Pest Control In Chillies:
నారు కుళ్ళు తెగులు : లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది. దీని నివారణకు మొలకెత్తిన వెంటనే ఒకసారి మరలా వారం రోజులకు ఒకసారి మూడు గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. కిలో విత్తనానికి 3గ్రా చొప్పున కాప్టాన్‌తో గాని మనకు చెపితే గాని విత్తనశుద్ధి చేయాలి కనపడిన వెంటనే ఆపివేయాలి.
కుకుంబర్ మొజాయిక్ వైరస్ : ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది మొక్కలు గిడజబారి ఎదుగుదల లోపించి పొట్టిగా ఉంటాయి. ఆకుల్లో పత్రహరితం కోల్పోయి, ఆకారం మారిపోయి లక్షణాలు కనబడతాయి. పూత కాత ఉండదు.
మొవ్వు కుళ్ళు తెగులు : ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నారుమళ్ళు మరియు సాలు తోటల్లోనూ ఆశించి మొవ్వు లేదా చిగురు భాగం ఎండిపోతుంది. కాండం పై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నెకోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి.
పురుగులు :
తామర పురుగులు : రెక్కల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు ఎకరానికి 300 గ్రాములు ఎసిఫేట్ లేదా 400 మిల్లీ లీటర్లు ఫిప్రోనిల్ లేదా స్పైనోశాడ్ 75 మిల్లీ లీటర్లు ఆకులు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాలి.
తెల్ల నల్లి : తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనపడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి. నివారణకు ఎకరానికి ఒక లీటరు డైకోఫాల్ పిచికారి చేయాలి.
Also Read: Yellow Chilli: పసుపు రంగు మిరప సాగు సస్య రక్షణ
పేను బంక : పేనుబంక లేత కొమ్మలు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. తీయ్యటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు నల్లటి మసిపూసినట్లుగా మారిపోతాయి. నివారణకు ఎకరానికి మిథైల్‌డెమటాన్ 400 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 60 మిల్లీ లీటర్లు పిచికారి చేయాలి.
పూత పురుగులు : పిల్ల పురుగులు, మొగ్గలు, పూత, పిందెలను ఆశించి నష్టపరుస్తాయి. ఈ పురుగు సోకినా పూత ఎండి రాలిపోవడం వల్ల కాయలు ఏర్పడవు. నివారణకు ట్రైజోఫాల్ ఎకరానికి 250 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి.
-ఎ. నిర్మల, కె. నిరోషా, ఉద్యానవిభాగం, ఎస్‌కెఎల్‌టిఎస్‌హెచ్‌యు, పిజెటిఎస్‌ఎయు, రాజేంద్రనగర్, ఫోన్ : 83309 40330
Must Watch: