Techniques in Raising Quails: క్వయిల్స్ త్వరగా యుక్త వయసుకు వచ్చి, 6-7 వారాలకే ఫాస్ఫోలిపి గుడ్లకు వస్తాయి. 100 క్వయిల్ పక్షులకు రెండు కేజీల లోపు క్వయిల్ దాణా సరిపోతుంది.క్వయిల్స్ విశిష్టత ఆరు, ఏడు వారాల వయసులో గుడ్లు కార్బోహైడ్రే పెట్టడం ప్రారంభిస్తే, 10వ వారం ఆఖరుకల్లా 85 శాతం గుడ్లు పెట్టటం పూర్తయిపోతుంది. క్వయిల్ గుడ్డు ధర 15 నుండి 20 పైసలు మాత్రమే. అయితే ఇవి పరిమాణంలో చిన్నగా ఉండటం వలన అంత ఆదరణ పొందలేదు. కాని విందు వినోదాలలో, పార్టీలలో క్వయిల్ గుడ్ల మసాలా వంటకాలు, కూరలు, అందరి ష్టాన్ని చూరగొంటున్నాయి.
క్వయిల్ గుడ్ల పచ్చళ్ళు, గుడ్లతో పొదిగించే తయారు చేసే యితర ఉత్పత్తులు, మంచి లాభాలను తెస్తున్నాయి. క్వయిల్ గుడ్డు కోడి గుడ్డులో సరిగ్గా 5వ వంతు ఉంటుంది. ఒక్కొక్క గుడ్డు 10 గ్రాముల బరువు వుంటుంది. గుడ్డు పెంకు పైన తెలుపు, గోధుమరంగు చుక్కలు (మచ్చలు) ఉంటాయి. పోషక విలువల దృష్ట్యా, క్వయిల్ గుడ్డు, కోడి గుడ్డుకు దాదాపు సమానం. పచ్చ సొన, తెల్ల సొన 39 61 నిష్పత్తిలో ఉంటాయి. కోడి గుడ్డులో కంటే ఈ నిష్పత్తి ఎక్కువ. వినియోగిం క్వయిల్ గుడ్డులో నీరు 74 శాతం, ప్రోటీన్ (మాంసకృత్తులు) 13 శాతం కొవ్వు 11 శాతం, కార్బోహైడ్రేట్స్ 1 శాతం, యాష్ (భస్మం) 1 శాతం వుంటాయి.
Also Read: Kitchen Garden: కిచెన్ గార్డెన్ యొక్క ప్రయోజనాలు
క్వయిల్ మాంసం విశిష్టత మాంసం కోసం పెంచే క్వయిల్ పక్షులను 5 వారాల వయసుకే అమ్మివేయవచ్చు. ఒక కోడి పిల్లను వుంచే స్థలంలో 8-10 క్వయిల్ పక్షులను ఉంచవచ్చు. 100 నుండి 200 గ్రాముల బరువుండే ఒక్కొకు పక్షి ధర రు. 16లు వుంటుంది. క్వయిల్ మాంసం ధర కిలో రు. 90 నుండి రు. 110లకు అమ్ముతున్నారు. డ్రెస్సింగ్ పర్సంటేజ్ 70 శాతం ఉంటుంది.’మనుషులలో శరీరం, మెదడు ఎదుగుదలకు క్వయిల్. మాంసం దోహదం చేస్తుంది. గర్భిణీలు, బాలింతలకు క్వయిల్ మాంసం మంచి సమతులాహారం. క్వయిల్ మాంసంలోఫాస్ఫోలిపిడ్స్ ఎక్కువగా వుంటాయి. కొలెస్టరాల్ భయం లేదు. క్వయిల్ పచ్చి మాంసంలో తేమ 73.93 శాతం, ప్రోటీన్స్ (మాంసకృత్తులు) 20.54 శాతం, కొవ్వు 3.85 శాతం, కార్బోహైడ్రేట్స్ 0.56 శాతం, మినరల్స్ 1.12 శాతం వుంటాయి.
కల్స్ పెంపకంలో మెళకువలు-
ఇంక్యుబేషన్ (పొదిగించటం) : క్వయిల్ గుడ్ల ఇంక్యుబేషన్ సమయం 18 రోజులు. క్వయిల్ గుడ్ల పెంకు, కోడి గుడ్ల పెంకు కంటే పల్చగా వుంటుంది. అందువలన గుడ్లను ఏరేటప్పుడు, భద్రపరిచేటప్పుడు జాగ్రత్త వహించాలి. పొదిగించే గుడ్లన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. దుమ్ము, ధూళి లేని పరిశుభ్రమైన గదిలో, చల్లని వాతావరణం కల్పించి, ఆ గదిలో పొదిగే గుడ్లను వుంచాలి. గది ఉష్ణోగ్రత 14-17 డిగ్రీ సెంటీగ్రేడ్ సంబంధిత తేమ 70-80 శాతం వుండాలి. ఇంక్యుబేషన్ గదిలో గుడ్లను వుంచేటప్పుడు, గుడ్డు వెడల్పు భాగం పైకి వుండేలా పెట్టాలి. ఏడు రోజుల కంటే ఎక్కువ నిలువ లేని గుడ్లను మాత్రమే ఇంక్యుబేషన్‌కు వినియోగించాలి. గుడ్లు పరిశుభ్రంగా వుండాలి. ఇంక్యుబేషన్ చేసే గుడ్లను కడగకూడదు.
క్వయిల్ పక్షులను కృత్రిమంగా పొదిగించటానికి, మార్కెట్లో చాలా రకాల ఇంక్యుబేటర్స్ అందుబాటులో వున్నాయి. కోడిగుడ్ల ట్రేలు వున్నవారు, వాటికి వైర్‌తో కొద్దిపాటి మార్పులు చేసి, క్వయిల్ గుడ్లకు వాడుకోవచ్చు. కొయ్యతో చేసిన ట్రేలు కూడా అందుబాటులో వున్నాయి. ట్రేలో గుడ్లను పెట్టేటప్పుడు కూడా, గుడ్లు వెడల్పు భాగం పైకి వుండేలా పెట్టాలి. ఇంక్యుబేటర్‌లో ఫ్యాన్ తప్పనిసరిగా వుండాలి. ఎందుకంటే, గుడ్డులో పిల్ల ఏర్పడే దశలో వాటికి ఆక్సిజన్ అవసరమవుతుంది. అలాగే అవి కార్బన్ డయాక్సైడు, వేడిని విడుదల చేస్తాయి. ప్రారంభంలో కొద్దిగా గాలి సరిపోతుంది. పొదిగే ప్రక్రియ కొనసాగే కొద్దీ గాలి ఎక్కువ అవసరం అవుతుంది. రోజుకు కనీసం 4-6 సార్లు 90 డిగ్రీల కోణంలో గుడ్లను అటూ యిటూ తిప్పేలా ఇంక్యుబేటింగ్ యంత్రంలో ఏర్పాటు వుండాలి. 14 రోజుల తరువాత గుడ్లను తిప్పటం ఆపేయవచ్చు. కోడి గుడ్లకు వాడే ఇంక్యుబేటర్లను కూడా, కొద్దిపాటి మార్పులతో క్వయిల్ గుడ్లకు వాడుకోవచ్చు. ఇంక్యుబేషన్లో తొలి 14 రోజులు 99.5 డిగ్రీ ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత, 60% తేమ వుండి రోజుకు 5-6 సార్లు గుడ్డును తిప్పాలి. మిగిలిన 15-18 రోజులు 98.5 డిగ్రీ ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత, 70% తేమ వుండాలి.
బ్రూడింగ్లో జాగ్రత్తలు, కావలసిన సౌకర్యాలు : క్వయిల్స్ బ్రూడింగ్ వ్యవధి 10 రోజులు. బ్రూడింగ్ సమయంలో సరైన వెచ్చదనం, నిరవధికంగా మేత, నీరు ఇవ్వాలి. 10 రోజుల తరువాత క్వయిల్ను బ్రూడింగ్ నుండి కేజెసికి మార్చాలి. ఇతర దానికి, పక్షుల పెంపకంలో వాడు బ్యాటరీ బ్రూడర్స్‌ను క్వయిల్స్ట లో కూడా వాడవచ్చు. అయితే కొన్ని మార్పులు చేసుకోవాల్సి టి వుంటుంది. తొలి వారంలో క్వయిల్ పిల్లల కాళ్ళు వైరైటీ యిరుక్కొని విరిగిపోకుండా, వైర్ పైన దళసరిగా వుండే పేపర్‌ను చుట్టాలి. పిల్లలు బయటకు వెళ్ళి పోకుండా గార్డ్ వేలా ఏర్పాటు చెయ్యాలి. ఈకలు వచ్చే వరకు క్వయిల్ పిల్లలకు అదనంగా వెచ్చదనం కావాలి. పొదిగిన క్వయిల్ పక్షి పిల్లలను ఆన్ ఇంక్యుబేటర్ నుండి సరాసరి బ్రూడర్కి తీసుకు రావాలి. ని బ్రూడర్ ఉష్ణోగ్రత, ఇంక్యుబేటర్ ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉండాలి. ప్రారంభంలో అధిక ఉష్ణోగ్రత (37 డిగ్రీ రం సెంటీగ్రేడ్) అవసరం. క్రమంగా ప్రతి వారం 3 డిగ్రీ సెంటీగ్రేడ్ ఐలో చొప్పున గది ఉష్ణోగ్రతకు (28 డిగ్రీ సెంటేగ్రేడ్) చేరే వరకు ఎలా తగ్గిస్తూ ఉండాలి. ప్రతి బ్రూడర్లో కొంత ప్రదేశం వేడి లేకుండా ఉండాలి. అందువలన, క్వయిల్ పిల్లలు వాటి యిష్ట ప్రకారం ఎక్కడైనా తిరిగే వీలు ఉంటుంది. మేత, నీరు, వేడి ప్రదేశం వెలుపల ఏర్పాటు చెయ్యాలి. తద్వారా క్వయిల్ పిల్లలు “ల్ మేత కోసం, నీటి కోసం వేడి లేని ప్రాంతానికి తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విధంగా అవి తక్కువ ఉష్ణోగ్రతను అలవాటు చేసుకుంటాయి.
Also Read: Anjeer Health Benefits: అంజూర తో ఎన్నో ఉపయోగాలు.!
Must Watch:
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171