Jammu Grass Cultivation: జమ్ము గడ్డి శాస్త్రీయ నామం టైఫా ఎంగస్టెట ఇది రాష్టం లో కృష్ట- గోదావరి పరివాహక ప్రదేశాలలో వ్యాపించి ఉన్న బహు వార్షిక సమస్యాత్మక నీటి కలుపు మొక్క. ఇది చెరువులు, నీటి కుంటలు, సరస్సులు, పంట మరియు మురుగు కాల్వలలో చాలా ఉదృతంగా 2 నుండి 4 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. బలిష్టమైన మొక్క. అడుగు భాగాన దుంపలుంటాయి. ఆకులు సన్నగాను మధ్య ఈనె లేకుండా పైన మైనపు పూత ఉండి, పీచు పదార్ధంతో ఉంటుంది. ఇది విత్తనాల ద్వారా, దుంపల ద్వారా ప్రత్యుత్పత్తి చెందుతుంది.
కాండం చివర ఉండే ఒకొక్క కంకిలో సుమారు 20 వేల విత్తనాలుంటాయి. ఇవి గాలి ద్వారా వ్యాపించి ఇతర ప్రదేశాలలో స్థావరమేర్పరుచుకుంటాయి. విత్తనాలు సుమారు 5 సంవత్సరాల వరకు మొలకెత్త గలిగే శక్తి కలిగి ఉంటాయి. ఒకొక్క దుంప దాని చుట్టు పక్కల మూడు మీటర్ల వైశాల్యం వరకు అల్లుకొని 100 కంటే ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేస్తూ ఒక ఎకరం విస్తీర్ణంలో సంవత్సరానికి దాదాపు 200 టన్నుల వరకు గడ్డిని ఉత్పత్తి చేస్తుంది.
జమ్ము గడ్డి మంచినీటిలోనే కాకుండా ఉప్పు నీటిలో కూడా బ్రతుకుతుంది. ఈ మొక్క కాలువలో ఉన్నప్పుడు నీటి ప్రవాహ వేగాన్ని అడ్డగించి నీటిలో ఉన్న మట్టిని అడుగుకు చేరుస్తుంది. దీనివలన కాలువలు త్వరగా పూడి పోతాయి. మాములు నీటి ఉపరీతలం పై జరుగు నీటి ఆవిరి నష్టం కంటే 3.1 రేట్టు నీటిని వీటి ఆకులు నష్ట పరుస్తాయి. వేసవి కాలంలో ఎక్కువ నీటిని గ్రహించి ఆవిరి రూపంలో బయటకు పంపిస్తాయి. ఇన్ని రకాలుగా నష్టం కలిగిస్తున్న ఈ సమస్యాత్మక నీటి కలుపు మొక్కను రసాయనాలు ఉపయోగించడం ద్వారా కొంత వరకు దీని వ్యాప్తిని నిర్ములించవచ్చు. ఒకసారి పొలంలో కాని, చెరువులలో కాని వస్తే దీనిని నిర్మూలించుట చాలా కష్టం . సమస్యాత్మకమైన కలుపు మొక్క అయినప్పటికి దీని వలన కొన్ని ఉపయోగాలు ఉన్నాయి.
Also Read: Barseem grass Cultivation: బర్సీమ్ గడ్డి సాగు.!
ఉపయోగాలు:-
జమ్ముగడ్డి ఇప్పటికి అనేక ప్రాంతాలలో ఇళ్ళు కప్పుకోవడానికి ఉపయోగిస్తారు.
ఆకులను చాపలు నేయడానికి, తమలపాకుల ఆకులు కట్టడానికి వాడతారు.
ఆకుల నుండి ప్యాకింగ్ కు ఉపయోగపడే పేపరు తయారు చేయవచ్చును.
దీని నుండి నార తీయ వచ్చును.
వేళ్ళ దుంపలను కరువు రోజులలో పిండిగా చేసి ఆహారంగా వాడేవారు. ఈ పిండిలో వరి, మొక్కజొన్నలో ఉన్న మాంస కృత్తులు, బంగళ దుంపలో కన్నా ఎక్కువ పిండి పదార్ధాలు ఉన్నాయి. దుంపల నుండి ఆల్కహాల్ కూడా తయారు చేయవచ్చు.
నిర్మూలన
సేద్య పద్ధతులు:- మొక్క చాలా బలిష్టంగా ఉండుటచే మనుష్యులతో నిర్మూలించడం కష్టం.
నీటిలో ఉన్నప్పుడు నీటి ఉపరితలానికి సుమారు అరమిటరు లోతుగా కోసి వేస్తే కొంత వరకు నశిస్తుంది.
పంట భూములలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ట్రాక్టర్ తో దున్ని వ్రేళ్ళను ఏరి పారేయాలి.
కాలువలలో నీరు లేనప్పుడు ప్రోక్లేయనర్ తో లోతు చేసి చాలా వరకు నిర్ములించవచ్చు.
జమ్ము గడ్డి ఉన్నచోట పారాగడ్డిని నాటితే 3,4 నెలలో జమ్ముని చాలా వరకు అణగ త్రొక్కుతుంది. పశువులకు చక్కని మేత లభించును.
Also Read: Lemongrass Cultivation: నిమ్మగడ్డి సాగులో మెళుకువలు.!