Aspergillosis in Animals: ఇది అస్పార్ జిల్లోసిస్ ప్రజాతికి చెందిన కొన్ని వందల కొలది వ్యాధి పూరిత ఫంగస్ జాతుల వలన శ్యాసకోశ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలతో కలుగు ఒక దీర్గకాలిక వ్యాధి. ఈ వ్యాధి పశువుల్లో కన్నా కోళ్ళలో ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. కోళ్ళలో ఈ వ్యాధినే బ్రూడర్స్ న్యూమోనియా అంటారు.తేమతో వున్న ఆహార పదార్థాలలో ఈ శిలీంధ్రం వృద్ధి చెంది సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యాధి కారకం శరీరం బయట ఉన్నపుడే ఆహార పదార్థాలలో విషపదార్థాలను విడుదలచేస్తుంది. కోళ్ళలో ఈ వ్యాధి తేమతో ఉన్న డీప్ లిట్టర్ ద్వారా వ్యాపిస్తుంటుంది.
వ్యాధి వ్యాప్తి:- కలుషితమైన ఆహారం నోటి ద్వారా తీసుకోవడం లేదా గాలిని పీల్చుట ద్వారా ఈ వ్యాధి కారక శీలింధ్రం శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలో ఇది రక్తం ద్వారా గ్రావిడ్ యుటెరస్, మెదడు, కాలేయం, గుండె భాగాలకు చేరుతుంది. ఇది పొట్ట, ప్రేగులలో ఉన్నప్పుడు జీర్ణాశయ ఇబ్బందులను కలిగిస్తుంటుంది. గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులలో చేరి న్యూమోనియాను కలిగిస్తుంది.
లక్షణాలు:- అధిక జ్వరం ఉండి, క్రమంగా తగ్గిపోవును. శ్వాస పీల్చుట కష్టంగా ఉంటుంది. చూడి పశువులు ఈసుకుపోతుంటాయి. చెడువాసనతో కూడిన రక్తపు విరోచనాలు ఉంటాయి. పాడి పశువుల్లో పాలదిగుబడి తగ్గిపోతుంది. కోళ్ళలో ఊపిరి సరిగ్గా తీసుకోలేక పోవడం, రేల్స్, స్నిజింగ్ వంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి.ఊపిరితిత్తులలో న్యూమోనియాతో కూడిన చిన్న చిన్న గడ్డలను చూడవచ్చు. ఇతర అవయవములలో ఫైబ్రినస్ ఇన్ఫ్లమేషన్ చూడవచ్చు.
Also Read: Animal Husbandry Techniques: జీవాల పెంపకంలో మెళకువలు
నిర్ధారణ:- పైన వివరించిన వ్యాధి లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా లేదా వ్యాధి కారక భాగాన్ని తీసుకొని స్లైడు పై స్మియర్ చేసి, ఉడ్ లాంప్ స్టెయిన్ చేసి శీలిం ధ్రములను గమనించవచ్చు.
ఈ వ్యాధికి పశువులలో పరిపూర్ణమైన చికిత్స చెయ్యలేము. ఆంటి ఫంగల్ ఆంటిబయోటిక్ ఔషదములను (ఆంఫోటేరిసిన్, క్లాట్రిమిజోల్, మికనజోల్, ఫ్లూకనజోల్) ఇవ్వవచ్చు. వీటితో పాటు ఆంటిఇన్ ఫ్లమేటరీ, లివర్ ఇంజక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది.ఈ వ్యాధి లక్షణాలను గమనించినట్లైతే పశువులు తీసుకుంటున్న ఆహారాన్ని వెంటనే నిలిపివేసి, ఆ మేతను విశ్లేషించి వ్యాధికారకాన్ని గుర్తించినట్లైతే అట్టి మేతను కాల్చివేయాలి మరియు ఆ మేతను తిన్న పశువులకు ప్రథమ చికిత్స చెయ్యాలి. కొట్టంలో మరియు మేతలో తేమ లేకుండా పొడిగా ఉండేలా చూడాలి. కాలేయం బాగా పని చేసేటటువంటి మందులను అందించాలి.
Also Read: Infectious Canine Hepatitis in Dogs: పెంపుడు కుక్కలలో కెన్లైన్ హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!