సేంద్రియ వ్యవసాయం

Neem Decoction Preparation: వేప గింజల కషాయం తయారు చేసే పద్దతి.!

0
Neem Decoction
Neem Decoction

Neem Decoction Preparation: వివిధ  రకాల  వృక్ష  సంబంధ కాషాయాలు  వాడడం ద్వారా పురుగుల బారి నుండి   కాపాడుకోవచ్చు. వీటి వినియోగం  వల్ల పర్యావరణానికి  హాని ఉండదు. మిత్ర పురుగులకు  నష్టం  ఉండదు.వృక్ష  సంబంధ  కాషాయాలు వాడటం వల్ల పురుగుల జీవిత చక్రం లో వివిధ దశలలోనూ  నిర్మూలించవచ్చు.

తయారు చేసే పద్ధతి: నీడలో బాగా ఎండిన 5 కిలోల  వేప  గింజలను  10 లీటర్ల  నీళ్లలో 4 గంటలు  నానబెట్టాలి.ఆ తర్వాత వేప గింజల పప్పును మెత్తగా రుబ్బి ఒక మూటలో కట్టి కనీసం 10-12 గంటలు నానబెట్టాలి.ఈ  విధంగా నానబెట్టిన తర్వాత ఆ  నీటిలో  మూటను ముంచి పట్టుకొని 15-20 నిమిషాల పాటు  పిండుతూ  ద్రావణం  తీయాలి.ఈ  ద్రావణం ఘటైన  వేప వాసనతో   పాల లాగా ఉంటుంది.ఈ  ద్రావణాన్ని పలుచటి గుడ్డలో వడపోసి 100గ్రాముల. సబ్బు పొడి కలపాలి.ఈ విధంగా తయారు అయిన  ద్రావణాన్ని 100  లీటర్లు కలిపి ఒక ఎకరం పొలంలో సాయంత్రం పూట పిచికారీ చేయాలి. పంట దశను బట్టి పురుగుల  ఉధృతిని బట్టి వేప కాషాయం  మోతదు  పెంచుకోవాలి.

Neem Decoction Preparation

Neem Decoction Preparation

నివారించబడే పురుగులు : రసం పీల్చు పురుగులు,ఆకు ముడత  పురుగులు, ఆకు తినే పురుగులు,శనగపచ్చ పురుగు,పొగాకు లద్దె పురుగు.

పని చేసే విధానం –

  • ఈ కాషాయాన్ని గుడ్లు దశలో పిచికారీ చేస్తే  గుడ్లు పోదగబడకుండా  చెడిపోతాయి.
    లార్వా దశలో పిచికారీ చేస్తే పురుగులు ఆహారం తినడం మానివేసి నెమ్మదిగా చనిపోతాయి.
  • అంతే కాకుండా లార్వా దశ నుండి ప్యూపా   అభివృద్ధి చేదకుండా నాశనం చేస్తాయి.
  • కోశస్థ దశ నుండి రెక్కల పురుగు విడుదల కాకుండా చేస్తుంది.

Also Read: Medicinal Uses of Neem: వేపలోని దివ్యమైన ఔషధ గుణాలు!

లాభాలు –

  • పంట పూత దశలో ఈ కాషాయం పిచికారీ చేస్తే తల్లి పురుగులు వేప వాసనకి పంట పై  గుడ్లు పెట్టావు.
  • వేప ద్రావణం చల్లిన ఆకులు చేదుగా ఉండడం వలన లద్దె పురుగులు ఆకులు తినలేవు.
  • ఈ ద్రావణం పురుగు గుడ్డు మీద, లద్దె పురుగు దశ మీద బాగా పనిచేస్తుంది.వేప లో  ఉండేటటువంటి  అజాడరెక్టీన్   అనే మూల పదార్థం పురుగు జీవిత దశల పై ప్రభావం చూపుతుంది.
  • ఈ ద్రావణం మానవుల  ఆరోగ్యానికి, మిత్ర పురుగులకు, పర్యావరణానికి హాని చేయదు.
  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో వాడవచ్చు.వరి పంటలో 1-2 సార్లు, మిరప, ప్రత్తి వంటి పంటలలో పురుగు తీవ్రతను  బట్టి 3-4 సార్లు, వేరుశెనగ ,ప్రొద్దు తిరుగుడు, కూరగాయల పంటలో 1-2 సార్లు వాడుకోవచ్చు.

వివిధ  రకాల పంటలలో పక్షుల  నియంత్రణ : వివిధ రకాలైనటువంటి  పంటల పై  ముఖ్యంగా ప్రొద్దు తిరుగుడు, మొక్క జొన్న,పంటలపై పక్షుల బెడద  ఎక్కువగా  ఉంటుంది.వీటిని నివారించడానికి మెరుపు రిబ్బన్ లు పైరు పైన అడుగు ఎత్తులో  కట్టాలి.సూర్యరశ్మి నేరుగా రిబ్బన్ల పై పడేటట్లు  ఉత్తర దక్షిణ దిశలుగా కట్టాలి.శబ్ధం   చేయడం ద్వారా గాని పక్షులను బెదర  గొట్టవచ్చు. దిష్టి బొమ్మలను  ఉపయోగించి గాని పక్షుల  ఈకలను పొలంలో అక్కడక్కడా కట్టడం  ద్వారా గాని పక్షులను  పారద్రోలవచ్చు.

Also Read:Homeopathy Treatment For Neem Trees: వేపకు హోమియో ట్రీట్మెంట్.!

Also Watch:

Leave Your Comments

Importance of Pulse Crops: పప్పు ధాన్యపు పంటల ప్రాముఖ్యత.!

Previous article

Poultry Diseases During Monsoon: వర్షా కాలములో కోళ్ళలో వచ్చే వ్యాధులు.!

Next article

You may also like