చీడపీడల యాజమాన్యంనీటి యాజమాన్యంనేలల పరిరక్షణ

Using Irrigation to Manage Weeds: సేద్య పద్దతులే కలుపు నివారణ మంత్రాలు.!

1
Manage Weeds
Manage Weeds

Using Irrigation to Manage Weeds – నేలను చదును చేయటం:- కలుపును నివారించటంలో మొదటిగా రైతులు దృష్టి పెట్టవలసిన అంశం నేలను చదువు చేయటం. కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి నేలను చదును చేయాలి. పూర్వం చదును చేయటానికి అనువైన పరికరాలు లేక రైతులు మనుషులతోనో లేక ట్రాక్టర్ తో నడిచే లెవెలింగు బ్లేడుతోనో నేలలు ఎగుడుదిగుడు లేకుండా చదును చేసేవారు . ఇది కొంత ఎక్కువ సమయం తీసుకునేది . పైగా ఖర్చు, శ్రమ కూడా ఎక్కువ అవసరం. అంతేకాక అనుకున్న మేరకు నెలచదును అయ్యేది కాదు. అందువలన ఆశించిన ఫలితాలు వచ్చేవి కావు.గత 5-6 సంవత్సరాలుగా ట్రాక్టరుతో నడిచే లేజరు గైడెడ్ లెవెలర్ అనే పరికరం అందుబాటులోకి వచ్చింది.

నేలను చదును చేసుకునేందుకు ఇది రైతులకు ఎంతో బాగా ఉపయోగంగా ఉంది. ఈ పరికరం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీతో కూడా అందుబాటులో ఉంచారు. ఈ పరికరం ఉన్న సాంకేతిక సౌకర్యాల దృష్ట్య్ పొలంలో ఉన్న ఎగుడుదిగుడు చాలా చక్కగా చదును అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ లేజర్ గైడెడ్ లెవెలర్ పనిచేయటానికి అధిక అశ్వశక్తి ట్రాక్టరు అవసరం.

Also Read: Weed Management Methods: కలుపు మొక్కల యాజమాన్యం మరియు నివారణా పద్ధతులు.!

Using Irrigation to Manage Weeds

Using Irrigation to Manage Weeds

పెద్ద ట్రాక్టర్లను రైతులకు చేరువ చేసేందుకు ప్రభుత్వ పధకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ప్రతి 2500 ఎకరాలకు 2-3 లేజర్ గైడెడ్ లెవెలర్స్, వాటిని వినియోగించుకోవటానికి అనువైన అధిక శక్తి గల ట్రాక్టర్లు సమకూర్చుకుని వేసవిలో నేలలు చదును చేసే కార్యక్రమం రైతులు చేపట్టవచ్చు. దీనివల్ల నేలలు చదును చేసుకున్నప్పుడు కలుపు తగ్గటంలో పాటు పైర్లు విత్తటానికి, నీటి పారుదలకు కూడా ఎంతో అనువుగా నేలలు తయారవుతాయి.

పశువుల ఎరువు ద్వారా వచ్చే కలుపును నిరోధించటం:-
పంటల పోషక యాజమాన్యంలో ఎకరానికి 4-6టన్నుల వరకు పశువుల ఎరువు వేయటం ద్వారా 25% వరకు రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు. కాని పశువుల ఎరువులతో కలుపు విత్తనాలు పొలంలో వచ్చే అవకాశం ఉంది. పశువుల ఎరువు ద్వారా వచ్చే కలుపు విత్తనాల వలన పైర్లకు నష్టం జరగకుండా ఉండాలంటే, పశువుల ఎరువు వర్షాలకు 2-3 వరాల ముందే పొలంలో చల్లి నేలలో కలియదున్నాలి. తొలకరి వర్షాలు మొదలైన తరువాత పంట విత్తకముందే నేలలు 2-3 సార్లు దున్నినప్పుడు ఎరువులతో పాటుగా వచ్చిన కలుపును నిర్మూలించాలి.

పచ్చి రొట్ట పైర్ల సాగు: పంటలసాగు చేపట్టడానికి మందుగాని, పంట సాగు చేసిన తరువాత కాని కొంత సమయం 40-60 రోజులు ఉన్నపుడు జనుము, జిలుగ, పిల్లి పెసర, అలసంద వంటి పచ్చి రొట్ట పైర్ల సాగు చేయడం వలన పొలంలో కలుపు పెరిగే అవకాశం లేకుండా చేయవచ్చు.

Also Read: Weed Management Practices: కలుపు మొక్కల యాజమాన్య పద్ధతులు.!

Leave Your Comments

Black Water Uses: బ్లాక్ వాటర్ యొక్క ప్రయోజనాలు.!

Previous article

Intercrops in Mango Orchard: మామిడి తోటలో అంతర పంటలు మరియు నీటి యాజమాన్యం.!

Next article

You may also like