Seed Treatment in Vegetable Nursery – విత్తన శుద్ధి: విత్తనాల ద్వారా సంక్రమించే రోగాలు, పురుగులు,నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, నారు కుళ్ళు తెగులు, ఆకు మచ్చ తెగులు, వైరస్ తెగుళ్ళకు విత్తన శుద్ధి చేయడం వలన మొదటి దశలోనే చాలా వరకు నివారించబాడతాయి . విత్తన శుద్ధి క్రమాన్ని గమనించినట్లు అయితే క్యాబేజి,కాలిఫ్లవర్ కూరగాయలను ఆశించే నల్ల కుళ్ళు తెగులు, వంగను ఆశించే ఫోమాప్సీస్ ఎండు తెగులు నివారణకు విత్తనాన్ని 50డి. సేం.ఉష్ణోగ్రత నీటిలో 30 నిముషాలు విత్తనాలను ముంచి అరబెట్టాలి.
మిరప లో వైరస్ తెగుళ్ల నివారణకు ట్రైసోడియం ఆర్థోఫాస్ఫాట్ 150 గ్రా.ఒక లీటర్ నీటికి కరిగించి ద్రావణంలో గింజలను 30 నిముషాలు నాన బెట్టి మరల మంచి నీటితో కడిగి నీడలో అరబెట్టాలి.ఆ తర్వాత రసం పీల్చు పురుగుల నివారణకు ఇమీడాక్లోప్రిడ్ 8 గ్రా. కిలో విత్తనానికి జిగురుగా పట్టించాలి.చివరిగా శీలింద్రాల ద్వారా వచ్చే తెగుళ్ల నివారణకు కెప్టెన్ లేదా థైరామ్ 3 గ్రా. విత్తనానికి పట్టించాలి.బెండ, టమాటో,చిక్కుడు, ఫ్రెంచ్ చిక్కుడు,గోరు చిక్కుడు, సొర కాయ,బీర,పొట్ల లాంటి పంటలకు ఇమీడాక్లోప్రిడ్ 5 గ్రా.ఒక కిలో విత్తనానికి పట్టించి. ఆ తర్వాత థైరామ్ లేదా కెప్టెన్ 3 గ్రా కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి.
Also Read: Bengal Gram: శెనగ
కెప్టన్ లేదా థైరామ్ తో విత్తన శుద్ధికి ముందుగా: ట్రైకోడెర్మా విరిడే 4-5 గ్రా.ఒక కిలో విత్తనానికి పట్టించి విత్తుకుంటే నేల ద్వారా వచ్చే వడలు, ఎండు తెగులు చాలా వరకు నివారించబడతాయి.
సూర్య రశ్మి తో శుద్ధి:
నర్సరీ బెడ్‌లను సూర్య రశ్మి తో శుద్ధి చేయడం వల్ల మట్టిలో ఉన్న శీలింద్రాలు నాశనం చేయవచ్చు.దీనికి గాను నేలను సూర్య రశ్మి తో వేడి చేస్తే దీనిపై పాలిథిన్ షీట్ కప్పి శీలింద్రాలు నాశనం చేయవచ్చు.ఈ విధంగా చేయడం వలన కలుపు మరియు పురుగులు తగ్గుతాయి.
సోలరైజేషన్ చేసే విధానం: సేంద్రియ ఎరువు కలిపిన నర్సరీని బెడ్ తయారు చేయాలి. నర్సరీ బెడ్ ను బాగా నీటితో తడిపి అటు తర్వాత దానిపై 209 గేజ్ పాలిథిన్ షీట్ లలో గట్టిగ కప్పలి. ఈ విధంగా 30-40 రోజులు ఉండాలి.అప్పుడు నేల ఉష్ణోగ్రత వేసవిలో 52 సేం. గ్రే.కు చేరుకుంటుంది. పాలిథిన్ షీట్ చెరగకుండా జాగ్రత్త వహించాలి.
Also Read: Grain Storage: ధాన్యము బస్తాలను నిల్వ ఉంచు గోదాములు (గిడ్డంగులు)