే తాజాగా పితికిన ఆవు, గేదె లేదా మేక పాలు వాడాలి. ఈ దశలో ఈ నీటిలో లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా మాత్రమే ఉంటుంది. మీరు తయారుచేసుకునే పాత్రని బట్టి 10 మి.లీ. లేదా 10 పాళ్లు పులియబెట్టిన నీరు, 100 మి.లీ. లేదా 100 పాళ్లు పాలు (1 హలు లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా కలిగిన నీరు: 10 పాళ్లు పాలు) 2/3 వంతు వరకు నింపాలి. గాలి చొరబడకుండా గట్టిగా మూసి వాయురహితంగా (అనరోబిక్ ఇక చేసి, సూర్యరశ్మి సోకని ప్రాంతంలో, గది ఉష్ణోగ్రత వద్ద 3, 4 రోజుల ఉండాలి. ఈ దశలో పాత్రని కదిలించకూడదు మూడురోజుల తర్వాత పాత్రలో మూడు పొరలు కనిపిస్తాయి. పైన తేలియాడే తెట్టు, లేత పసుపు, వర్ణపు ద్రావణంతో కలువకుండా జాగ్రత్త పడాలి. అడుగున ఏదైనా కలవని పదార్థం మిగిలిపోతే లేతపసుపు వర్ణ ద్రావణంతో కలవకుండా జాగ్రత్త తీసుకోవాలి. మస్లిన్ గుడ్డ లేదా శుభ్రమైన వస్త్రంలో వడకట్టాలి. ఈ లేత పసుపు వర్ణ ద్రావణంలో లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది కుళ్లిన వాసన కాకుండా పులిసిన వాసన రావాలి. పైన తెట్టుని కోళ్లకి ఆహారంగా లేదా కంపోస్ట్ గా వాడుకోవచ్చు.
లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా చాలా త్వరగా పెరుగుతుంది. కుళ్లిపోతున్న మొక్కభాగాల్లో, మనుషుల నోటిలో, పాలలో, యోనిలో, జీర్ణాశయాంతర భాగాల్లో ఉపయోగకారిగా ఉంటుంది. అలాగే కూరగాయల్లో, పులిసిన బ్రెడ్, మాంసం, పులిసిన పిండిపదార్థాల్లో, వైన్, పాల ఉత్పత్తుల్లో అధికంగా ఉంటుంది. ఆమ్ల తత్వాన్ని తట్టుకుంటుంది. అందువల్ల హానికారక సూక్ష్మజీవులను దరిచేరనీయదు. ఇలా తయారైన బ్యాక్టీరియాని కొన్ని నెలల పాటు సమతూకంగా బ్రౌన్ షుగర్ లేదా మోలాసిస్ కలిపి ఒక గాజు సీసాలో 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. మూత కొంచెం వదులుగా ఉంచితే సీసా పగలకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ దశలో బ్యాక్టీరియా ఒక రకమైన తియ్యని వాసనతో ఉంటుంది. ఒకవేళ కుళ్లిన వాసన వస్తే వెంటనే నేలలో పారబోయాలి.
Also Read: Bacterial Growth: బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడు అంశాలు.!
Must Watch: