Pig Farming: సంకర జాతి పందులను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచితే అధిక లాభాలను పొందవచ్చు. పందుల్లో తిన్న పదార్ధాలను మాంసంగా మార్చే శక్తి ఎక్కువ. త్వరగా ఎదుగుతాయి. తినే ప్రతి 3 కి. దాణాకి ఒక కిలో బరువు పెరుగుతాయి.
అనువైన జాతులు:
దేశవాళీగాకుండా విదేశీ లేదా సంకర జాతి పందులను పెంచడం లాభం. లార్జ్ వైట్ యార్క్ షైర్ ( తెలుపు రంగు ) హంప్ షైర్ ( శరీరం నలుపు , మందు జబ్బ, కాళ్లపై తెలుపు ) ల్యాండ్ రేస్ (తెలుపు జాతులు ) పెంచడానికి అనువైనది.
పెంపకం:
పందులను పెంచే ముందు వాటి మాంసానికున్న డిమాండ్ అధ్యయనం చేయాలి. ప్రతి పెద్ద పందికి 12 చ. ఆ పిల్ల పందికి 4 చ. అ స్థలం అవసరం. చుడి పందులకు ప్రత్యేకమైన గది ఉండాలి. పోతు పందులను విడిగా ఉంచాలి. షెడ్లో దాణా, నీటి తోట్లు నిర్మించాలి. మార్కెట్లో ఏరిసిన కూరగాయలు, పండ్ల వ్యర్ధాలు, హోటల్లు, వసతి గృహల్లో మిగిలి పోయే ఆహార పదార్ధాలను పందుల పోషణ లో సమర్ధంగా వినియోగించవచ్చు.
దాణా మిశ్రమం:
పందుల పెంపకంలో 70-75 శాతం మేత ఖర్చే ఉంటుంది. దాణాను సొతంగా తయారు చేసి వాడుకుంటే ఖర్చు తగ్గుతుంది.55 పాళ్ళు మొక్క జొన్న,20 పాళ్ళు వేరుశెనగ చెక్క,15 పాళ్ళు గోధుమ, వరి పొట్టు,8.5 పాళ్ళు చేపల పొడి, ఒక పాలు ఖనిజ లవణ మిశ్రమం చేసుకోవాలి. వంద కిలోల దాణాకు 30 గ్రా. యాంటీబయోటిక్ మిశ్రమం కలపాలి. శరీర బరువును బట్టి రోజుకు 1-3 కి. దాణా మేపాలి.
పాలిచ్చే పందులకు అధిక పోషణ అవసరం. సరైన పోషణ ఉంటే 8-9 నేలల్లో (70 కిలోల బరువు ) పెరిగి ఎదకోస్తాయి. పంది 21 రోజులకొకసారి ఎదకోస్తుంది. గర్భధారణ కాలం 114 రోజులు. ప్రతి ఈతలో 8- 10 పిల్లలు పెడతాయి. సాలుకు రెండు ఈతలు తీసుకోవచ్చు.పిల్లలలో ఇనుము ధాతు లోపం వల్ల వచ్చే పాండు రోగం నివారణకు పుట్టిన 4 వ,14 వ రోజున ఇన్ ఫెరాన్ ఇంజక్షన్ ఇవ్వాలి. దాణాలో 2-3 పాళ్ళు లవణ మిశ్రమం కలిపి ఇవ్వాలి. వైరస్ వల్ల వచ్చే పంది జ్వరం రాకుండా చిన్న వయసులో ఏడాది తర్వాత టీకాలు వేయించాలి. గజ్జి నివారణకు సల్ఫార్ శరీరం అంత పూయాలి.
Also Read: Swine Fever in Pigs: పందులలో జ్వరం ఎలా వస్తుంది.!