తెలంగాణ

PJTSAU Diploma 2022 – 23: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిప్లోమా కోర్సులలో మిగిలిన సీట్ల భర్తీకై నోటిఫికేషన్.!

0
PJTSAU Diploma 2022 - 23
PJTSAU Diploma 2022 - 23

PJTSAU Diploma 2022 – 23: వ్యవసాయ విశ్వవిద్యాలయములో వివిధ డిప్లమా కోర్సులలో సీట్ల భర్తీకై మూడు విడతలలో కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయుటకు గాను విశ్వవిద్యాలయము నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందుకుగాను TS-POLYCET-2022 అగ్రి స్ట్రీమ్ మరియు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులతో పాటుగా SSC మరియు తత్సమాన కోర్సులో పాసైన అభ్యర్థులు కూడా Onlineలో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొదటి ప్రాధాన్యత TS-Polycet (Agri)-2022 అభ్యర్థులకు, రెండవ ప్రాధాన్యత TS-Polycet-2022(Engineering) అభ్యర్థులకు ఇవ్వబడుతుంది. SSC పాసైన అభ్యర్ధులకు చివరి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

Also Read: Soil Health Management: రాజేంద్రనగర్ PJTSAU లో భూసార ఆరోగ్య నిర్వహణ సదస్సు.!

PJTSAU Diploma 2022 - 23

PJTSAU Diploma 2022 – 23

ఆన్లైన్లో(Online) దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 28-09- 2022. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరు 01- 10-2022 వ తారీఖున విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించు కౌన్సిలింగ్ కు హాజరు కాగలరు.

కౌన్సిలింగ్ కు వచ్చేటప్పుడు అభ్యర్థులు నిర్ణీత ఫీజు మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను తీసుకురావాలి. ఈ డిప్లొమా కోర్సులకు ఇంతకు పూర్వమే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవవలసిన అవసరం లేదని రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తెలియజేసారు. పూర్తి వివరాల కొరకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in ను సందర్శించగలరని సూచించారు.

Also Read: Maize By-products and Varieties: మొక్క జొన్న ఉప ఉత్పత్తులు మరియు రకాలు.!

Leave Your Comments

Candidiasis in Cows: పశువులలో కాండిడియోసిస్ వ్యాధిని ఎలా నివారించాలి.!

Previous article

Minister Niranjan Reddy: చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!

Next article

You may also like