Gram Pod Borer in Bt Cotton: ప్రత్తిని ఆశించే ప్రమాదకరమైన కిటకము శనగ పచ్చ పురుగు. దీనిని అరికట్టుటకు అనేక రకాలైన పురుగు మందుల వాడకం వలన ఈ పురుగులో నిరోధక శక్తి పెరిగి అరికట్టుట కష్ట సాధ్యం అవుతుంది. పురుగు మందుల వాడకం వల్ల కాయ తొలిచే పురుగు అరికట్టడం సాధ్యం కావడం లేదు.కనుక మరో ప్రయత్నమాయ పద్దతే పురుగులను తట్టుకునే వంగడలు.
ఈ వంగడాల రూపకల్పనలో భాగంగా బెసిల్లాస్ తురాన్జెన్సీ అనే బాక్టీరియా నుండి కిటక నిరోధక శక్తి గల జన్యువులను సేకరించి వాటిని ప్రత్తి వంగడాలో చోప్పించడం ద్వారా రూపొందించబడినవే బి. టి ప్రత్తి వంగడలు. బి.టి ప్రత్తి వంగడాలను సాగు చేయడం వల్ల క్రిమిసంహార మందుల వాడకం గమణీయంగా తగ్గును. ఈ బి. టి జన్యువు మన దేశంలో సాగు అవుతున్న వంగడాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం బి. టి రకాలు 90-100 రోజుల వరకు శనగ పచ్చ పురుగు తట్టుకొనే శక్తిని కలిగి ఉంటాయి.
బి. టి ప్రత్తి శనగపచ్చ పురుగు పై ఎలా పనిచేస్తుంది?
భాసిల్లస్ తురింజేసిస్ అనే భూమిలో ఉండే బాక్టీరియా సోకితే శనగ పచ్చ పురుగు నశిస్తుంది. ఈ బాక్టీరియా ఉత్పత్తి చేసే ఒక రకపు విష పూరిత ప్రోటీన్,గొంగాలి పురుగు ప్రవేశించి పని చేయడం వలన గొంగళి పురుగు చనిపోతుంది.
ఈ ప్రోటీన్ ని గుర్తించి దానికి కారణం అయిన జన్యువును ప్రత్తి మొక్క కణంలో ప్రవేశ పెట్టడం ద్వారా ఆ బాక్టీరియా లక్షణాలు మొక్క ప్రతి భాగంలోనూ ప్రవేశించి కాయ తోలుచు పురుగులు తినినా1-2 గంటలలో చురుకుదనం కోల్పోయి మందగించి క్రమేణా 72 గంటలలో చనిపోతుంది. మొక్కల్లో విష పదార్ధం వెలువడడం వాటి పై ఆశించే కాయ తోలుచు పురుగులు నశించడం నిరంతరం జరిగే ప్రక్రియ.
Also Read: Pink Stem Borer in Cotton: ప్రత్తిలో గులాబీ రంగు కాండం తొలుచు పురుగును ఎలా కనిపెట్టాలి?
బి. టి ప్రతి సాగులో పాటించాల్సిన పద్ధతులు:-
బి. టి ప్రత్తి వేసిన పొలం చుట్టూ కనీసం 5 వరుసలు లేదా 20% పొలంలో బి. టి లేని అదే రకం ప్రత్తి విత్తనాన్ని నాటాలి.దీనినే రేఫ్యూజిబెల్ట్ అంటారు.
బి. టీ ప్రత్తి విత్తనాల ప్యాకెట్ లో రేఫ్యూజీ సాళ్ళు నాటుటకు సరిపోయే నాన్ బి. టి విత్తనాల ప్యాకెట్ కలిగి ఉండాలి.
బి. టి టెక్నాలజీ వల్ల లాభాలు:-
బి. టి లో శనగ పచ్చ పురుగును తట్టుకునే శక్తి ఉండడం వలన మొదట తయారు అయినా కాయలు నిలబడి మొదటి తీత లోనే అధిక దిగుబడులు పొందే అవకాశం ఎక్కువగా ఉంది.
బి. టి ప్రత్తి సాగు చేయడం వల్ల పురుగు మందుల ఖర్చు తగ్గించుకోవడం ద్వారా అధిక నికరాదాయాన్ని పొందవచ్చు.
బి. టి ప్రత్తిని సమగ్ర సస్య రక్షణ విధానంలో వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ నాతో పాటు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.
బి. టి ప్రత్తి ని సాగు చేయడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా కొంత వరకు తగ్గించవచ్చు.
బి. టి ప్రత్తి సాగులో అవరోధాలు:-
బి. టి ప్రత్తిలో విష పదార్ధం పొగాకు లద్దె పురుగు ఉధృతిని నిరోధించలేవు.
బి. టి ప్రత్తిలో రసం పీల్చు పురుగులను నిరోధించే శక్తి లేదు.
బి టి ప్రత్తిలో బి. టి ప్రభావం 100-110 రోజులు మాత్రమే ఉంటుంది.
బి టి విష ప్రభావం పూలు, మొగ్గలు,కాయలు అంటే ఆకుల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు కాకుండా మొక్కలోని మిగిలిన భాగాలను ఆశించడం వల్ల నష్టం జరుగుతుంది.
Also Read: Pod Borer Insects Management in Cotton: ప్రత్తిలో కాయ తొలిచే పురుగుల యాజమాన్య పద్ధతులు.!