Bengal Gram – విస్తరణ:- పాకిస్తాన్, టర్కీ, మెక్సికో, బర్మా, ఇండియా, ఇండియా లో బీహార్, హర్యానా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తం గా 65% విస్తీర్ణం మరియు 70% ఉత్పత్తి భారత దేశం లో ఉన్నది. భారత దేశం లో ఉత్పాదకత లో మధ్య ప్రదేశ్ మొదటి స్థానం లోనూ, రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో శెనగ రబీ పంట గా నల్ల రేగడి భూముల్లో సాగు చేయబడుతుంది. రాష్ట్రం లో శెనగ విస్తీర్ణం సుమారు 11లక్షల ఎకరాలు. ఉత్పత్తి 3.98 లక్షల టన్నులు కాగా దిగుబడి ఎకరానికి 362 కిలోలు
వాతావరణం:-
శెనగ పంట చల్లని వాతావరణాన్ని కోరుకుంటుంది.
ఇది తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు అనువైనది.
లోతైనా వేరు వ్యవస్థ ఉండటం వలన ఈ పంట లోపలి పొరల నుండి తేమను గ్రహించ గలదు. ఈ పంట నీటి నిల్వ ను ఏ దశ లోనూ తట్టుకోలేదు. కాని తేలిక పాటి తడులు పూత మరియు గింజలు నిండే సమయంలో ఇవ్వడం మంచిది.
ఈ పంటకు అనుకూలమైన సరాసరి ఉష్ట్రనోగ్రత్త 24-30°c
నేలలు:- సారవంతమైన నల్ల రేగడి నేలలు శెనగ పంట కు అనుకూలం. నల్ల రేగడి నేలలో నిల్వ ఉండే తేమ ఉపయోగించ కుండా శీతాకాలం లోని మంచును ఉపయోగించుకుంటూ మొక్కలు పెరుగుతాయి. చౌడు భూములు పనికిరావు.
Also Read: Pearl Millet: సజ్జ
నేల తయారీ:- తొలకరి లో వేసినప్పుడు పైరు కోసిన తరువాత భూమిని నాగలి తో ఒక సారి గొర్రు తో రెండు సార్లు మొత్తగా దున్ని చదును చేయాలి.
విత్తే సమయం:-
అక్టోబర్ – నవంబర్ తరువాత విత్తిన దిగుబడులు తగ్గుతాయి.
విత్తన మోతాదు:-
ఎకరాకు 20-26 కిలోలు. ఆలస్యం గా వేసినప్పుడు విత్తిన మోతాదు 20% పెంచాలి.
విత్తన శుద్ధి:- ఎండు తెగులు ఉన్నచో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మా వాడితే మంచి ఫలితం ఉంటుంది. రైజోబియం కల్చరు ను విత్తనానికి పట్టించి విత్తితే రైజోబియం లేని భూముల్లో 20-30% అధిక దిగుబడి ని పొందవచ్చు. శీతల విత్తనానికి రైజోబియం 250 గ్రాములు వాడాలి.
విత్తడం:-
నాగలి వెంబడి గాని, గొర్రుతో గాని విత్తు కోవచ్చు.
విత్తన దూరం:- 30×10 cm
ఎరువులు:- చివరి దుక్కి లో ఎకరాకు రెండు టన్నులు పశువుల ఎరువు వేసి బాగా కలియ దున్నాలి. నత్రజని 8 కిలోలు, భాస్వరం 20 కిలోలు, మరియు గంధకం 16 కిలోలు వేయాలి.
నీటి యాజమాన్యం:- శెనగ వర్షాధార పంట, తేలిక పాటి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడి ని పొందవచ్చు. నీటి తడులు ఇచ్చినపుడు నీరు నిలువ కుండా చూడాలి. పూత దశ కు ముందు ఒక సారి, కాయ దశ లో మరొక సారి నీటి తడి ఇవ్వాలి.
కలుపు నివారణ:- విత్తే ముందు ఫ్ల్యూక్లురాలీస్ 45% ఎకరాకు లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలియ దున్నాలి. విత్తిన తరువాత పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 -1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20-25రోజులకు గొర్రు తో అంతర కృషి చేయాలి.
నిప్పింగ్:- 30-40రోజుల దశలో ప్రతీ కొమ్మలోని కోణాలను త్రుంచి నట్లయితే మరిన్ని కొమ్మలు వచ్చి మంచి చెట్టు తయారవుతుంది. ఎక్కువ పూత వచ్చి దిగుబడి పెరుగుతుంది.
పంట కోత:- కోతకు వచ్చిన మొక్కలను పీకి వారం రోజుల వరకు కుప్ప కట్టి వుంచి ఎండిన తరువాత కట్టెల సహాయం తో మార్చుకోవాలి. వేరు చేసిన గింజలను శుభ్రపరిచి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.
Also Read: Finger Millet Importance: రాగి ప్రాముఖ్యత