Red gram Pod Borer – తల్లి పురుగు: ఈ పురుగు వివిధ పంటలపై ఆశించి అపారమైన నష్టాన్ని కలుగుజేస్తుంది. అందువలన దీనిని “పాలిఫ్యాగస్” పెస్ట్ అని అంటారు. తల్లి పురుగు ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉండి ‘వి’ ఆకారపు నల్లమచ్చ ఉంటుంది. వెనక జత రెక్కలు పాలిపోయిన తెలుపు రంగులో ఉండి చివర అంచులు నల్లగా ఉంటాయి.గొంగళి పురుగు వివిధ రంగుల్లో ఉన్నప్పటికి శరీరంలో ఉన్న ప్రతి ఖండితము పైన ఉపరితల భాగాన రెండు వెంట్రుకలు ఉంటాయి మరియు పార్శ్వ భాగాలలో అలల రూపంలో ఉండే రెండు దట్టమైన చారలను గమనించవచ్చు.
లక్షణాలు: గ్రుడ్డు నుండి బయటకు వచ్చిన గొంగళి పురుగులు మొదట ఆకుల పత్రహరితాన్ని లేక పువ్వు మొగ్గల రేకులను గోకి తింటాయి.తరువాత పెరిగిన పురుగు ఆకులను, మొగ్గలను, పూలను మరియు కాయలను తొలచి నష్టపరుస్తుంది. కానీ ఇది ఫలదీకరణం చెందిన తరువాత ఏర్పడిన కాయలను విపరీతంగా ఇష్టపడుతుంది.ముఖ్యంగా గొంగళి పురుగు కాయలను తొలచి గ్రుండటి రంధ్రాన్ని చేసి దానిలో సగభాగం శరీరం లోపలికి చొప్పించి మిగిలిన వెనుక భాగం బయటికి పెట్టి కాయలోని గింజలను మొత్తం తిని డొల్ల చేస్తుంది. ఇది ఈ పురుగు యొక్క ప్రత్యేకత.
Also Read: Redgram Varieties: కంది రకాలు – వాటి లక్షణాలు.!
నివారణ చర్యలు: ఈ పురుగు నివారణ కొరకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను చేపట్టాలి.వేసవిలో దుక్కులు చేయాలి. దీనివలన భూమిలో దాగివున్న కోశస్థ దశ పురుగులు బయటపడి సూర్యరశ్మికి మరియు పక్షుల భారిన పడి నశిస్తాయి.ఎర పంటగా బంతిని అక్కడక్కడ విత్తాలి.లింగాకర్షణ బుట్టలను ఒక ఎకరానికి 4 ఏర్పాటు చేసి తల్లి పురుగు ఉనికిని గమనించాలి.తల్లి పురుగును మరియు గ్రుడ్డు దశను గమనించిన వెంటనే గ్రుడ్డు పరాన్న జీవి అయిన ట్రైకోగ్రమా పరాన్న జీవిని ఎకరానికి 20,000 125,000 సముదాయాలను 2-3 సార్లు వదలాలి.పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
కంది కాయ తొలిచే ఆకుపచ్చ పురుగు:
తల్లి పురుగు: రెక్కల పురుగులు బూడిద వర్ణంలో లేదా బూడిద గోధుమ రంగులో ఉండి ముందు రెక్కల పైన అంచున తెల్లని మెరుస్తున్న చార ఉండును.గొంగళి పురుగు మొదట్లో ఆకుపచ్చగా ఉండి క్రమేపి గులాబి / ఎరుపు రంగుకి మారుతుంది. వీటి ప్రాగ్వాక్షం పైన 5 నల్లటి మచ్చలు ఉంటాయి.
లక్షణాలు: గొంగళి పురుగు తొలిదశలో పూ మొగ్గలపై ఆశించి, తరువాత కాయలపై రంధ్రo చేసి లోపలి తొలుచుకొని ప్రవేశించి విత్తనాన్ని మొత్తం తింటాయి.ఇవి తయారైన విత్తనాలను ఎక్కువగా తింటాయి.కాయలను వలిచి చూసినట్లయితే ఇవి విసర్జించిన మలినము మరియు గొంగళి పురుగును గమనించవచ్చును.సాధారణంగా ఈ పురుగు పంటపై కాయదశలో ఆశింస్తుంది.
Also Read: Pests in Redgram Cultivation: కంది పంటను ఆశించు పురుగులు.!