చీడపీడల యాజమాన్యం

Rice Stem Borer: వానాకాలం లో వరి కాండము తొలుచు పురుగు ఇలా నివారించండి.!

2
Rice Stem Borer
Rice Stem Borer

Rice Stem Borer – లక్షణాలు: మొదట గ్రుడ్డు నుండి బయటకు వచ్చిన గొంగళి పురుగులు కొన్ని గంటలు ఆకులపై తిరుగుతూ ఆకులలోని పత్రహరితాన్ని గోకి తింటూ తరువాత ఊలు దారంతో వ్రేలాడుతూ మొక్క మొదలు (నీటి పై భాగము) లేదా కాండము చివరి తొడిమి భాగంలో రంధ్రం చేసి లోపలి భాగాలను తింటు జీవిస్తాయి.ఈ పురుగు వరి పంట పిలకలు వేసే దశ లేదా చిరు పొట్ట దశలో ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. పిలకలు వేసే దశలో ఆశించిన యెడల మొవ్వులు ఎండిపోయి చనిపోతాయి. దీనినే “డెడ్ హార్ట్స్” అని అంటారు. ఈ మొవ్వలను లాగితే తేలికగా ఊడి వస్తాయి. మొవ్వను చీల్చి చూసినట్లయితే దానిలో గొంగళిపురుగు గానీ లేదా అది విసర్జించిన మలము, పిప్పి గానీ గమనించవచ్చు.

ఈ పురుగు పైరు చిరుపొట్ట దశలో లేదా కంకి బయటకు వచ్చే దశలో ఆశించినట్లయితే తయారవుతున్న గింజలకు పోషకాలు అందక తాలు గింజలుగా మారి తెల్లకంకి” ఏర్పడుతుంది.సాధారణంగా వరి కంకిలోని గింజలు బరువుకి, తలవాల్చి సహజవర్ణము కలిగివుంటాయి. కానీ పురుగు ఆశించిన కంకులు తెల్లగా నిటారుగా నిలబడి దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి.

నివారణ చర్యలు: వేసవిలోతు దుక్కులు చేయాలి.ఈ పురుగును తట్టుకునే రకాలైన రత్న సస్యశ్రీ, వికాస్, గౌతమి, ఐఆర్-20, 26, ఆర్.పి-2815 రకాలను సాగు చేయాలి.వరి నారు కట్టలను మందు ద్రావణంలో (క్లోరిపైరిపాస్ 20% ఈ.సి. 1 మిలీ/లీటరు నీటికి) దాదాపు 2 గంటల పాటు ఉంచి ప్రధాన పొలంలో నాటినట్లయితే 20 నుండి 25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు పైరుపై ఆశించకుండ కాపాడుకోవచ్చు. ఈ పద్ధతిని “సీడింగ్ రూట్ డీప్ పద్ధతి అని అంటారు.వరి నాటడానికి ముందు నారు కట్ట కొనలను త్రుంచి నాటినట్లయితే ఆకు చివర బాగాన పెట్టిన గ్రుడ్లను నాశనం చేయవచ్చు.

Also Read: Transmissible Gastro Enteritis in Pigs: పందులలో ట్రాన్సిమిసబుల్ గ్యాస్ట్రా ఏంటి రైటిస్ వ్యాధి కి ఇలా చికిత్స చెయ్యండి.!

Rice Stem Borer

Rice Stem Borer

ఈ పురుగు తల్లి పురుగు కాంతికి ఆకర్షించబడుతుంది. కనుక అక్కడక్కడ దీపపు ఎరలను (లైట్ ట్రాప్స్) అమర్చి తల్లిపురుగును నాశనం చేయవచ్చు.తల్లి పురుగు ఉనికి గమనించుట కొరకు 1 ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయాలి.ఈ పురుగు గ్రుడ్డు దశలను గమనించిన వెంటనే గ్రుడ్డుపై ఆశించే పరాన్న జీవి అయిన ట్రైకోగ్రమా పరాన్న జీవిని 1 ఎకరానికి 20,000-25,000 వదలి ఆకరికట్టవచ్చును.వరి పొలంలో సహజ మిత్ర పురుగుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఎలాంటి రసాయినిక మందులను వాడనవసరము లేదు లేదా తేలిక పాటి మందులను వాడాలి.

వరి పంటను కోసేటప్పుడు మొక్క మొదళ్ళను భూమట్టానికి దగ్గరగా కోసినట్లయితే తరువాత పంటపై ఆశించే కాండము తొలుచు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు.ఈ పురుగు నివారణ కొరకు చిరుపొట్ట దశకు ముందుగా కార్పోప్యురాన్ 3జి గుళికలను 8-10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి 8 కిలోలు ఒక ఎకరానికి వేయాలి.రసాయనికి పురుగు మందులైన ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రాములు లేదా పాప్ఫోమిడాన్ 2.0 మి.లీ లేదా క్లోరాంట్ర నిలిప్రోల్ 0.3 మి.లీ. లను ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Also Read: Drip Irrigation Techniques: డ్రిప్ నీటి పారుదలలో కొన్నిమెళుకువలు.!

Leave Your Comments

Rules for Watering: నీటిని పెట్టే నియమావళిని తెలుసుకోండి.!

Previous article

Green House Structure: హరిత గృహాల రకాలు మరియు వాటి నిర్మాణాల గురించి తెలుసుకోండి.!

Next article

You may also like