Sheep Farming: ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జాతిని, తెలంగాణ రాష్ట్రంలో దక్కన్ జాతి గొర్రెలను పెంచుతున్నారు. నెల్లూరు జాతి మాంసానికి ప్రసిద్ధి. ఇది మనదేశంలోని జాతులన్నింటి కంటే పొడవైనది. దీనిలో జొడిపి, పల్లా, బ్రౌన్ రకాలున్నాయి. దక్కన్ జాతి గొర్రెలు నల్లగా, పొట్టిగా ఉండి ఉన్ని, మాంసాన్నిస్తాయి. గొర్రెలను పగలంతా ఖాళీ భూముల్లో తిప్పి మేపడం కంటే పాక్షిక సాంద్రపద్ధతిన పోషించడం మేలు.కొంతసేపు సమీపంలోని పచ్చికబయళ్లలో మేపి, ఎక్కువకాలం గాలి ప్రసరించే కొట్టాల్లో ఉంచి మేపాలి. ఎత్తయిన ప్రదేశాల్లో కొట్టం నిర్మించాలి. గొర్రెల ఫారం ప్రారంభించే వారు 35-50 ఆడ గొర్రెలు, రెండు మేలైన విత్తన పొట్టేళ్లతో మొదలెట్టడం మంచిది. దగ్గర్లో పచ్చికబయళ్లు, పశుగ్రాసాల లభ్యత , ఆరోగ్య సంరక్షణకు పశు వైద్య సదుపాయాలు, మార్కెట్ సౌకర్యాలు అందుబాట్లో ఉండేలా చూసుకోవాలి.
పంటల సాగుతో పాటు గొర్రెల పెంపకం లాభదాయకం:-
ప్రత్యుత్పత్తి:- గొర్రెలు 8-12 మాసాల వయస్సులో ఎదకొస్తాయి.
Also Read: Tinospora Cordifolia: తిప్పతీగలోని ఔషధ గుణాలు.!
గొర్రెపిల్లల పెంపకం:- పుట్టిన తర్వాత 8-16 వారాల వరకు తల్లిపాలు తాగనివ్వాలి. మొదటి 3 నెలల్లో రోజుకు 150 గ్రా. బరువు పెరగాలి. పిల్లలకు నట్టల నివారణ మందులివ్వాలి. పిల్లల షెడ్లో ఖని జలవణ మిశ్రమం అందించే ఇటుకలను వేలాడగట్టాలి. ఎదిగే పిల్లలకు రోజుకు 20 గ్రా.,3 వారాల వయస్సు వచ్చాక 50 గ్రా. చొప్పున దాణా ఇవ్వాలి. ఎదిగిన గొర్రెలకు 200-300 గ్రా. దాకా దాణా రోజుకు ఇవ్వాలి. మూడు నెలలు దాటిన, దాణా, గడ్డి తింటూ తల్లిపాలను మరచిన పిల్లలను మాత్రమే కొనాలి. గొర్రెపిల్లల వయస్సు పెరిగేకొద్ది పెరుగుదల తక్కువుంటుంది. కావున ముదురు పిల్లలను కొనరాదు.
గ్రాసాలు:- జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జ వంటి ధాన్యపు జాతి ఏకవార్షిక గ్రాసాలు, నేపియర్, గినీ, పారా, సూడాన్ వంటి బహువార్షిక గడ్డి రకాలు, లూసర్ , బర్సిం, అలసంద, పిల్లిపెసర, జనుము సుబాబుల్, స్టయిలో, వేపాకు వంటి లెగ్యూం జాతి గ్రాసాలను మేపవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. వేరుశెనగ పొట్టు, ఉలవపొట్టు వంటి ఎండుమేతల పైన బెల్లపుమడ్డి, యూరియా పిచికారీ చేసి మేపవచ్చు.
గొర్రెల పాకాల:- వర్షాకాలం , ఇతర వాతావరణ పరిస్థితులను అధికమించడానికి స్థానికంగా దొరికే ముడి సరుకుతో తూర్పు – పడమర దిశలో కొట్టాలను ఎతైన ప్రదేశంలో నిర్మించాలి. ప్రతి జీవానికి షెడ్డులోపల 9 అడుగులు, షెడ్డు బయట 18 అడుగుల స్థలాన్ని వదలాలి.