Intercrops in Mango Orchard – అంతర పంటలు: మామిడి చెట్లు అధికంగా ఆర్ధికంగా దిగుబడి ఇవ్వడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది.కావున ఈ మధ్య కాలంలో తక్కువ పరిమితి గల అంతర పంటలు వేసుకోవచ్చు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనుట అవసరం.పొడవుగా మారి ఎక్కువ శాఖీయ పెరుగుదల గల మొక్కలను వేయరాదు.పెరుగుతున్న పండ్ల చెట్టు కాండం నుండి కనీసం 120 సేం. మీ.వదిలి పెట్టాలి. అంతర పంటలు పోషకాలను తేమ ను ఎక్కువగా తీసుకునేవిగా ఉండకూడదు. లేత తోటల్లో కూరగాయలు తక్కువ ఎత్తు పెరిగే పైర్లు ఫాల్సా , బొప్పాయి లాంటి పండ్లు ను మిశ్రమ పంట గా వేసుకోవచ్చు.
అంటు మొక్కలు ఏదిగె వరకు కాయ కూరలు, పెసలు,అలసందలు, వంటివి అంతర పంటలుగా వేసుకోవాలి.పెద్ద తోటల్లో నీడలో పెరిగే అల్లం పసుపు పైర్లు వేసుకోవచ్చు. నేలను త్వరగా నిస్సరం చేసే మొక్క జొన్న, చేరకులను, పిండి పురుగు ఎక్కువగా ఆశించే కందిని జింక్ మరియు పోటాష్ లోపాలను పెంచే నేపియర్ గడ్డిని అంతర పంటగా వేయకూడదు. ఇలా చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు.
నీటి యాజమాన్యం: చిన్న మొక్కలకు 6 నేలల వరకు 3 రోజులకొకసారి నీరు కట్టాలి.కాపుకు వచ్చిన చెట్లకు పూత పిందె దశలలో నీటి ఎద్దడి రాకుండా నీరు పెట్టాలి.మామిడి తోటలకు కాయ పెరిగే దశలో కనీసం 2 సార్లు అంటే పిందె ఏర్పడిన తర్వాత 25-30 రోజులకొకసారి నేల రోజులకి ఒకసారి మారో సారి నీరు కట్టాలి.కాయలు కొయ్యడానికి 25-30 రోజులు ముందు నీరు పెట్టడం ఆపివేయాలి.మామిడి కోత తర్వాత వెంటనే ఒకసారి నీరు పెట్టాలి.వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడితే వేరు కుళ్లు తెగులు ఉధృతి చెంది తోట అంత దెబ్బ తింటుంది.డ్రిప్ నీటి పారుదల పద్దతి కొత్తగా నాటిన తోటలకు కాపు కాసే తోటలకు అనువైనది.
మామిడిలో అంతర కృషి ఎలా చేయాలి?
వర్షా కాలంలో రెండు సార్లు తోటంత దున్నడం వల్ల కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్ల బారి నీరు ఇంకిపోతాయి.వర్షా కాలంలో తొలకరి వర్షం తర్వాత అట్రాటఫ్ ఎకరాకు 800 గ్రాములు 240 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.తర్వాత వచ్చే గడ్డి తుంగ కలుపు జాతి మొక్కల నివారణకు రౌండ్ ప్ కలుపు మందును పిచికారీ చేయాలి. ఈ మందును వాడేటప్పుడు చిన్న వయసు పండ్ల మొక్కల మీద పడకుండా జాగ్రత్త పడాలి.