Tobacco Weed Management: పొగాకు మన రాష్ట్రంలో ముఖ్యమైన వాణిజ్యపంటగా నల్లరేగడి భూములలో వర్షా ధార పంటగా , తేలికపాటి నెలల్లో అరుతడి పంటగా వివిధ ప్రాంతాలలో వివిధ రకాల పొగాకు సాగు చేయబడుచున్నవి. పొగాకును ముందు గా నారు పోసి 50-60 రోజుల వయస్సు గల నారును నాటతారు. కలుపు నారుమడిలో, ప్రధాన మడిలో కూడా కలుపు సమస్య.

Tobacco
పొగాకు పంటలో వరుసల మధ్య మొక్కల మధ్య ఎడం ఎక్కువగా ఉండడం వల్ల పైరు పెరిగి భూమిని కప్పుటకు చాలా సమయం పడుతుంది. ఈ లోపు మొక్కల మధ్య పైరు వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలం లో కలుపు మొలకెత్తి తేమ , పోషక పదార్ధాలు, సూర్య రశ్మి మొదలగు అన్ని వనరులకు పోటీపడి పొగాకు పెరుగుదలను, దిగుబడిని 40-50% తగ్గించుటయే కాక పంట నాణ్యతను కూడా తగ్గిపోతుంది.పొగాకులో కలుపు తీయవలసిన కీలక సమయం నాటిన 60 రోజుల వరకు పెరుగుతుంది.
కలుపు యాజమాన్యం
నారు మడి –
- సాధారణంగా రైతులు నారుమడి పొసే ముందు చెత్త వేసి తగులబెట్టుట ద్వారా కొంతవరకు కలుపు నిర్మూలించవచ్చు.
- నారుమడిని పూర్తిగా నిర్వీరియం చేయుటకు 100 చ. మీ నారుమడికి 5-10 కిలోల మీధైల్ బ్రోమైడ్ పిచికారీ చేయాలి
- సాధారణంగా నారు మడి తక్కువ విస్తీర్ణం వేస్తారు. కనుక కూలిలతో ఒకటి రెండు కలుపు తీస్తే సరిపోతుంది.
- నారుమడి విత్తుటకు 5 రోజుల ముందు ఎకరాకు 800 మీ. లీ. అల్లాక్లోర్ 50% ద్రావకం 200 లీ. నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే పొగాకు మొలకకు ఇబ్బంది లేకుండా కలుపు నిర్మూలించవచ్చు.
- నారు మడిలో వచ్చే గడ్డి జాతి మొక్కల నిర్మూలనకు నారు మడి విత్తిన 25-30 రోజుల తర్వాత ఎకరాకు 250 మీ. లీ. ఇధైల్9% ద్రావకం 200 లీ. నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
Also Read: Water Management in Tobacco: పొగాకు పంట లో సాగునీటి యాజమాన్యం.!
ప్రధాన పొలం : ప్రధాన పొలంలో కలుపు నిర్మూలనకు కేవలం రసాయనాలపై ఆధారపడకుండా వివిధ పద్ధతులు ఆచరిస్తే మంచిది.

Tobacco Weed Management
సేద్య పద్ధతులు –
- నాటుటకు ముందు భూమిని దున్నీ కలుపు లేకుండా చేయుట.
- పొగాకు నాటిన తర్వాత 15-20 రోజుల వ్యవధిలో 3-4 సార్లు గొర్రు, గుంటకాలతో నిలువ మరియు అడ్డంగా అంతర కృషి చేయుట వలన కలుపు నిర్మలునా జరుగుటయేకాక పైరుకు గాలి బాగా తగిలి పైరు బాగా పెరుగును.
రసాయనాలతో కలుపు నిర్మూలన –
పొగాకు లోని రసాయనాలను తప్పనిసరి పరిస్థితులలో వాడాలి. రాసాయనాలు మూడు దశలో వాడవచ్చు.
- పొలం తయారీకి ముందు : పొగాకు వేసే పొలంలో తుంగ, గరిక, వంటి మొండి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక లీటర్ నీటికి 10మీ. లీ. మెట్రిబుజిన్ కలిపి పిచికారీ చేయాలి.
- నాటుటకు ముందు: నాటుటకు 1-2 రోజుల ముందు పొలంలో తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1లీ. పెండిమీథాలీన్ 30% ద్రావకం 200 లీ.. నీటిలో పిచికారీ చేయాలి.
- పొగాకు మల్లె కనపడినప్పుడు: పొలంలో పొగాకు మల్లె కనపడిన వెంటనే పికి తగులబెట్టాలి లేదా 1 లీ. నీటికి 2 మీ. లీ. పేరాక్వాట్ 24% ద్రావకం పొగాకు పై పడకుండా మల్లె పై పడేటట్లు స్ప్రే చేయాలి. పొగాకు పై ఈ మందు పడితే పొగాకు మొక్క కూడా మాడిపోతుంది.
Also Read: Tobacco Cultivation Techniques: ఆరోగ్యవంతమైన పొగాకు నారు పెంపకంలో మెళుకువలు.!