పాలవెల్లువ

Percentage of Butter in Milk : పాలలోని వెన్న శాతం ను ఎలా కనుక్కోవాలి.!

0
Butter
Butter

Percentage of Butter in Milk: మన దేశంలో పాల యొక్క విలువను పాలలోని వెన్న శాతం ఆధారంగా లెక్కిస్తుంటారు. అభివృద్ధి చెందిన దేశాలలో పాల యొక్క విలువను, పాలలోని క్రిముల యొక్క సాంధ్రత ఆధారంగా అంటే, క్లీన్ మిల్క్ (పరిశుభ్రమైన పాలు) ఆధారంగా లెక్కిస్తుంటారు. పాలలోని వెన్న శాతంను గర్బర్స్ పద్ధతి ద్వారా లెక్కిస్తుంటారు.

Percentage of Butter in Milk

Percentage of Butter in Milk

పాలలోని వెన్న శాతం లెక్కించుట: (గర్బర్స్ పద్ధతి)                          కావలసిన పరికరాలు:

  1. బ్యూటిరో మీటర్
  1. 10.75 మీ.లీ పిప్పెట్

   3.10 మీ.లీ పిప్పెట్

   4.1 మీ. పెట్

  1. వాటర్ బాత్
  1. బ్యూటిరో మీటర్ సెంట్రిఫ్యూజ్

పద్ధతి :-                                                                                                                           10 మీ.లీ. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని బ్యూటిరోమీటర్ నందు తీసుకొవాలి   . దీనిలోకి బాగా కలియ బెట్టిన, వెన్న శాతం లెక్కించవలసిన పాలను 10.75 మీ.లీ పిప్పెట్ సహాయముతో బ్యూటిరో మీటర్ గోడలను తాకుతూ, సల్ఫ్యూరిక్ ఆమ్లం పై ఒక పొరలాగా పెరుకుపోయేటట్లు వేయాలి. తరువాత దీనిలోకి నెమ్మదిగా ఒక మీ.లీ అమైల్ ఆల్కహాల్ను కలపాలి. తరువాత బ్యూటిరోమీటర్ను రబ్బర్ మూతల సహాయముతో బిగించి, లోపల ఉన్న అన్ని పదార్థాలు ( సల్ఫ్యూరిక్ ఆమ్లము, పాలు మరియు అమైల్ ఆల్కహాల్ కలిసిపోయేటట్లు బ్యూటిరోమీటర్ను పైకి, క్రిందికి తిప్పాలి.

Preparing Butter

Preparing Butter

ఈ సమయo నందు బ్యూటిరోమీటర్ వేడి పుట్టును. ఫలితంగా బ్యూటిరోమీటర్ వేడిగా ఉంటుంది. కావున దీనిని జాగ్రత్తగా పట్టుకొవాలి. బ్యూటి రోమీటర్ లోని పదార్థాలను బాగా కలిపిన తరువాత, దీనిని వాటర్ బాత్లో 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, 5 నిమిషముల వరకు ఉంచాలి. తరువాత సెంట్రిఫ్యూజ్ 1000-1200 ఆర్.పి.యం వద్ద, 5 నిమిషాల వరకు సెంట్రిఫ్యూజ్ చెయ్యాలి. తరువాత బ్యూటిరోమీటర్ను తిరిగి, వాటర్ బాత్లో 60 డిగ్రీల ఉష్ణోగ్రత 5 నిమిషాలు ఉంచి, బ్యూటిరోమీటర్ స్కేల్ పై నున్న రీడింగ్ను గుర్తించుట ద్వారా పాల యొక్క వెన్న శాతoను తెలుసుకొనవచ్చు.

పాల యొక్క సాంధ్రతను తెలుసుకొనుట (స్పెసిఫిక్ గ్రావిటీ) లాక్టోమీటర్ పరికరం సహాయముతో పాల యొక్క సాంద్రతను తెలుసుకొనవచ్చు. పరీక్షించవలసిన పాలను 250 మీ.లీ.

Also Read: Milking Methods in Dairy Cattle: పాడి పశువులలో పాలు పిండు పద్ధతులు

సిలిండర్లో నిండుగా పోసి, దానిలోనికి లాక్టోమీటర్ పరికరమును నెమ్మదిగా వదలాలి. ఒక నిమిషం తరువాత పాలలో లాక్టోమీటర్ ఎంత వరకు మునిగినదో చూసి, రీడింగ్ తీసుకొవాలి. సాధారణంగా దీనిని 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చూడాలి. అంత కంటే ఎక్కువ కాని, తక్కువ కాని ఉష్ణోగ్రత ఉన్న యెడల, వచ్చిన లాక్టోమీటర్ రీడింగ్ను ఒక ఫార్ములా ద్వారా సరిచేయ్యాలి. దీనినే కరెక్టడ్ లాక్టోమీటర్ రీడింగ్ అని అంటారు.

పాలలోని ఎస్.ఎన్.ఎఫ్ (సాలిడ్ నాట్ ఫ్యాట్) తెలుసుకొనుట:                    పాల యొక్క విలువను లెక్కించడానికి పాల యందు ఉన్న మొత్తము ఘన పదార్థాలు ( టోటల్ సాలిడ్స్) మరియు సాలిడ్ నాట్ ఫాట్స్ (ఎస్.ఎన్.ఎఫ్) ను లెక్కించుట ఒక పద్ధతి. పాల యొక్క ఎస్.ఎన్.ఎఫ్ను లెక్కించుటకు ముందుగా మనం పాల యొక్క వెన్న శాతంను గర్బర్స్ పద్ధతి ద్వారా మరియు పాల యొక్క సాంద్రతను ( స్పెసిఫిక్ గ్రావిటీ) లాక్టోమీటర్ ద్వారా తెలుసుకొని ఉండాలి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Milk Production: పాల ఉత్పత్తి పై ప్రభావితం చూపే వివిధ అంశాలు.!

Must Watch:

Leave Your Comments

Nursery Cultivation in Pro-tray : ప్రోట్రేలలో నర్సరీ సాగు.!

Previous article

Deficiency Symptoms in Plants: వివిధ పంటలలో సూక్ష్మపోషకాలు ప్రాముఖ్యత, లోప లక్షణాలు, లోప నివారణ.!

Next article

You may also like