Orchard Management: మనం వేయాలి అనుకున్న ఫలజాతికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. ఆ ప్రాతంలో వర్ష పాతపు తీరు, గాలి ఉదృతం వేడి గాలులు బెడద మొదలైన విషయాలను పరిశీలించాలి. ఆ ప్రాంతం ఇతర రైతులు అదే ఫలజాతి తోటలను వేసినట్లు అయితే వారి అనుభవాలను సేకరించాలి.
భూసార పరీక్షలు జరిపించి, వేయబోయే ఫలజాతులకు నేలలు అనుకూలమా కదా అని నిర్ధారించాలి. నేల లోతు కనీసం 2 మీటర్లు ఉండాలి.దిగువ నీటి మట్టం ఉంటేనే ఆ నేల పండ్ల సాగుకు అనుకూలం. వీలైనత దగ్గర్లో పెద్ద పండ్ల మార్కెట్ ఉన్నట్లు అయితే రవాణా ఖర్చులు తగ్గడమే కాక రవాణాలో కాయలు దెబ్బ తినకుండా పండ్లు త్వరగా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మంచి రవాణా రోడ్ల సదుపాయాలు, శితాలికరణ సదుపాయాలు, తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు.
పండ్ల తోటకు దగ్గర్లో కరెంట్ సప్లై ఉంటే మంచిది. ఇతరులు వేసిన పండ్ల తోటలు దగ్గరగా ఉంటే అనేక సదుపాయాలు తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు.
కావాల్సిన అంతమంది కూలీలు ఉండాలి. అంటు మొక్కలు , ఎరువులు, క్రిమి సంహారక మందులు అందు బాటులో ఉండాలి. చివరిగా తోట భూమి తక్కువ ఖరీదు లో లభించాలి.
తోటను వేయనప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు: తోట వేయడానికి భూమిని సర్వే చేసి ఎత్తు పల్లాలు, చదును అవసరాలు రోడ్లు, నీటి మరుగు కాలువలు వివరాలను సూచిస్తూ నమూనా పటాన్ని తయారు చేసుకోవాలి.
నేలకు అనువైన ఫలజాతులను ఎంపిక చేయాలి.
నీటి వనరులు గుర్తించి, తగిన విధంగా నీటి కాలువల్లో ప్లాన్ లు గుర్తించాలి.నీటి వనరులు లేకపోతే వాటిని తోటలో ఒక ఎతైన ప్రదేశం గుర్తించి ఏర్పాటు చేసుకొని సులువుగా అన్ని మూలలకు పారెలా ఏర్పాటు చేయాలి.
తోట చుట్టూ ఒకటి లేదా రెండు వరుసలలో ఎతైన చెట్లను గాలి నిరోధకాలను పెంచాలి . వీటి వలన వేసవిలో వేడి గాలులు నుండి శీతకాలంలో చాలి గాలుల నుండి తోటకు రక్షణ వస్తుంది. గాలి నిరోధక వృక్షాలకు మొదటి పండ్ల చెట్టు వరుసకు మధ్య రోడ్లు వేయడానికి ఉపయోగించుట వలన కొంత స్థలం కలిసి వస్తుంది.
రోడ్లు కలిబాటలు నేరుగా తక్కువ స్థలాన్ని ఆక్రమించెల ఉండాలి.నేల వలుగా మరుగు నీళ్లను తీసి వేయాలి.
ఒకే సమయంలో కోతకు వచ్చే ఫలజాతులను ఒకే చోట పాతుకోవడం వలన సంరక్షణ ఇతర యాజమాన్య పద్ధతులు సులభంగా చేపట్టడానికి వీలు అవుతుంది.
సరైన ఎండలో చెట్లను నాటాలి. ఒక చెట్టు మీద ఇంకో చెట్టు నీడ పడకూడదు.
తోట నాటే పద్దతిని నిర్ణయించుకొని కావాల్సిన మొక్కల సంఖ్యను గుర్తించి వాటిని ముందు గానే మంచి నర్సరీ లో సేకరించాలి.
Also Read: Damage Orchards: చలి తీవ్రతకు ద్రాక్షతో పాటు అరటి రైతులకు తీవ్ర నష్టం