TS Agri Minister Niranjan Reddy: ఢిల్లీలో క్రాప్ లైఫ్ ఇండియా సంస్థ 42వ వార్షిక సమావేశం సంధర్భంగా ‘వ్యవసాయ మరియు అనుబంధ రంగాలపై’ నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రులు సూర్యప్రతాప్ షాహి, కమల్ పటేల్, బీసీ పాటిల్, సంస్థ వైస్ చైర్మన్ అనిల్ కక్కర్, ఎండీ సంజీవ్ లాల్, దేశంలో, విదేశాల్లోని అనేక సంస్థలలో పరిశోధన, అభివృద్ధి చేస్తున్న ప్రతినిధులు హాజరయ్యారు.
ఢిల్లీ సదస్సులో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయరంగం బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై వ్యవసాయ శాఖా మంత్రి ప్రసంగం ఆకట్టుకున్నది. వివిధ రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు ఆసక్తిగా విని అభినందించారు.
నాణ్యమైన పోషక ఆహారం ప్రపంచం ముందున్న సవాల్. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక. ప్రపంచంలో ఉన్న జీవరాశులలో మేధోపరంగా అతి తెలివైన వాడు మానవుడు. ప్రపంచంలో ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉచ్చస్థితికి చేరుకున్నది. వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం అయినప్పటికి దేశంలోని వివిధ ప్రాంతాల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నందున దానికి అనుగుణంగా కేంద్రం చర్యలు ఉండాలి.
సాగు అనుకూల భూవిస్థీర్ణంలో ప్రపంచంలో భారత్ ది రెండవస్థానం. దేశంలో ఉన్న భూకమతాలు అన్నింటినీ క్రాప్ కాలనీలుగా విభజించాలి. దేశంలోని వివిధ ప్రాంతాలు, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయో గుర్తించి ఆ మేరకు అక్కడ ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. సాంప్రదాయ పంటల నుండి రైతాంగాన్ని మళ్లించడానికి దేశ, విదేశాల్లో అవసరమైనటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి.
Also Read: Minister Niranjan Reddy: యాసంగి వరి సాగులో మార్చిలోపు కోతలు పూర్తికావాలి – వ్యవసాయ మంత్రి

TS Agri Minister Niranjan Reddy
వ్యవసాయ రంగం విషయంలో కేంద్రం ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ఎగుమతులు, సేకరణ కేంద్రం చేతుల్లో ఉన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన పంటల వైవిధ్యీకరణకు కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. అప్పుడే రైతాంగం సాంప్రదాయ సాగును వీడి ఇతర పంటల సాగుకు మొగ్గుచూపుతారు. దేశంలో నూనెగింజలు, పప్పుదినుసుల కొరత ఉన్నది. ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయలు దిగుమతుల వెచ్చించాల్సి వస్తున్నది.
ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ దేశం అయిన భారత్ ఆ దుస్థితి నుండి బయటపడాలి. ప్రపంచానికి అన్నం పెట్టగలిగే భారత్ మన అవసరాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడడం శాస్త్ర, సాంకేతిక రంగాలు ఇంతలా అభివృద్ధి చెందిన యుగంలో సముచితం కాదు. 58 శాతం జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయరంగాన్ని విస్మరించకుండా దానిని ప్రధాన రంగంగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి ఒక క్రమ పద్దతిలో చర్యలు చేపట్టింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణ వ్యవసాయం నేడు ఉజ్వలంగా ఉన్నది .. దేశానికే తలమానికంగా మారింది. ఏడో శతాబ్దంలోనే తెలంగాణలో కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులతో సాగునీటి వ్యవస్థ పటిష్టంగా ఉన్నది. సమైక్యపాలనలో చెరువులు, కుంటలు ధ్వంసమయ్యాయి .. గత ఎనిమిదేళ్లలో రూ.లక్ష 25 వేల కోట్లతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటలు, ఇతర కొత్త సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకున్నాం అని మంత్రి చెప్పారు.
TS Agri Minister: వ్యవసాయం వృత్తి కాదు జీవితం – మంత్రి నిరంజన్ రెడ్డి

State Agriculture Minister Singireddy Niranjan Reddy, Union Minister of State for Agriculture Kailash Chaudhary, UP, Madhya Pradesh, Karnataka Agriculture Ministers Surya Pratap Shahi, Kamal Patel
ప్రస్తుతం సాగునీటి రంగంలోనే కాక మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, తొమ్మిది విడతలలో రూ.58 వేల కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాలలో జమచేయడం, రైతుభీమా పథకం కింద 88,175 మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున అందించి వ్యవసాయ రంగానికి చేయూత నివ్వడం జరిగిందని అన్నారు.
ఈ చర్యల మూలంగా తెలంగాణ పంటల ఉత్పత్తిలో అగ్రభాగంలో నిలిచింది .. తెలంగా పంటల కొనుగోలుకు కేంద్రం చేతులెత్తేసిన పరిస్థితికి చేరుకున్నాం. తెలంగాణ వ్యవసాయ రంగానికి ఇచ్చిన చేయూత మూలంగా మిగతా రాష్ట్రాల మాదిరిగా ఎవరూ వ్యవసాయ రంగాన్ని వీడడం లేదు .. కొత్తగా యువత వ్యవసాయరంగం వైపు మళ్లుతున్నది అని మంత్రి చెప్పారు.
వ్యవసాయరంగాన్ని ఉపాధిగా ఎంచుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. వ్యవసాయరంగం బలోపేతం కోసం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి రైతువేదిక నిర్మించడం, వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి రైతులకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అందజేస్తున్నాం. ప్రతి గ్రామానికి రైతుబంధు సమితులను ఏర్పాటుచేసి రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను నిరంతరం అధ్యయనం చేస్తున్నాం. పంటల వైవిధ్యీకరణలో భాగంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నాం అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
Also Read: Minister Niranjan Reddy: చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!