సేంద్రియ వ్యవసాయం

Green Manures : పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెరుగుదల.!

0
Benefits of Green manures
Benefits of Green manures

Green Manures : అధిక రసాయనిక ఎరువుల వాడకం వలన నేల భౌతిక, రసాయనిక లక్షణాలు దెబ్బతింటున్నాయి. నేల యొక్క భౌతిక, రసాయనిక లక్షణాలనుపెంపొందించుటకు పచ్చిరొట్ట ఎరువుల సాగు తప్పనిసరి. పశువుల ఎరువుల లభ్యత తక్కువ ఉన్న ప్రదేశాలలో ఈ పచ్చిరొట్ట ఎరువును ప్రత్యామ్నాయంగా వేసి నేలలో కలియదున్నడం వలన భూసారాన్ని పెంపొందించవచ్చు. తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట ఎరువుల సాగుకు సరైన సమయం. జనుము, జీలుగ, పెసర, మినుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయడం వలన భూసారాన్ని పెంచవచ్చు.

Green manures

Green manures

ప్రయోజనాలు:                                                                                                                                        రసాయనిక ఎరువుల వాడకంను తగ్గించిభూసారాన్ని పెంచవచ్చు. ఈ పచ్చిరొట్ట ఎరువుల ద్వారా 25-30% నత్రజని ఎరువుల వాడకంని తగ్గించుకోవచ్చు. కలుపు మొక్కలను అరికట్టవచ్చు.లాభదాయక సూక్ష్మజీవుల సంఖ్య నేలలో పెరుగును సేంద్రియ పదార్థంను నేలకు అందిస్తుంది.నేల భౌతిక, రసాయనిక ధర్మాలు మెరుగుపడతాయి.లోతైన వేరువ్యవస్థ కల్గివుండడం వల్ల నేలలోపలి పొరలలోని పోషకాలను మొక్కకు అందేలా చేస్తుంది. చౌడు నేలలను పునరుద్ధరించవచ్చు.తొలకరి వర్షాలు పడిన సమయంలో ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసుకుని పూత దశలో అనగా 45-50 రోజుల సమయంలో కలియదున్నాలి. లేనిచో కాండం గట్టిపడి నేలలో కలియదున్నిన తర్వాత సరిగా కుళ్లిపోదు. పచ్చిరొట్ట ఎరువు 2-3 వారాల పాటు నేలలో కుళ్ళనివ్వాలి.

Also Read: Green gram Varieties: పెసర రకాలు – వాటి లక్షణాలు.!

పచ్చిరొట్ట సాగు కుదరని నేపథ్యంలో వేప, గానుగ, గైరిసీడియా, వెంపలి మొక్కల యొక్క లేత ఆకులను, కొమ్మలను 2-3 పచ్చిరొ టన్నులు ఎకరాకు వేసి కలియదున్నవలెను. జనుము చల్లిన ఏర్పడి 45 రోజుల తర్వాత నేలలో కలియదున్నాలి. జనుము హెక్టారుకు 5-19 టన్నుల పచ్చిరొట్టను అందిస్తుంది. దీనిసాగు ద్వారా హెక్టారుకు 80-90 కిలోల నత్రజని నేలకు లభ్యమౌతుంది. జీలుగు 50-55 రోజుల తర్వాత నేలలో కలియదున్నాలి. జీలుగ సాగు. ద్వారా హెక్టారుకు 25 టన్నుల పచ్చిరొట్ట ఉత్పత్తి వస్తుంది. దీని సాగు ద్వారా హెక్టారుకు 75-80 కిలోల నత్రజని లభ్యమవుతుంది. పిల్లిపెసర సాగు ద్వారా హెక్టారుకు 100-130. కిలోల నత్రజని లభ్యమగుతుంది. పిల్లిపెసర హెక్టారుకు 6-7 టన్నుల పచ్చిరొట్టను ఉత్పత్తి చేస్తుంది.

Benefits of Green manures

Benefits of Green manures 

పచ్చిరొట్ట ఎరువుల సాగులో మెళకువలు: ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను రాన్ని సద్వినియోగపరచుకొని పచ్చిరొట్ట విత్తుకోవాలి (ఉదా : వరి కోసే ముందు జనుము లేదా పిల్లిపెసర జల్లి వెంటనే వరి కోస్తారు).తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. (వరి సాగు చేయ ప్రాంతాల్లో). నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం. వరి, చెరకు పంటల సరళిలో రెండు పంటల మధ్యకాల ‘వ్యవధిలో విత్తుకొని కలియదున్నవచ్చు (చెరకు-ఫిబ్రవరి,ఆ పసుపు, కంద, చెరకు వంటి పంటల వరుసల మధ్య పచ్చి రొట్ట పెంచి పూత సమయంలో కలియదున్నవచ్చు. సాధారణంగా పచ్చిరొట్ట పైర్లు చల్లుకునేటపుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగించిన మొక్కలు తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి. లేనిచో జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులు మొక్క ఎత్తు పెరిగి కాండంలో పీచు చల్లిన ఏర్పడి చివకటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

Also Read: Parvo Viral Disease: పెంపుడు కుక్కలలో పార్వో వ్యాధి ఎలా వస్తుంది.!

Also Watch:

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Leave Your Comments

Importance of Quality Milk Production: పరిశుభ్రమైన పాల ఉత్పత్తి లో మెళుకువలు.!

Previous article

Farmer Success Story : సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్న రైతు.!

Next article

You may also like