చీడపీడల యాజమాన్యం

Mango Pest Control: మామిడిలో చీడపీడల నివారణ చర్యలు.!

5
Pest of Mango
Pest of Mango

Mango Pest Control-

కాయ పుచ్చు ఈగ మరియు టెంక పురుగు : పురుగు ఆశించిన కాయలకు మార్కెట్లో డిమాండ్ లేక రైతులు బాగా నష్టపోయే ప్రమాదం ఉంది.కొన్ని దేశాలు   పురుగు ఆశించిన కాయలను గుర్తించినట్లతే మొత్తం కాయలను తమ మార్కెట్ లోకి రాకుండా ఉన్నాయి. వీటి నుండి వెలువడిన పిల్ల పురుగులు కాయను తోలుచుకుంటు  టెంకలోకి వెళ్ళి టెంకలోని పప్పును తినడం వలన పడిన కాయలు రాలిపోతాయి.టెంక పురుగు  ఆశించిన కాయలపై  ఎలాంటి లక్షణాలు కనిపించావు. పురుగు సంవత్సరానికి తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది

నివారణ –

  • పురుగు ఆశించి రాలిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి.
  • కాయ పుచ్చు ఈగ మరియు టెంక పురుగు ఆశించిన చెట్ల మొదళ్ల చుట్టూ చెట్టు కింద భూమిని  వేసవిలో లోతుగా కలియదున్నాలి
  • టెంక పురుగు మరియు కాయ పుచ్చు ఈగ నివారణకు విషపు ఎరాలు అమర్చాలి. పాస్ఫామిడన్  2మీ. లి. లీటర్ నీటికి 2-3సార్లు పిచికారీ చేయాలి.
Pest of Mango

Pest of Mango

ఆకు గూడు పురుగు : ఇటీవల కాలంలో లేత మరియు ముదురు తోటల్లో ఆకు గూడు పురుగు బెడద ఎక్కువగా కనిపిస్తుంది. పురుగు ఆకులను, పూల కొమ్మల దగ్గరగా చేర్చి గూడుగా తయారు చేసి  ఆకులోని  పత్రాహారితన్ని గోకి తింటుంది.పూలను కూడా తినడం వలన దిగుబడి తగ్గిపోతుంది. పురుగు సోకడం వలన చెట్టు అంత ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది.

Also Read:Red gram Pests: కందిని ఆశించు తెగులు.!

నివారణ చర్యలు –

  • పురుగు చేసిన  గుళ్లను  వెదురు కర్ర చివర కట్టి  గుళ్లను మరియు పురుగులను నాశనం చేయాలి.
  • చెట్లు లేత చిగురు వేసే సమయంలో తప్పకుండా పురుగు మందులను పిచికారీ చేయాలి.మోనోక్రోటోఫాస్  2. మీ. లి. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి  

తామర పురుగు :లేత గోధుమ పసుపు రంగులో ఉండే సన్నని పురుగు  లేత ఆకు చిగుర్లు, పూలు లేత పిందెలు గోకి రసం పీల్చి తింటాయి.దాని వల్ల ఆకుల అంచులు  వంకరగా ఉంటాయి.పూత రాలిపోతుంది. పురుగు ఆశించిన  కాయలపై సన్నని గీతలు కనిపిస్తాయి. పురుగు నివారణకు డైమీధోన్ 2 మీ. లి లీటర్ నీటికి పిచికారీ చేయాలి.

Mango Pest Control

Mango Pest Control

పిండి పురుగు : పాలలాంటి తెలుపు రంగులో ఉండే మైనంతో కప్పబడి ఉండే గోధుమ రంగు పురుగులు కొమ్మలపై గుంపుల గుంపులుగా ఆశించి మొక్కలను బలహీన పరుస్తాయి . పురుగు  విడుదల చేసిన తినే లాంటి పదార్ధం  ఆకులపై, కొమ్మలపై కనిపిస్తుంది.దీని నివారణకు చెట్టు పోదల్లో గుళికలు వేయాలి.

చెదలు : నీటి వసతి సరిగా లేని తేలిక పాటి ఎర్ర చాల్కనెలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పురుగులు చెట్టు మొదలు నుండి కాండం పైకి అంత వ్యాపిస్తుంది. పురుగు పుట్టలో ఉంటు కాండం మరియు బేరడును తింటుంది.కొమ్మలు కూడా చనిపోతాయి.నివారణకు తోటను శుభ్రం చేసుకోవాలి. లీటర్ నీటికి 2మీ. లి. క్లోరిఫైరిఫాస్  మందును కలిపి చెట్టుకు, కొమ్మకు తడిచేలా పిచికారీ చేయాలి.

Also Read:Mango Ripening: మామిడికాయలు మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడకం అనర్ధo

Must Watch:

Also Watch:

Leave Your Comments

బతుకమ్మ పువ్వు తంగేడులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.!

Previous article

Vegetables Weed Management: కూరగాయల పంటలలో కలుపు యాజమాన్యం.!

Next article

You may also like