Disease Management in Brinjal – ఫోమాప్సిస్ కొమ్మ మరియు కాయ కుళ్లు తెగులు: ఈ తెగులు ఫోమాప్సిన్ వెక్సాన్ అనే శీలింద్రం వలన కలుగుతుంది. లేత మొలక దశ నుండి కాయలు కోతకు వచ్చే వరకు వంగ పైరు ఈ తెగులుకు గురి అవుతూనే ఉంటుంది. మొక్కలు నాటిన తరువాత నేలకు తగిలే ఆకులపైన గుండ్రని బూడిద వర్ణము నుండి గోధుమ రంగు గల మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్య భాగం పైన గల తెల్లని ప్రదేశంలో నల్లని శీలింద్రబీజలు ఉంటాయి.
తెగులు సోకిన ఆకులు పసుపు వర్ణానికి మరీ చనిపోతాయి. కొన్ని సార్లు కాండము పై తెగులు సోకుట వలన పుండ్లు ఏర్పడును. కాండము పై మచ్చలు ముదురు గోధుమ వర్ణం లో ఉండి తరువాత బూడిద వర్ణానికి మారును. ఎక్కువగా కాండం కుళ్ళి గాలికి విరిగిపోవుట వలన మొక్కలు పడిపోతాయి. తెగులు సోకిన కాయలు కుళ్ళి పోతాయి. ఈ తెగులు విత్తనం ద్వారాను మరియు మొక్కల తెగులు వ్యాపిస్తుంది.
నివారణ: తెగులు సోకిన పొలాల్లో ఆరోగ్యవంతమయినా కాయలు నుండి తీసిన విత్తనములను 50 సేం. గ్రే. వేడి నీటిలో 30 నిముషాలు నానబెట్టి తరువాత విత్తాలి. నారు మళ్ళులోను, మొలకలు నాటిన పొలాలలోను ఈ తెగుళ్ళు ఉన్నట్లయితే బీనేబ్, లేక మాంకోజెబ్ 9.25% డైఫోలటాస్ మందును7-10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసి ఈ తెగులును అరికట్టవచ్చు.
Also Read: Raising of Healthy Seedlings in Brinjal: వంకాయ నాటే సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
వెర్రి తెగులు: ఈ తెగులు మైకోప్లాస్మా వలన కలుగుతుంది. తెగులు సోకిన మొక్కలు ఆకుల పరిమాణం చిన్నగా ఉండును.తెగులు సోకిన తరువాత ఏర్పడే ఆకులు చాలా చిన్నగా ఉంటాయి. కనుపుల మధ్య దూరం తగ్గి మొక్కలు గిడసబారి పోయి గుబురుగా కనిపించును. తెగులు సోకిన మొక్కలు పూత పూయవు. ఒక వేల పూత ఏర్పడిన ఆకు పచ్చగా ఉండి కాయలు ఏర్పడవు. తెగులును కలుగజేసే మైకోప్లాస్మా దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కొన్ని కలుపు మొక్కలపై కూడా మైకోప్లాస్మా జీవించి ఉంటుంది.
నివారణ: తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పొలం నుండి తీసి వేసి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తిచేయు దీపపు పురుగుల నివారణ గాను మిధైల్ పెరాధియాన్ మందును 2 మీ. లీ. ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Also Read: Wild Brinjal Pests: అడవి వంకాయ తెగుళ్ల యాజమాన్యం