Chili Varieties: జి -3
1962 లో విడుదల అయింది.
మొక్కలు గుబురుగా లేత ఆకు పచ్చ రంగులో ఉంటాయి.
కాయలు 5-6 సేం. మీ. పొడవు కలిగి, చివర మోనాదేలి కొంచెం వంకర తిరిగి ఉంటాయి.
వర్షాధారపంటగా అన్ని జిల్లాలో సాగుకు అనుకూలం.వర్షాధారంగా 15-18 క్వింటాలు దిగుబడి ఇస్తుంది.
జి -4
1968 లో విడుదల అయింది.
మొక్కలు ఎత్తుగా పెరిగి, ఆకులు కోలాగా ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటాయి.
కాయలు సన్నగా పొడవుగా 7-8సేం. మీ.చివర మొనదేలి ఉంటాయి.
కాయలో విత్తన శాతం 33.
వైరస్ ను తట్టుకుంటుంది.
పచ్చి మరియు ఎండి మిర్చికి నీటి వసతి సాగును అన్ని జిల్లాలకు సిఫార్సు చేయబడినది.ఈ రకాన్ని భాగ్యలక్ష్మి పేరిట జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం విడుదల చేసింది.
45-50 క్విం టాల దిగుబడి ఇస్తుంది.
జి -5
1972 లో విడుదల చేసింది.
జి -2 మరియు బి -71 రకాలను సంకరపరచి రూపొందించారు.
మొక్కలు ఎత్తుగా, వెడల్పుగా, ఆకులతో ఉండును.
కాయలు, లావుగా పొట్టిగా 3-3.5 సేం. మీ. పొడవు ఉండును.కాయలలో విత్తన శాతం 45%.
నీటి వసతి సాగుకు నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం, జిల్లాలకు అనుకూలం.
ఆంధ్రజ్యోతి పేరిట జాతీయ వంగడం గా విడుదల చేయబడినది.
Also Read: Mirchi Price: మిర్చి ఒక క్వింటాల్ రూ.16350- ఆసియాలోనే రెండో అతి పెద్ద మార్కెట్ ఖమ్మంలో
సింధుర్
1997 లో విడుదల చేశారు.
L. I. C – 44 నుండి రూపొందించిన రకం.
మొక్క గుబురుగా, ఎత్తుగా పెరుగుతాయి.
కాయలు లావుగా, పొడవుగా 7-8 సేం. మీ.కాయ చివర మద్దుభారీ ఉంటాయి.
వేసవి సాగుకు అనుకూలం.
నీటి వసతి గల అన్ని జిల్లాలకు అనుకూలం.
దిగుబడి 50-55 క్వి / హె.
అపర్ణ
1982 లో విడుదల అయింది.
గొల్ల ప్రోలు అనే దేశియా రకం నుండి రూపొందిచబడినది.
మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి.
కాయ పొడవుగా సింధుర్ రకాన్ని పోలి ఉంటుంది.
కాయలు పండిన తర్వాత పసుపు వర్ణం లో ఉంటాయి.
నీటి వసతి కింద తూర్పు గోదావరి, శ్రీకాకుళం,జిల్లాలకు సిఫార్సు చేయబడినది.
దిగుబడి 35-40 క్వి /హె.
యల్. సి.ఎ -235
1985 లో విడుదల చేసారు.
జి -4 మరియు ఎల్లో యాందర్ మ్యూటెంట్ అను రకాలను సంకర పరచి రూపొందించారు.
మొక్కలు గుబురుగా, పొట్టిగా ముదురు ఆకు పచ్చ రంగులో ఉంటాయి.
కాయలు 5-6 సేం. మీ పొడవు కలిగి గాటు ఎక్కువగా ఉంటాయి.
వైరస్ తెగులును తట్టుకుంటుంది.
వర్ష ధారపు లేదా నీటి పంటగా అన్ని జిల్లాకు సాగు అనుకూలం.
దిగుబడి 50-60 క్వి / హె.
యల్. సి. ఎ -206
1991 లో విడుదల అయింది.
జి – 3 మరియు హాటంక అను రకాలను సంకరపరచి రూపొందించబడినవి.
మొక్కలు ఎత్తుగా మరియు లేత ఆకు పచ్చ రంగులో ఉంటాయి.
కాయలు 6-7 సేం మీ. పొడవు కలిగి సన్నగా ఉంటాయి. కాయ నాణ్యత ఎక్కువగా నిల్వ ఉంచిన నల్ల బడును.
వైరస్ ను తట్టుకోలేదు.
వర్ష ధార మరియు నీటి వసతి గల అన్ని ప్రాంతాలకు అనుకూలం.
Also Read: High Yield Chilli Varieties: మిరపలో అధిక దిగుబడికి అనువైన రకాలు మరియు వాటి లక్షణాలు.!