Tick Fever in Sheep: బెబీసియా ప్రజాతికి చెందిన వివిధ రకాల జాతులకు చెందిన ఏకకణ పరాన్న జీవులు అయినటువంటి బెబీసియా బోవిస్, బెబీసియా బైజెమినా, బెబీసియా ఒవిస్, బెబీసియా ఈక్వి, బెబీసియా కానిస్, బెబీసియా మటాసి, బెబీ సియా గిబ్సోని అనే పరాన్న జీవుల వలన ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు మరియు కుక్కలలో కలుగు అతి ప్రాణాంతకమైన అంటువ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా జ్వరం, రక్త హీనత, హిమోగ్లో బినిమియా, హిమోగ్లోబిన్యూరియా వంటి లక్షణాలు ఉండి, చికిత్స చేయనట్లైతే పశువులు చనిపోవుట జరుగుతుంటుంది.
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు మరియు కుక్కలలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విదేశీ మరియు సంకరజాతి పాడి పశువులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. వర్షాకాలంలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. అన్ని వయస్సుల పాడి పశువులలో ఈ వ్యాధిని గమనించవచ్చు.ఈ వ్యాధి రక్తాన్ని పీల్చే భూఫిలస్, రీఫిసెఫాలస్, ఇక్సోడస్ మొదలగు పిడుదుల ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పాడి పశువులకు వ్యాపిస్తుంటుంది.
Also Read: Milk Production: పాల ఉత్పత్తి పై ప్రభావితం చూపే వివిధ అంశాలు.!
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- రక్తాన్ని పీల్చే పిడుదులు వ్యాధి బారిన పడినటువంటి పశువులను కుట్టి తిరిగి ఆరోగ్యంగా ఉన్న పశువులను కుట్టినపుడు, ఈ ఏక కణ పరాన్న జీవులు రక్తంలోని ఎర్ర రక్తకణంలోనికి పోయి అభివృద్ధి చెంది, ఎర్ర రక్తకణాలను అధిక సంఖ్యలో విచ్చిన్నం చేస్తుంది.
ఫలితంగా ఎర్రరక్తకణాలు నుండి అధిక శాతంలో హిమోగ్లోబిన్ విడుదల అవుతుంది. ఈ హిమోగ్లోబిన్ కాలేయంలో కాంజుగేషన్ చెంది, అక్కడ నుండి మూత్రపిండములకు చేరి, తద్వారా హిమోగ్లోబిన్యూరియాగా, యురిన్ ద్వారా బయటకు విడుదల అవుతుంది. కాని కాలేయం అధిక సంఖ్యలో విడుదలవుతున్న హిమోగ్లోబిన్ను కాంజుగేషన్ చెయ్యలే క పోవుట వలన, రక్తంలో ఈ పిగ్మెంట్ పేరుకుపోయి జాండిస్ లక్షణాలు కలుగుతాయి. ఎక్కువ శాతంలో ఎర్రరక్తకణాలు విచ్చిన్నం అవడం వలన పశువులలో రక్తహీనత (ఎనిమిమా) ఏర్పడి, ఎనిమిక్ ఏనాక్సియా స్థితి కలిగి పశువులు చనిపోవటం జరుగుతుంది. ఎక్కువ శాతంలో హిమోగ్లోబిన్ పిగ్మెంట్ రక్తంలో విడుదల అగుట వలన హిమోగ్లోబినిమియా లక్షణాలు కూడా గమనించవచ్చు.
వ్యాధి లక్షణాలు: వ్యాధి మొదటి దశలో తీవ్రమైన జ్వరం ఉండి (104°F), తరువాత సాధారణం కంటే కూడా తగ్గిపోతుంది. రక్తంతో కూడిన ఎర్రని లేదా కాఫీ రంగు మూత్రం పోస్తు ఉంటాయి. ఆకలిలేకపోవుట, నెమరు వేయకపోటం, కంటిపొర పాలిపోయి లేదా పసుపుపచ్చగా మారి, రక్తహీనత లేదా కామెర్లు కలిగి ఉండుట ఈ వ్యాధి ప్రత్యేకత. పైప్ స్టెమ్ డయోరియా ఉంటుంది. నాడీ మరియు శ్వాసక్రియ ఇబ్బందులుండి పశువులు కృషించి, నీరసించి చనిపోతుంటాయి. కండరాల వణుకు, మెడ ఒక ప్రక్కకు వాల్చడం, ఊపిరి ఆగి ఆగి తీసుకోవడం వంటి లక్షణములు కూడా పాడి పశువులలో గమనించవచ్చు. చివరి దశలో పశువులు ఒక ప్రక్కకు వాలిపోయి చనిపోతుంటాయి. హిమటాలజి – ఎర్ర రక్తకణాలు, హిమోగ్లోబిన్, ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ తగ్గిపోయి ఉంటుంది. న్యూట్రోఫిలియ మరియు లింఫొపినియ ఉంటుంది. యురిన్ లో అల్బుమిన్ మరియు బైల్ పిగ్మెంట్ శాతం పెరిగి ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ మరియు సిరమ్ బైలురుబిన్ శాతం పెరిగి ఉంటుంది.
Also Read: Ovine Encephalitis in Sheep: గొర్రెలలో ఒవైన్ ఎన్సెఫలైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!