Mint Leaves Uses: మంచి రుచితో పాటు సువాసన కూడా పుదీనా కలిగి ఉంటుంది.పుదీనా జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పుదీనా ను ఆహారంలోనూ జ్యూస్ లోను మరియు టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.పుదీనా విటమిన్ ఎ, విటమిన్ సి,విటమిన్ బి 6 లతో పాటు మేగ్నిషియాం, క్యాల్షియం , ఐరన్, పొటాషియం, వంటి మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ , క్యాలరీస్ , ప్రోటీన్స్ లాంటి పోషక పదార్ధాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలను చూదాం.. శరీరంలోని ప్రేగులలో ఏర్పడ్డ మాలినలు తొలగించి జీర్ణ క్రియను సాఫిగా జరిగేలా చేస్తుంది. ప్రేగులలో ఏర్పడ్డ సమస్యలను నివారిస్తుంది.జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిని పై పూత గా ఉపయోగించడం వల్ల కాలిన గాయాలు మరియు శరీరంపై ఏర్పడ్డ దురద మరియు చర్మం సమస్యలను తొలగించుకోవచ్చు.
Also Read: Coriander Vs Mint: కొత్తిమీర Vs పుదీనా ప్రయోజనాలు
పుదీనా ఆకులను మెత్తగా నూరి మొఖానికి రాసుకోవడం వలన కాంతి వంతమైన మరియు సహజవంతమైన చర్మాన్ని పొందవచ్చు.అంతే కాకుండా పుదీనా మొటిమలను తగ్గిస్తుంది.రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.కడుపులో ఏర్పడ్డ వికారాన్ని తగ్గిస్తుంది.కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.తాజా పుదీనా ఆకులను నమలడం ద్వారా దంత సమస్యను నివారించుకోవచ్చు.అంతే కాకుండా నోటి దుర్వాసన కు చెక్ పెట్టవచ్చు.పుదీనా పళ్లకు తెల్లదనాన్ని ఇస్తుంది.అంతే కాకుండా పుదీనాను టీ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరాన్ని అలసట మరియు మలబద్ధకం నుండి దూరం చేసి చురుకుగా ఉంచుతుంది.పుదీనా ఆకుల రసం కంటి క్రింద నల్లని మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది.ఇన్ని ప్రయోజనాలు ఉన్న పుదీనా క్రమం తప్పకుండ రోజు తీసుకుందాం . మన ఆరోగ్యాన్ని పెంచుకుందాం.
Also Read: Home Remedies: ఇంటి వైద్యం- వంటింటి ఔషధాలు.!