- విటీవలన కలుగు నష్టాలు మాములు కలుపుమొక్కల వలన కలిగే వాటికన్నా భిన్నంగా వుంటాయి.
- నీటి కలుపుమొక్కల పంట కాలువలు, మురుగు కాల్వలలో పెరుగుట వలన వాటి పెరుగుదలను బట్టి కాల్వలో నీటి ప్రవాహ పరిమాణం 20 నుండి 95 శాతం వరకు తగ్గుతుంది. పంట కాల్వల నీటి ప్రవాహ పరిమాణం తగ్గుట వలన ఆ కాలువ చివరి భూములకు సరిగ్గా నీరు అందదు.
- నీటి కలుపుమొక్కలు మురుగు కాల్వలు నీటి ప్రవాహానికి అంతరాయం కలిగించుటం వల్ల మురుగు నీరు బయటకు వెళ్ళటానికి వీలు లేక పంటభూములు ముంపునకు గురవ్వడం సర్వ సాధారణం.
- నీటి కలుపుమొక్కలు ఎక్కువగా నున్న నీరు రంగు, వాసనమరి త్రాగుటకు పనికిరాదు. నీటి కలుపు మొక్కలు ఎక్కువగానున్న చెరువులలో అధికంగా ఉండి నీరు ఎక్కువగా నష్టము కలుగనని పరిశోధనలలో తేలినది. ఈ రకంగా కూడా మనము మంచినీటిని పోగొట్టుకుంటున్నాము.
- నీటి కలుపు మొక్కలు మలేరియా, పైలేరియా, వ్యాధులను కల్గించే దోమలకు నివాసస్థలమై అవి అధికంగా వ్యాప్తి చెందటానికి తొడపడుతున్నాయి . చీడ పురుగులకు కూడా ఆశ్రయమిస్తాయి.
- గుర్రపుడెక్కె, అంతర తామర , అడవితుడు, తుటికాడ, పిల్లిఅడుగు ఆకు మొదలగునవి పల్లపు ప్రాంతాలలోని వరి పంటతో పోటీపడి నష్టాన్ని కలుగచేస్తున్నాయి.
- చేపలు చెరువులలో నీటి కలుపు మొక్కలు చేపల పెరుగుదలకు నష్టం కల్గించడమే కాక చేపలను పట్టుటకు అవరోధం కలిగిస్తాయి.
- స్నానపు ఘట్టాల వద్ద నీటిని కలుషితం చేసి నీటిని పనికిరాకుండా చేస్తాయి.
- నీటి కలుపు మొక్కలు నీటి ద్వారా రవాణాకు, ఈత మొదలగు వానికి అవరోధం కలిగిస్తాయి.
- అంతేకాక నీటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు తమ జీవితకాలం తరువాత కుళ్లి కార్బన సేంద్రియ పదార్ధాలు, ప్రవాహాలా ద్వారా వచ్చే మట్టి మొదలగు వానివలన పుడిపోవుటకు తోడ్పడతాయి. ఇన్ని రకాలుగా నష్టాలు కలిగిస్తున్న నీటి కలుపు మొక్కల నిర్మూలనకు ఇప్పటి వరకు తగు శ్రద్ధ వహించలేదు. కనుక ఈ నష్టాలను నివారించేందుకు నిర్మలనా పద్ధతులు చేపట్టాలి.
నీటి కలుపు మొక్కల యాజమాన్యం :-
- నీటి కలుపు మొక్కలు నిర్మూలన మాములు కలుపుమొక్కల నిర్మూలనకన్నా భిన్నమైనది.
- ముందుగా నీటి కలుపు మొక్కలు నిర్మూలించవలసిన ప్రాంతంలోనున్న పలురకాల కలుపు మొక్కలను గుర్తించాలి.
- అలాగే కలుపు నిర్మూలన పద్ధతులు నీటి ఉపయోగాన్నిబట్టి నిర్ణయించాలి.
- పంట, మురుగు నీటి కాల్వలోనైతే నీటి ప్రవాహాన్ని నిరోధించకుండా కలుపు మొక్కలన్నింటిని పూర్తిగా నిర్మూలించాలి.
- చేపలు పట్టే సరస్సులలోను, చెరువులలోను , గుంటలోనూ పూర్తిగా కలుపు నిర్మూలించవలసిన అవసరం లేదు.
- ఎందుచేతననగా కొన్ని రకముల చేపలు నీటిలో మునిగి ఉండే కొన్ని రకాల కలుపు మొక్కలను ఆహారంగా ఉపయోగిస్తాయి.
Must Watch:
Also Wtach:
Leave Your Comments