Milk Importance: ఆవులలో, గేదెలలో, ఈనడానికి ముందు 15 రోజులు, ఈనిన తర్వాత 5 రోజుల మినహా, తరువాత కాలంలో క్షీర గ్రంథులు నుండి వచ్చే స్వచ్ఛమైన, శుభ్రమైన స్రావాన్ని పాలు అని అంటారు. PFA (Prevetion of food adultrants) పద్ధతి ప్రకారం ఆవు పాలలో కనీసం 3 శాతం క్రొవ్వు పదార్థాలు మరియు 8.5 శాతం ఎస్.ఎస్.ఎఫ్, గేదె పాలలో కనీసం 6 శాతం క్రొవ్వు మరియు 9 శాతం ఎస్.ఎన్.ఎఫ్ ఉండాలి.
పాలలో నీరు 87 శాతం ఉండి, ఘన పదార్థాలు 13 శాతం వరకు ఉంటాయి. ఈ ఘన పదార్థాలలో 5 శాతం క్రొవ్వు పదార్థాలు కాగా, మిగిలినవి క్రొవ్వుకాని ఘన పదార్థాలు (సుమారు 8 శాతం) ఉంటాయి. ఈ క్రొవ్వు కాని ఘన పదార్థాలలో (ఎస్.ఎన్.ఎప్) పాల షుగర్ (లాక్టోజ్), ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, పిగ్మెంట్స్ మరియు విటమిన్లు ఉంటాయి.
పాలలో ఉండు పోషక పదార్థాలు:- పాలలో ప్రొటీన్లు, క్రొవ్వు, పాల షుగర్ (లాక్టోజ్), ఖనిజ లవణాలు మరియు విటమిన్లు ఉంటాయి. ఈ పోషక పదార్థాలన్ని ఉండటం వలన పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తుంటారు. ఈ కారణం చేతనే అన్ని వయస్సులో ఉండు వారందరు పాలను వారి ఆహారం తీసుకుంటూ ఉంటారు. 100 గ్రాముల గేదె పాల నుండి 100 క్యాలరీల శక్తి మరియు 100 గ్రాముల ఆవు పాల నుండి 70-75 క్యాలరీల శక్తి లభిస్తుంది.
పాల ప్రొటీన్లు:- పాల ప్రోటీన్ పాలలో వివిధ రూపాలలో ఉంటుంది. అది లాక్టో ఆల్బుమిన్ మరియు లాక్టోగ్లాబ్యులిన్ రూపంలో సుమారు 90-95 శాతం వరకు ఉంటుంది.
Also Read: Quality Milk: పాల యొక్క నాణ్యత ఏ ధర్మాల పై ఆధారపడుతుంది.!
పాలలో ఉండు పాల షుగర్ (లాక్టోజ్):- బాక్టోజ్ అనేది పాలలో ఉండు ముఖ్యమైన కార్బోహైడ్రేట్. దీని మూలంగానే పాలకు కొద్దిగా తీయ్యదనం కలుగుతుంది.
పాలలో ఉండు క్రొవ్వు పదార్థాలు:- పాలలో క్రొవ్వు అసిటేట్, బీటా హైడ్రాక్సీ బ్యుటరేట్ మరియు ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్లుగా ఉంటుంది. పాలలో ఎక్కువ శాతం లిపిడ్లు అనునవి ట్రైగ్లిజరైడ్స్ రూపంలో ఉంటాయి.
పాలలో ఉండు ఖనిజ లవణాలు:- పాలలో క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కోబాల్ట్, జింక్ మాంగనీస్, క్లోరైడ్స్ మరియు సిట్రేట్స్ వంటివి కూడా ఉంటాయి.
పాలలో ఉండు విటమిన్లు:- పాలలో థయామిన్, రైబోఫ్లావిన్, నికోటినిక్ ఆసిడ్, కోలిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ ఆసిడ్, పాంటథోనిక్ ఆసిడ్, అస్కార్బిక్ ఆసిడ్, సయాను కోబాలమిన్ మొదలగు విటమిన్లు ఉంటాయి.
పాలలో నీటి శాతం:- పాలలో నీరు సుమారు 87 శాతం వరకు ఉంటుంది. పాలు ఎముకల మరియు దంతాల పెరుగుదల కొరకే కాక అనేక ఇతర వ్యాధులనుండి కూడా మనుషులను రక్షిస్తుంది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.
పాలలో ఉండే కొన్ని రకాల పోషకాలు అంటి కాన్సర్గాను, గుండీ రోగాలు రాకుండా, ఒబేసిటి (స్కిమిడ్ పాలు మాత్రమే) నియంత్రించేదిగ, రక్తపోటును నియంత్రిందేవి, టైప్ 2 రకము డయాబేటిస్ ను తగ్గించేది మరియు డిహైడ్రేషన్ నియంత్రించేది గాను ఉంటుంది. షుష్రుత తన సంవితలో చాలా రకాల వ్యాధులకు పాలను ఒక దివ్య ఔషధంగా సూచించుట జరిగిoది. అవి దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, డిస్నియా, పితియాసిస్, అసైటిస్, ఎపిలెప్టిక్ పిట్స్, పెర్టిగో, మతిమరుపు, బర్నింగ్ సెన్సేషన్, గుండే మరియు బ్లాడర్ వ్యాధులకు, డిసెంట్రీ, ఫైల్స్, మలబద్దకం, నోటినుండి రక్తం కారుట, విరిగిన ఎముకలు అతుక్కొనుట కొరకు, పునరుత్పత్తి సామర్ద్యం పెరుగుదల కొరకు, తక్షణ శక్తి కొరకు మరియు జీవితకాలం పెరుగుట కొరకు పాలను సూచించడమైoది. అందుకే రోజుకు ఒక గ్లాస్ పాలు (200 మీ.లి), 150 గ్రా యోగర్ట్ మరియు 30 గ్రాముల చీజ్ ఆరోగ్యానికి ఏంతో మేలు చేసి, డాక్టర్ యొక్క అవసరoను తగ్గి స్తుంది.
Also Read: Quality Milk Production: నాణ్యమైన పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!