వార్తలు

కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం మరో స్కీమ్… పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన

0

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పథకంలో చేరిన రైతులకు నేరుగా డబ్బులు బ్యాంక్ అకౌంట్ల లో పడిపోతాయి. పీఎం సమ్మాన్ నిధి ద్వారా మోదీ సర్కారు అన్నదాతలకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. అలాగే ఇప్పుడు రైతుల కోసం పథకం కూడా అందుబాటులో ఉంది.గతంలోనే అన్నదాతల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువ మంది రైతులు మాత్రమే ఇందులో చేరారు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పెన్షన్ స్కీమ్. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది చిన్న, ఉపాంత అన్నదాతల సామాజిక భద్రత కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకం.

18 నుండి 40 సంవత్సరాల వయస్సులోపు 2 హెక్టార్ల వరకు సాగు చేయగల భూములను కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతులు ఈ పథకం కింద ప్రయోజం పొందటానికి అర్హులు. ఈ పథకం 60 ఏళ్ళు నిండిన తరువాత రైతులకు నెలకు 3000/- రూపాయల కనీస భరోసా పెన్షన్ లభిస్తుంది. రైతు మరణిస్తే రైతు జీవిత భాగస్వామికి 50శాతం పెన్షన్ ను కుటుంబ పెన్షన్ గా పొందటానికి అర్హత ఉంటుంది.

18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల చందాదారులు 60 ఏళ్ళు వచ్చే వరకు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు 60 ఏళ్ళు నిండిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి నెల సంబంధిత వ్యక్తి యొక్క పెన్షన్ ఖాతాలో రూ.3 వేలు జమ అవుతాయి. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా/పీఎం-కిసాన్ ఖాతా, పొలం పాస్ బుక్, రెండు ఫోటోలు ఉంటే సరిపోతుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్ లో ఉన్నవారు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉచితంగానే ఈ పథకంలో చేరొచ్చు. అంతేకాకుండా పీఎం కిసాన్ డబ్బుల నుంచే నేరుగా పీఎం కిసాన్ మాన్ ధన్ కంట్రిబ్యూషన్ చెల్లించొచ్చు. దీని వల్ల రైతులపై ఎలాంటి అదనపు భారం ఉండదు.

Leave Your Comments

గ్రామీణ మార్కెట్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Previous article

టమాట పంట సాగులో తెగుళ్ళు వాటి నివారణ చర్యలు..

Next article

You may also like