Sorghum Insect Pests: పురుగు గుర్తింపు లక్షణాలు – తల్లి పురుగు ఊదారంగు కలిగి చిన్న ఈగలాగ ఉంటుంది. ఉదర ఖండితాలపై ఆడ పురుగుకు 6 మచ్చలు, మగ పురుగుకు 4 మచ్చలు ఉంటాయి.లద్దె పురుగు లేత పసుపుతో కూడిన తెలుపు రంగులో ఉండి కాళ్ళు లేకుండా తల భాగం వద్ద మొనతేలి ఉంటుంది. వీటిని “మాగట్స్” అని అంటారు.
లక్షణాలు: గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన గొంగళి పురుగులు ఆకు పై భాగం నుండి క్రిందికి పాకి మొవ్వు భాగానికి చొచ్చుకొని పోతాయి.ఈ పురుగు మొవ్వుని గోకి తినడం వల్ల మొవ్వును పీకగానే సులువుగా వస్తుంది. మొవ్వు మొదలు క్రుళ్ళు ఉండడం వల్ల ఇది పీకిన వెంటనే చెడు వాసన వస్తుంది.ఈ పురుగు ఆశించిన ప్రధాన మొక్క మొవ్వు చనిపోవడం వల్ల దాని మొదలు దగ్గర ప్రక్క పిలకలు అధికంగా వస్తాయి. ఈ పిలకలకి కంకులు రావు.ఈ పురుగు విత్తనము మొలకెత్తినప్పటి నుండి ఒక నెల రోజుల వరకు మాత్రమే పంటపై ఆశిస్తుంది. పెరిగిన పంటపై ఆశించదు.
నివారణ చర్యలు: ఆలస్యంగా విత్తిన పైరుపై అనగా ఆగస్టు-సెప్టెంబర్ మాసంలో విత్తిన పంటపై ఎక్కువగా ఆశిస్తుంది. కనుక వర్షాలు పడిన వెంటనే భూమి పదును చూసి జులై 15వ తేదిలోపల విత్తినట్లయితే పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఆలస్యంగా విత్తనం వేయవలసి వస్తే విత్తన మోతాదు 10 కేజీలకు పెంచి విత్తుకోవాలి.ఈ మొవ్వు ఈగ ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కార్బోప్యూరాన్ 3జీ గుళికలను ఒక మీటరు సాలుకి 2 గ్రాముల గుళికలను విత్తే సమయంలో సాళ్ళలో వేయాలి.లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రాములు లేక అసిఫేట్ 1.5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల తేడాతో 2-3 సార్లు మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి.సాధారణంగా ఈ పురుగు పంట విత్తిన 4-5 వారాల వరకు మాత్రమే ఆశిస్తుంది.
Also Read: Sorghum Cultivation: జొన్నలో సస్యరక్షణ.!
కాండం తొలుచు పురుగు:
పురుగు గుర్తింపు లక్షణాలు:
రెక్కల పురుగులు పసుపు, గోధుమ రంగులో ఉండి రెక్కల చివరి అంచున నల్లటి మచ్చలను కలిగి ఉంటాయి. లద్దె పురుగు మాసిన తెలుపు రంగులో ఉండి తల గోధుమ రంగులోను శరీరంపై అనేక మచ్చలుకలిగి ఉంటాయి.
లక్షణాలు: ఈ పురుగు పంటను విత్తిన 30 రోజుల తరువాత నుండి పంట కోసే వరకు ఆశిస్తుంది.గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగుల మొప్వు దగ్గర గుమిగూడి మొవ్వు నుండి బయటకు వస్తున్నలేత ఆకులను తింటాయి. దీనివలన మొవ్వు చనిపోవడం జరుగుతంది. దీనిని ” deadheart ” అంటారు.ఈ పురుగులు గుండ్రని వరుసలలో రంధ్రాలు ఆకులపైన ఏర్పరడు తాయి.
ఆకులపై రంధ్రాలు, మొవ్వు దగ్గర వలచిన గుజ్జు, కాండపు కణుపుల వద్ద రంధ్రాలు గమనించవచ్చు.గొంగళి పురుగు రెండు, మూడు దశలలో కాండం లోనికి చేరి తొలుచుకొని పోయి మొవ్వును, కాండమును తింటాయి. అందువలన మొవ్వు చనిపోతుంది. మొవ్వు దగ్గర తొలచిన గుజ్జు, ఆకులపై రంధ్రాలు, కణుపుల వద్ద రంధ్రాలు, మొవ్వు వద్ద విసర్జించిన మలము గమనించవచ్చు.కంకులు ఏర్పడిన తరువాత తొడిమలను ఆశించినట్లయితే కంకులు విరిగిపోతాయి.
నివారణ చర్యలు: మొక్క మొదలు వరకు కోసి, పోలoను లోతుగా దున్ని కొయ్యకాలను నాశనం చేయాలి.పంట మార్పిడి చేయాలి.ఈ పురుగు నివారణ కొరకు 30-40 రోజుల లోపున కార్బోప్యూరాన్ 3జి గుళికలను 3 కేజిలు ఒక ఎకరాకు మొక్కల సుడులలో లేక మొవ్వులో వేయాలి. లేదా క్లోరాంట్ర నిలిప్రోల్ 0.3 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి 2-3 సార్లు 8-10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
Also Read: Pest Management in Sorghum: జొన్నను ఆశించు తెగులు – వాటి నివారణ