ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకున్న కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఈ మ్యాజిక్ రైస్ ను సాగు చేస్తున్నాడు. శ్రీరాములు వ్యవసాయ కుటుంబం కావడం వల్ల చిన్నప్పటి నుంచి వ్యవసాయం పైన దృష్టి పెట్టాడు. మొదట్లో రసాయన ఎరువులు వాడి వ్యవసాయం చేశాడు. కావాల్సినంత పెట్టుబడి, నీరు అందక పోవడంతో ప్రకృతి వ్యవసాయం చేసే క్రమంలో సుభాష్ పాలేకర్ గారి రేడియో ప్రోగ్రామ్ విని తరువాత ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని, సేంద్రియ వ్యవసాయం పైన దృష్టి పెట్టాడు. ఇప్పుడు పూర్తిగా సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్నారు. అతను సుమారు 9 రాష్ట్రాలు తిరిగి 120 దేశీయ వరి వంగడాలను తీసుకొని వచ్చాడు. శ్రీకాంత్ కి ప్రతి సంవత్సరం ఒక వరి వెరైటీ తీసుకురావడం అలవాటు, తాజాగా అస్సాం ట్రైబల్స్ వద్ద దొరికే “బోక సాల్” రకం వరి వంగడం తీసుకురావడం జరిగింది. ఈ వరి వంగడం అందరినీ ఆకర్షిస్తుంది.
బోక సాల్ వరి వెరైటీ పంట సాగు సమయం జూన్ నుంచి డిసెంబర్ కాగా 145 రోజులకు చేతికి వస్తుంది. బోక సాల్ బియ్యం నీటిలో వేస్తె అన్నం అయిపోతుంది. బియ్యంలో సరిపడు నీళ్లు పోస్తే చాలు అరగంటలో అన్నం గా మారుతుంది. చల్ల నీటిలో వేస్తే చల్లని అన్నం, వేడి నీటిలో వేస్తే వేడి అన్నం సిద్ధం. ఈ మ్యాజిక్ రైస్ లో 10.73 శాతం ఫైబర్, 6.8 శాతం ప్రోటీన్లు ఉన్నాయని గౌహతి యూనివర్సిసిటీ, ఐసిఏఆర్ సంస్థలు వెల్లడించాయి.
వండకుండానే అన్నంగా మారే మ్యాజిక్ రైస్..
Leave Your Comments