వార్తలు

మిరప పంటకు ఇక పురుగుమందులు వాడనవసరం లేదు..

0

రైతులు రేయింబవళ్లు పొలాల్లో కష్టపడి పంటను పండిస్తారు, కావున వాళ్లకి అన్నం విలువ తెలుస్తుంది. హోటళ్ళ లోనో, ఫంక్షన్లలోనో వృధాగా పడేస్తున్న ఆహార పదార్థాలను చూస్తే రైతు మనసు చివుక్కుమంటుంది. వేలకు వేలు పెట్టుబడి పెట్టి, క్రిమికీటకాల నుంచి రక్షించుకుని పంటను మార్కెట్లోకి తీసుకొస్తే దానికి వచ్చే కనీస మద్దతు ధరను చూసి రైతు గుండెలు పగులుతాయి. ఆ పంటను అమ్మగా వచ్చిన డబ్బుతో అప్పులన్నీ తీరకపోగా, మళ్లీ పెట్టుబడి కోసం అప్పును చేయాల్సిన పరిస్థితి  ఉంటుంది. అందుకే రైతుల కష్టాలను తీర్చేందుకు కొందరు శాస్త్రవేత్తలు వినూత్న  ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రత్యేకించి మిరపసాగులో రైతులకు మేలు జరిగేలా, పెట్టుబడి వ్యయం తగ్గేలా బెంగుళూరులోని ఐసిఏఆర్ భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఓ కీలక పరిశోధన చేస్తోంది.

ఆర్కా తేజస్వి, ఆర్కా తన్వీ, ఆర్కా శాన్వి, ఆర్కా యశశ్వి, ఆర్కా గగన్ పేరుగల కొత్త రకం మిరప విత్తనాలు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇవి క్రిమికీటకాల నుంచి తమను తాము రక్షించుకునేలా, వాటి దాడిని తట్టుకునేలా ఈ వంగడాలు ఉండేట్టుగా శాస్త్రవేత్తలు సృష్టించబోతున్నారు. దీని వల్ల రైతులు పురుగు మందుల కోసం వాడే వ్యయం భారీగా తగ్గిపోతుంది. అదే సమయంలో పెట్టుబడి ఖర్చులు కూడా 40 నుంచి 50 శాతం మేరకు తగ్గిపోతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కంభం మాధవీ రెడ్డి వెల్లడించారు. కొత్త రకం విత్తనాలను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు.

క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, మందుల వినియోగం లేని ఉత్పత్తులను తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని మాధవి రెడ్డి వెల్లడించారు. భారత్ లో ప్రతీ ఏటా దాదాపు 6000 కోట్ల మిరప వ్యాపారం జరుగుతోందన్నారు. రైతులకు మేలు చేసే ఈ నూతన వంగడాలను అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని నమ్మకం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave Your Comments

క్యాబేజి మరియు కాలీప్లవర్ పంటలలో సస్యక్షణ

Previous article

ప్రపంచ పల్సెస్ దినోత్సవం సందర్భంగా రెడ్ హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు

Next article

You may also like