Soil Health Management: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ భూసార పరీక్ష, ప్రామాణిక విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రాజేంద్రనగర్ లోని భూసార ఆరోగ్య నిర్వహణ సంస్థ లో సదస్సు జరిగింది. దీనిలో PJTSAU పరిధిలోని వివిధ కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా స్థానాల భూసార శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. భూసార పరీక్షా కేంద్రాల్లో నాణ్యమైన ఫలితాల్ని సాధించటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన ప్రమాణాల గురించి దీనిలో శాస్త్రవేత్తలకి అవగాహన కల్పించారు.
కేంద్ర ప్రభుత్వ “హెల్తీ ఎర్త్ – గ్రీన్ ఫార్మ్” కార్యక్రమం ద్వారా ఈ సదస్సును నిర్వహించారు. జాతీయ భూసార పరీక్ష, ప్రామాణిక విభాగం అధ్యక్షురాలు అనితారాణి, సిరి బాబు, PJTSAU పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ లు శాస్త్రవేత్తలకి అనేక సూచనలు చేశారు. రైతులు అధిక పంట దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు చేసుకొని విత్తనాలు వేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ప్రతి ఏడాది రైతులు తమకున్న భూమిలో మట్టి పరీక్షలు చేసుకొని పంటలు వేసుకోవాలని, ఏపంట సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందో రైతులకు సూచిస్తున్నారు. పంటలకు సరైన మోతాదులో ఎరువులు వేసేందుకు భూసార ఫలితాలు మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. పంటలు సాగు చేసేందుకు రైతులు సేంద్రీయ ఎరువులు వేయాలని అవగాహన కల్పిస్తున్నారు. రైతులకి నాణ్యమైన భూసార పరీక్ష ఫలితాల్ని అందివ్వడానికి అనుసరించవలసిన పద్ధతుల గురించి వీరు వివరించారు.
Also Read: PJTSAU: పిజెటిఎస్ ఎయూలో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చర్ కార్యక్రమం.!